Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Remuneration details for polling staff ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పారితోషికాలు, ఇతర అలవెన్సులు చెల్లింపు విషయంలో ఎన్నికల కమిషన్‌ కొత్త నిబంధనలు రూపకల్పన.

ఎన్నికల సిబ్బందికి ఒకేలా పారితోషికం..*

★ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పారితోషికాలు,  ఇతర అలవెన్సులు చెల్లింపు విషయంలో ఎన్నికల కమిషన్‌ కొత్త నిబంధనలు రూపకల్పన.

★ గతంలో వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల సొంత అంచనాలు, లెక్కల ప్రకారం ఈ చెల్లింపులు చేసేవారు. అందువల్ల ఒకే రకమైన బాధ్యతలు నిర్వహించిన వారికి వివిధ రకాల చెల్లింపులు జరిగేవి.
  Remuneration details for polling staff ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పారితోషికాలు,  ఇతర అలవెన్సులు చెల్లింపు విషయంలో ఎన్నికల కమిషన్‌ కొత్త నిబంధనలు రూపకల్పన.


★ ఇటువంటి అసమానతలు లేకుండా అన్ని నియోజకవర్గాల్లో ఒకే విధమైన చెల్లింపులు జరిపేందుకు వీలుగా ప్రత్యేక నిబంధనావళి రూపకల్పన.

★ ప్రిసైడింగ్‌ అధికారి, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు రెండ్రోజుల శిక్షణ తరగతులు, పోలింగు ముందురోజు, పోలింగ్‌ రోజు మొత్తం నాలుగు రోజులకు రోజుకు రూ.600 చొప్పున రూ.2,400 చెల్లిస్తారు.

★ దీంతోపాటు పోలింగ్‌ రోజు ఫుడ్‌ అలవెన్సుగా రూ.150 చెల్లిస్తారు. అంటే పీవో, ఏపీవోలకు రూ.2,550 చొప్పున ఇస్తారు.

★ ఇతర పోలింగ్‌ పర్సన్స్‌ (ఓపీవో)కు ఒక రోజు శిక్షణ, పోలింగ్‌ ముందు రోజు, పోలింగ్‌ రోజు మొత్తం మూడ్రోజులకుగాను రోజుకు రూ.400 చొప్పున రూ.1,200, పోలింగ్‌ రోజు భోజనానికి రూ.150 కలుపుకుని మొత్తం రూ.1,350 చెల్లిస్తారు.

★ మైక్రో అబ్జర్వర్లకు ఒకరోజు శిక్షణ, పోలింగ్‌ ముందురోజు, పోలింగ్‌ రోజు మొత్తం మూడ్రోజులకుగాను రోజుకు రూ.400 చొప్పున రూ.1,200, అదనంగా భోజన అలవెన్సు రూ.150 కలుపుతారు. వీరికి ప్రత్యేకంగా రూ.వెయ్యి గౌరవ వేతనం కలిపి రూ.2,350 చొప్పున ఇస్తారు.

★ వెబ్‌కాస్ట్‌ పనులు నిర్వహించేవారికి ఎన్నికల రోజు భోజనానికి రూ.150, గౌరవ వేతనం రూ.900 చొప్పున మొత్తం రూ.1,050 చెల్లిస్తారు.

★ కౌంటింగ్‌ సూపర్‌వైజర్లకు, మైక్రో పరిశీలకులకు రెండ్రోజుల శిక్షణ, పోలింగ్‌ రోజు బాధ్యతలు మొత్తం మూడ్రోజులకుగాను రోజుకు రూ.600 చొప్పున రూ.1800, పోలింగ్‌ రోజున భోజనాల అలవెన్సు రూ.150తో మొత్తం రూ.1,950 ఇస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " Remuneration details for polling staff ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పారితోషికాలు, ఇతర అలవెన్సులు చెల్లింపు విషయంలో ఎన్నికల కమిషన్‌ కొత్త నిబంధనలు రూపకల్పన."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0