Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Why we are celebrating holy‘హోలీ’ ఎందుకు జరుపుకుంటారు?

‘హోలీ’ ఎందుకు జరుపుకుంటారు?

రంగుల పండుగ హోలీ వచ్చేసింది. గురువారం దేశవ్యాప్తంగా ఈ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ రంగుల్లో మునిగి తేలడానికి సిద్ధమవుతున్నారు. అయితే అసలు ఈ హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా? వసంతం మొదలయ్యే ముందు జరుపుకునే ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇండియాలోని హిందువులు, నేపాల్ దేశస్థులు ఈ హోలీని జరుపుకుంటారు. హిందూ కేలండర్ ప్రకారం ఫాల్గుణ పౌర్ణిమ రోజున ఈ రంగుల పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.
‘హోలీ’ ఎందుకు జరుపుకుంటారు?

హోలికా నుంచి హోలీ
హిందూ పురాణాల ప్రకారం ఈ హోలీ జరుపుకోవడం వెనుక ఓ బలమైన కారణమే ఉంది. రాక్షసుల రాజు హిరణ్యకశిపుడు తెలుసు కదా. అతని సోదరే ఈ హోలికా. బ్రహ్మ దేవుడు ఇచ్చిన వరంతో హిరణ్యకశిపుడిని చంపడం దాదాపు అసాధ్యంగా మారడంతో అతడు అహంభావిగా మారతాడు. ఆ అహంకారంతోనే స్వర్గంతోపాటు భూమిపై కూడా దాడులు చేస్తుంటాడు. అయితే హిరణ్యకశిపుడి తనయుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తుడు. దేవుడిని పూజించడం మానుకోవాలని ప్రహ్లాదునికి ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో అతన్ని చంపడానికి హిరణ్యకశిపుడు ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమవుతాడు. చివరగా తన సోదరి హోలికా ఒడిలో కూర్చోవాల్సిందిగా ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ఆదేశిస్తాడు. అగ్ని దహించకుండా హోలికా ఓ వరాన్ని పొందుతుంది. ఆమె ఒడిలో ప్రహ్లాదున్ని కూర్చోబెట్టి అగ్నికి ఆహుతి చేయాలని హిరణ్యకశిపుడు భావిస్తాడు. అయితే ఆ ప్రయత్నమూ విఫలమవుతుంది. ఆ మంటల్లో హోలికా పూర్తిగా కాలిపోయి మరణిస్తుంది. ప్రహ్లాదుడు పొందిన ఈ మోక్షాన్ని, హోలికా దహనమవడాన్ని హోలీగా జరుపుకుంటారు. అందుకే హోలీకి ముందు రోజు హోలికాను దహనం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే దక్షిణ భారతదేశంలో దీనినే కామదహనంగా వ్యవహరిస్తున్నారు. కృష్ణుడు జన్మించిన మధురలో ఈ హోలీ పండుగను 16 రోజుల పాటు జరుపుకుంటారు. ఉత్తర భారతంలో హోలీ నాడు భంగు అనే మత్తు పానీయాన్ని సేవించడం కూడా ఆనవాయితీగా వస్తున్నది.


‘హోలీ’ వస్తుందంటే చాలు.. దేశమంతా పండుగే. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని ‘హోళికా పుర్ణిమ’గా కూడ వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను.. హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ పండుగ పుట్టుపుర్వోత్తరాల గురించి పురాణాల్లో భిన్నగాథలు ప్రచారంలో ఉన్నాయి.

ఇది అసలు కథ

రాక్షస రాజు హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణు మూర్తిని స్మరిస్తుంటాడు. అది హిరణ్యకశపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షస సోదరి హోళికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కొరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. అయితే, విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయపడగా, హోళిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోలిక దహనమైన రోజునే ‘హోలీ’ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ ‘హోలిక’ దహనం నిర్వహిస్తారు.

హోళికపై మరో కథ

కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు వుండేవాడు. ఓ రోజు ప్రజలంతా వచ్చి ‘హోళిక’ అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తోందని మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి.. ఏటా ఫాల్గుణ పూర్ణిమ రోజు హోళికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు. ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని, అంతా రాత్రివేళ నిర్వహించాలని వివరిస్తాడు. దీంతో అప్పటి నుంచి ‘హోలీ’ పూజలు నిర్వహిస్తున్నట్లు పూర్వికులు తెలుపుతుంటారు.

డోలిక అంటే ఏమిటి?

డోలిక అంటే ఉయ్యాల అని అర్థం. బాలబాలకృష్ణుడిని ఫాల్గుణ మాసం, పూర్ణిమ తిథిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఊయలలో వేసి ‘డోలికోత్సవం’ జరుపుతారు. ఈ హోలి రోజున శ్రీకృష్ణుడు.. రాధను ఊయాలలో పెట్టి రంగులు పులిమినట్లు కూడా చెబుతుంటారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Why we are celebrating holy‘హోలీ’ ఎందుకు జరుపుకుంటారు? "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0