Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About Sir Isaac Newton సర్ ఐజాక్ న్యూటన్ గారి గురించి

సర్ ఐజాక్ న్యూటన్
( జనవరి 4, 1643 - మార్చి 31, 1727) ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఒక సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలో అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. 
ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం మరియు అది సైన్సుగా ఎలా పరిణామం చెందింది? అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవస్తుంది. 1687లో ప్రచురితమైన ఆయన శాస్త్ర గ్రంథం en:Philosophiæ Naturalis Principia Mathematica, సైన్సు చరిత్రలో అత్యంత ముఖ్యమైన రచన.
About Sir Isaac Newton సర్ ఐజాక్ న్యూటన్ గారి గురించి
ఈ గ్రంథంలో గురుత్వాకర్షణ శక్తి గురించి, న్యూటన్ ప్రతిపాదించిన మూడు గమన నియమాల గురించి ప్రస్తావించాడు. తరువాతి మూడు శతాబ్దాల పాటు భౌతిక ప్రపంచానికి సైన్సు దృక్కోణంగా వెలుగొందిన యాంత్రిక శాస్త్రానికి తరువాత ఆధునిక ఇంజనీరింగ్ కూ ఈ గ్రంథమే పునాది. ఏదైనా ఒక వస్తువు యొక్క గమనం, భూమి మీదైనా లేక ఇతర గ్రహాలమీదైనా ఒకే రకమైన నియమాల మీద ఆధారపడి ఉంటుందని నిరూపించాడు. దీనికి ఆధారంగా కెప్లర్ నియమాలకూ మరియు గురుత్వాకర్షణ సిద్ధాంతాలకూ గల సామ్యాన్ని దృష్టాంతంగా చూపాడు. దీంతో సూర్య కేంద్రక సిద్ధాంతంపై పూర్తిగా అనుమానం తొలిగిపోవడమే కాకుండా ఆధునిక సైన్సు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది.
విజ్ఞాన శాస్త్ర రంగం మీదకు ఐన్ స్టయిన్ వచ్చేదాకా మూడు దశాబ్దాల పాటు శాస్త్ర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినవాడు ఐసాక్ న్యూటన్. ఇప్పటికీ ఆయన చలన సూత్రాలు కొన్ని పరిమితులకు లోబడి సజావుగా పనిచేస్తోనే ఉన్నాయి.మూడు వందల ఏళ్ళపాటు భౌతిక శాస్త్రంలోనూ గణిత శాస్త్రంలోనూ అంతటి ప్రతిభాశాలి, అంతటి ప్రభావశీలి మరొకరు లేరు. ఆయన కాలంలో ఆయననూ ఆయనలాంటివారినీ ప్రకృతి తాత్వికులుగా పిలిచేవారు.
సంఘటనా మయమూ సంవాద భరితమూ అయిన ఆయన జీవితాన్నీ ఆయన కృషినీ పొందు పరిచారు

ఐజాక్ న్యూటన్ వంటి మనిషిని మీరే కాదు, మరెవరూ చూచి ఎరుగరు. అతను చాలా చికాకు మనిషి. మనుషులంటే నచ్చని వాడు. ఎప్పుడు ఎలాగ ఉంటాడో తెలియదు. అందరూ తనకు శత్రువులు అనుకుంటాడు. ఎంతో రహస్యంగా ఉంటాడు. చివరికి అన్నం తినడం కూడా మరిచిపోతాడు. అతనిలో ఎవరికీ నచ్చని గుణాలు ఎన్నో ఉండేవి. కానీ అతను చాలా తెలివిగలవాడు. చాలా చాలా తెలివిగలవాడు. ఆ తెలివి కారణంగానే ప్రపంచం ఒక కొత్తబాటలో నడిచింది. అతను లెక్కలు చెప్పాడు. చిన్న, పెద్ద వస్తువుల మధ్యన ఉందే ఆకర్షణ గురించి చెప్పాడు. వస్తువుల కదలిక గురించి కూడా చెప్పాడు. ఐజక్ న్యూటన్ అన్న మనిషి ఆ కాలంలో ఆ సంగతులను ప్రపంచానికి వివరించకుంటే, సైన్స్ ఇవాళ ఇలా ఉండేది కాదు. ప్రపంచంలోని చాలా విషయాలు ఇవాళ ఇలా ఉండేవి కావు.

మొదటి సూత్రము

"బాహ్యబల ప్రయోగము లేనంత వరకు చలన స్థితిలో ఉన్న వస్తువు చలన స్థితిలోను, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనూ ఉంటుంది". ఈ వస్తు ధర్మాన్ని జడత్వము అంటారు.

రెండవ సూత్రము

"ఒక వస్తువు ద్రవ్యవేగంలోని మార్పు ఆ వస్తువు పై ప్రయోగించిన బలానికి అనుపాతముగా ఉంటుంది. మరియు ఆ బలం ప్రయోగించిన దిశలో ఉంటుంది

ప్రచోదనం

ఒక ప్రచోదనం j, ఒక బలం f, ఒక సమయం Δt లో ఒక వస్తువుపై పనిచేస్తే కలుగుతుంది

న్యూటన్ మూడవ నియమం

ఇది అసలైనది
న్యూటన్ సూత్రాన్ని దృష్టాంతం చేయడానికి ఇద్దరు స్కేటర్లు వ్యతిరేఖ దశలో ఒకరిని ఒకరు గెంటుకొనుచున్నారు.ఎడమవైపు మొదటి స్కేటర్ 12 కుడి వైపు దిక్కునకు, మరియు రెండవ స్కేటర్ N21 ఎడమ వైపు దిక్కునకు బలాన్ని ప్రయోగిస్తున్నారు.ఇద్దరి బలాలు సమానం కానీ న్యూటన్స్ మూడవ సూత్రం ప్రకారం వ్యతిరేఖ దశలో ప్రయోగించబడ్డాయి.
అన్ని శక్తులు రెండుగా ఉంటాయి.ఉదాహరణకు A, B అనే రెండు వస్తువులు ఉంటే A మీద B F (A) అనే శక్తిని ఉపయోగిస్తే, B మీద A F (B) ఏ‌ఎన్‌ఈ శక్తిని వ్యతిరేఖంగా కలిగిస్తుంది.

చర్యకు ప్రతి చర్య సమనంగా ఉండి వ్యతిరేక దిశలో పనిచేయును.

F (A) =-F (B)

(-గుర్తు వ్యతిరేకతను సూచిస్తుంది)

ఉదాహరణ: రాకెట్

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "About Sir Isaac Newton సర్ ఐజాక్ న్యూటన్ గారి గురించి"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0