Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About Chandrampalem school

About Chandrampalem school

42 సెక్షన్లు, 88 మంది ఉపాధ్యాయులతో రికార్డు
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మంది విద్యార్థులను కలిగిన పాఠశాలగా కీర్తి
ఈ ఏడాది 1031 మంది చేరిక
కార్పొరేట్‌ పాఠశాలలను వీడిమరీ వస్తున్న వైనం
ప్రజాశక్తి - పిఎం.పాలెం 

ఎందరినో మేధావులుగా, ప్రయోజకులుగా తీర్చిదిద్దిన పాఠశాల అది. సువిశాలమైన ఐదెకరాల ప్రాంగణం.. 42 సెక్షన్లు.. 88 మంది ఉపాధ్యాయులు.. ఇద్దరు ప్రధానోపాధ్యాయులు.. అత్యాధునిక తరగతి గదులు, డిజిటల్‌ ల్యాబ్‌లు, విశాలమైన ఆటస్థలం... ఇలా ఎన్నో ప్రత్యేకతలు దీని సొంతం. ఇన్ని సౌకర్యాలు, ఇంత మంచి విద్యను కలిగి ఉన్న ఈ పాఠశాల ఏ కార్పొరేట్‌ స్కూలునో అని అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.
About Chandrampalem school

ఇది సర్కారు బడి. మంచి బోధనా పద్ధతులుతో సాగుతున్న చదువుల ఒడి. అదే నగరంలోని చంద్రం పాలెం పాఠశాల. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ పాఠశాలలో పిల్లలను చదివించేందుకు ప్రస్తుతం జనం క్యూ కడుతున్నారు. అసలింతకీ ఈ పాఠశాలలో ఏం సౌకర్యాలున్నాయి ? ఈ ఏడాది ఎంత మంది చేరారు ? ఎటువంటి విద్యా ప్రణాళికలు అవలంబిస్తున్నారు ? అన్న విషయాలతో సాగేదే ఈ కథనం.
తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా 3550 మంది విద్యార్థులను కలిగిన ఏకైక ప్రభుత్వ పాఠశాల ఇది. దీనిలో విద్యార్థులను చేర్పించేందుకు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న వారు ఎంతోమంది ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులను కూడా అక్కడి నుంచి మాన్పించి, ఇక్కడ సౌకర్యాలకు ఆకర్షితులై చేర్చిన ఘటనలు అనేకం ఉన్నాయి.
87 మందితో మొదలై...
ఈ పాఠశాల 1979లో 87 మంది విద్యార్థులతో ఆవిర్భవించింది. నేటికి 3550 మందితో కొనసాగుతోంది. గతేడాది విద్యార్థుల సంఖ్య 3375గా ఉంది. ఈ ఏడాది పదో తరగతి పూర్తి చేసుకొని 657 మంది విద్యార్థులు బయటికి వెళ్లినప్పటికీ 3550కి విద్యార్థుల సంఖ్య పెరగడం విశేషం.
కార్పొరేట్‌ పాఠశాలల నుంచి చేరిక
ఈ ఏడాది చంద్రంపాలెం పాఠశాలలో చేర్పించేందుకు విశాఖ నగర పరిధిలో ఉన్న 36 కార్పొరేట్‌ పాఠశాలల నుంచి 720 మందికిపైగా విద్యార్థులు వచ్చారు. గతేడాది 20 రోజుల్లో 600 మంది చేరగా, ఈ ఏడాది కేవలం 15 రోజుల్లోనే 720 మంది కార్పొరేట్‌ పాఠశాలలను వీడి చంద్రంపాలెం పాఠశాలలో చేరేందుకు క్యూ కట్టారు.
బోలెడు సౌకర్యాలు
కార్పొరేట్‌ స్కూళ్లుకు దీటుగా ఇంగ్లీష్‌ మీడియం బోధన జరుగుతోంది. డిజిటల్‌ తరగతులు, ఒక కంప్యూటర్‌ ల్యాబ్‌, రెండు స్పెషల్‌ లేబొరేటరీలు, వర్చువల్‌ క్లాస్‌ రూమ్‌, క్రీడా పరికరాల గది, బాస్కెట్‌ బాల్‌ కోర్టు, కబడ్డీ కోర్టులు ఇక్కడ ఉన్నాయి. సంగీతం కోర్సు నేర్పుతున్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం అందుతోంది. పేరెన్నికగన్న వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారు.

ఈ ఏడాది చేరికలు ఇలా..
తేదీ.. చేరిన విద్యార్థుల సంఖ్య

12.6.19 132
13.6.19 122
14.6.19 135
15.6.19 73
17.6.19 157
18.6.19 87
19.6.19 87
20.6.19 64
21.6.19 44
22.6.19 40
24.6.19 48
25.6.19 38
మొత్తం విద్యార్థుల సంఖ్య 1031

సువిశాల ప్రాంగణం
సువిశాల క్రీడా మైదానం ఇక్కడ ఉంది. గౌతమ బుద్ధుడు, గాంధీజీ, సరస్వతి దేవి, అబ్దుల్‌ కలాం విగ్రహాలు చూడముచ్చటగా ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా సోలార్‌, విండ్‌ పవర్‌ ఎనర్జీ ఉత్పత్తి ద్వారా విద్యుత్‌ను వాడుకుంటున్నారు.

మంచి విద్య అందుతుందని చేర్చాం
మేం మధురవాడ ప్రాంతంలోని సాయిరాం కాలనీలో ఉంటాం. కూలి పని చేసుకుని జీవిస్తున్నాం. మా అబ్బాయి కిరణ్‌ ఆరో తరగతి వరకు పాలవలసలో చదివేవాడు. అక్కడ పదో తరగతి వరకు విద్యాభ్యాసం ఉన్నా చంద్రంపాలెం పాఠశాల గొప్పతనం గురించి విని ఈ పాఠశాలలో ఏడో తరగతిలో చేర్పించడానికి నిర్ణయించుకున్నాం.
కె.లక్ష్మి, సాయిరాం కాలనీ

ప్రయివేటు పాఠశాల కన్నా ఎంతో మిన్న
మధురవాడలోని గణేష్‌ నగర్‌ ప్రాంతంలో ఉంటున్నాం. కూలి పనే ఆధారం. మాకు ఇద్దరు పిల్లలు. వారి పేర్లు రిషి, రేష్మ, ఇద్దరినీ చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నాను. వారిని ఆరో తరగతి నుంచి చంద్రంపాలెం పాఠశాలలో చేర్చాం. ప్రయివేటు పాఠశాలల కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఇక్కడ విద్య అందుతోంది. మా పిల్లలిద్దరికీ మంచి మార్కులు వస్తున్నాయి. ఆర్థిక భారం తప్పింది. ఇన్ని సౌకర్యాలు ఉన్న పాఠశాల ఉంటే ప్రయివేటువైపు ఎందుకు చూస్తాం చెప్పండి. ఇలాంటి పాఠశాలలు మరిన్ని ఉండాలి.
ఎం.స్వప్న, గణేష్‌ నగర్‌

ఈ పాఠశాలలో చేర్పించినందుకు ఆనందంగా ఉంది
మేం మధురవాడ వాంబే కాలనీ ప్రాంతంలో నివసిస్తున్నాం. మా అబ్బాయి పేరు టి.మౌళి. వాడు ఇప్పటి వరకు మధురవాడ శ్రీత ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివాడు. అధిక ఫీజులు కట్టలేక చంద్రం పాలెం పాఠశాలలో చేర్చాం. నా భర్త చనిపోయాడు. కుమారుడు విద్య ఆగిపోతుందని భయపడ్డాను. ఇంతలోనే చంద్రంపాలెం పాఠశాల గురించి కొందరు చెప్పారు. ఇక్కడ నా కుమారున్ని చేర్చించినందుకు ఆనందపడుతున్నాను.
టి.రామయ్యమ్మ, వాంబే కాలనీ

ఎంతో గొప్ప పాఠశాల
నా పిల్లలు మధురవాడలోని ఒక ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో చదివేవారు. ప్రయివేటు పాఠశాలలో మంచి విద్య అందుతుందని తొలుత నేను భావించాను. కానీ ఈ పాఠశాలను చూసిన తరువాత నా అభిప్రాయం తప్పని అర్థమైంది. అందుకే అమ్మాయిని ప్రయివేటు స్కూలు మానిపించి చంద్రంపాలెం పాఠశాలలో చేర్చాను. నాతో పాటు మా చుట్టు పక్కల ఉన్న మరో ఇరవై మంది విద్యార్థులను కూడా ప్రయివేటు పాఠశాలలు మాన్పించి ఇక్కడే చేర్చేలా చూశాను. ఇక్కడ చదివితే టెన్త్‌లో పదికి పది పాయింట్లు వస్తాయన్న నమ్మకం ఉంది.
ఎస్‌.తిరుపతి రావు, ప్రయివేటు ఉద్యోగి

గర్వంగా ఉంది
ప్రతిఏటా విద్యార్థులు అధిక సంఖ్యలో చేరుతుండడంతో మాకు గర్వంగా అనిపిస్తోంది. ఇటువంటి పాఠశాలలో మేం పని చేస్తున్నందుకు ఎంతో ఆనందం కలుగుతోంది. తెలుగు రాష్ట్రాలలో అధిక విద్యార్థులను కలిగిన పాఠశాలగా మా స్కూలు ఎదిగింది. స్థానిక నాయకులు, ఉన్నతాధికారులు, పూర్వ విద్యార్థుల సహకారంతో ఈ పాఠశాల అభివృద్ధి సాధ్యమవుతోంది. మా పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్యను అందించేందుకు ఎంతో కృషి సలుపుతున్నాం. మంచి ఫలితాలు సాధిస్తున్నాం.
ఎం.రాజబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "About Chandrampalem school"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0