Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New PRC News

New PRC News

29 శాతం ఫిట్‌మెంట్‌?
కనీస వేతనం 21వేలకు పెరిగే చాన్స్‌..!
సిద్ధమవుతున్న పీఆర్సీ నివేదిక
కొత్త ప్రభుత్వానికి ఇవ్వనున్న సంఘం
రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 29శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.

New PRC News

ఈ మేరకు పీఆర్సీ నివేదికను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. 2015లో వీరికి ఇచ్చిన 42శాతం ఫిట్‌మెంట్‌తో పోలిస్తే ఇది తక్కువే. ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 20శాతం మధ్యంతర భృతి వచ్చేనెల 1నుంచి అమల్లోకి వస్తుంది. 2015 పీఆర్సీ ప్రకారం కనీస వేతనం రూ.13,000, గరిష్ఠ వేతనం రూ.1,10,850గా ఉంది. ప్రస్తుతం 29శాతం ఫిట్‌మెంట్‌ను అమలుచేస్తే కనీస వేతనం రూ.21,000కు గరిష్ఠ వేతనం రూ.1,86,510కి చేరనుంది. దీనిప్రకారం రేట్‌ ఆఫ్‌ ఇంక్రిమెంట్‌ 3శాతానికి కొంచెం ఎక్కువగా ఉండనుంది. వార్షిక ఇంక్రిమెంట్‌ కనిష్ఠంగా రూ.640నుంచి గరిష్ఠంగా రూ.4,450కి పెరగనుంది. 10వ పీఆర్సీ ప్రకారం కనీస వార్షిక ఇంక్రిమెంట్‌ రూ.390ఉండగా, గరిష్ఠ వార్షిక ఇంక్రిమెంట్‌ రూ.2,520గా ఉంది. రాష్ట్ర ఉద్యోగులకు 11వ వేతన సవరణ సంఘాన్ని నియమిస్తూ 2018 మే 28న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పీఆర్సీ చైర్మన్‌గా అశుతోష్‌ మిశ్రాను నియమించారు.
ఈ సంఘం ఏడాదిగా ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి వినతి పత్రాలను స్వీకరించింది. ప్రస్తుతం ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ పథకం, ప్రత్యేక వేతన చెల్లింపులు, మెడికల్‌ సౌకర్యాలు, కరువు భత్యం, నగర నివాస భత్యం, ఇంటి అద్దె చెల్లింపులు, ఎల్టీసీ వంటి వాటిపైనా సూచనలను తీసుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు 30- 60శాతం ఫిట్‌మెంట్‌ను కోరాయి. ఈ ప్రతిపాదనలతో పాటు పెరుగుతున్న ధరలను అంచనా వేస్తూ, ఆర్థిక నిపుణులతో పలు దఫాల చర్చల అనంతరం ఫిట్‌మెంట్‌ను 29శాతంగా నిర్ణయించినట్టు తెలిసింది. పీఆర్సీని ఏర్పాటు చేస్తూ జీవో వచ్చిన ఏడాదిలోగా సిఫారసులు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో ఈనెల 23తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సమాయత్తమవుతోంది. పీఆర్సీ అమలు వల్ల రాబోయే కాలంలో పెరిగే ఆర్థిక భారంపై కూడా వివరాలు సేకరించింది. ప్రభుత్వపరంగా ఖర్చులు తగ్గించుకునేందుకు వివిధ శాఖలు తీసుకుంటున్న చర్యలు, ఆదాయాన్ని పెంచేందుకు అమలు చేస్తున్న కార్యక్రమాలపైనా పీఆర్సీ దృష్టి సారించింది.

ఎవరికి వర్తిస్తుంది?

రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌ సంస్థలు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ, జేఎన్‌టీయూల్లో బోధనేతర సిబ్బంది, వర్క్‌చార్జ్‌డ్‌ ఉద్యోగులు, ఫుల్‌టైమ్‌ కంటింజెంట్‌ ఉద్యోగులు కమిషన్‌ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాల బోధనా సిబ్బంది వ్యవహారాలు దీని పరిధిలోకి రావు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New PRC News"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0