Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ammaodi

ఇంటర్‌కూ అమ్మ ఒడి

రెసిడెన్షియల్ విద్యార్థులకూ అమలు

చదువు నుంచి కొలువు దాకా అండ

నెల రోజుల్లో వీసీల నియామకం

విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్‌ స్పష్టీకరణ

అమరావతి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): పిల్లలను బడికి పంపించే తల్లులకు మాత్రమే కాదు... జూనియర్‌ కాలేజీలకు పంపించే వారికీ 'అమ్మ ఒడి' అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియెట్‌ విద్యార్థుల తల్లులకూ ఈ పథకం వర్తిస్తుందని సీఎం జగన్‌ ప్రకటించారు. అలాగే... హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదివే విద్యార్థుల తల్లులకూ ఈ పథకం కింద ఏటా రూ.15వేలు అందిస్తామన్నారు.

తెల్లరేషన్‌ కార్డు ఉండటమే అర్హత 

ప్రాతిపదిక అని స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యావ్యవస్థ, విద్యను బోధిస్తున్న సంస్థలు, కాలేజీల్లో పరిస్థితులపై విద్యాశాఖ మంత్రి సురేశ్‌తోపాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒక పిల్లాడు స్కూలుకు వెళ్లిన దగ్గర నుంచి, చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం సాధించుకునేదాకా ప్రభుత్వరంగ విద్యా సంస్థలు బలోపేతంగా ఉండాలని స్పష్టం చేశారు.
బడులు ఇలాగా...

బడి తెరిచిన వారంలోనే పుస్తకాలు అందించాలన్నారు. ఇకపై విద్యార్థుల యూనిఫామ్‌, బూట్లు, సాక్సులు తామే కొనుక్కునేలా డబ్బులు ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి కాలేజీ పైనా, స్కూలుపైనా నివేదిక తయారు చేసుకోవాలని, వాటి ఫొటో తీసుకోవాలని సూచించారు. ప్రాధాన్య క్రమంలో ముందుగా బాత్‌రూమ్‌లు, ఫర్నిచర్‌, బ్లాక్‌ బోర్డులు, ఆ తర్వాత ఫ్యాన్లు, ప్రహరీ గోడ నిర్మాణం, రంగులు వేసుకోవడం, ఇతర ఫినిషింగ్‌ పనులు చేపట్టాలన్నారు. రెండేళ్ల తర్వాత మళ్లీ ఫొటోలు తీసి సదరు బడి లేదా కాలేజీ ఎలా మారిందో ప్రజలకు చూపాలన్నారు. హేతుబద్ధీకరణ పద్ధతిలో ప్రతి స్కూలులో 20-25 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉండేలా చూడాలన్నారు. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలని ఆయన చెప్పారు.

వర్సిటీల దశ మారాలి

'ప్రభుత్వ వర్సిటీలను క్రమంగా నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ వర్సిటీల దశ, దిశ మార్చాలి. ప్రమాణాలు పెంచాలి' అని జగన్‌ ఆదేశించారు. యూనివర్సిటీలకు వీసీల నియామకానికి సంబంధించి సెర్చ్‌ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. నెలరోజుల్లోగా వీసీల ఎంపిక ప్రక్రియ, పూర్తి పారదర్శకంగా పూర్తికావాలన్నారు. ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌, ఇతర అధ్యాపక, సిబ్బంది పోస్టులను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తిచేయాలని జగన్‌ ఆదేశించారు

ఫీజు-రీయింబర్స్‌మెంట్‌ ఎలా.

కాలేజీలు వసూలు చేస్తున్న ఫీజులు, ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని జగన్‌ పేర్కొన్నారు. దీన్ని పరిశీలించి ప్రామాణీకరించాలని (స్టాండర్‌డైజ్‌) ఆదేశించారు. లేకుంటే పేద, మధ్య తరగతి పిల్లలు ఫీజులు భరించలేరన్నారు. 'ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థికి ఏటా రూ.33వేలు ఖర్చు అవుతుందని ప్రభుత్వమే నిర్ధారించి... ఆ మేరకు ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. అదే సమయంలో కొన్ని కాలేజీలు ఏటా రూ.70వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేసుకునేందుకు ప్రభుత్వమే అనుమతి ఇస్తోంది. ఈ పద్ధతి మారాలి' అని జగన్‌ పేర్కొన్నారు. సమయానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇవ్వకపోతే కాలేజీలు ఎలా బతుకుతాయని ప్రశ్నించారు. కనీసం 3 నెలలకోసారి కాలేజీలకు నిధులు విడుదల చేయాలన్నారు.

*ట్రిపుల్‌ ఐటీలు ఇలాగా...*

ఒక ఉదాత్త ఆశయంతో ట్రిపుల్‌ ఐటీలను కడితే... వాటిని చేజేతులా నాశనం చేసుకున్నామని జగన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో వెంటనే పనులు పూర్తిచేయాలని, ఒంగోలులో పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. ట్రిపుల్‌ ఐటీల్లో 50ు మంది విద్యార్థులకు మా త్రమే ప్లేస్‌మెంట్‌ వస్తుందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.

సిలబస్‌ మారాలి..

సిలబ్‌సను మెరుగుపరచడానికి ఒక కమిటీని వేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పు చేసిన సిలబస్‌ అమల్లోకి రావాలన్నారు. దీనికి టైమ్‌బౌండ్‌ షెడ్యూల్‌ ప్రకటించాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీలను భర్తీచేసే ముందు ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా వారి అర్హతలను నిర్ధారించాలని, ఏపీపీఎస్సీ నిర్దేశించుకున్న అర్హతలను ఒకసారి పరిశీలించాలని ఆదేశించారు. వృత్తి నైపుణ్యం పెంచడానికి ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక కేంద్రాన్ని ఎంపిక చేయాలని సూచించారు. పాలిటెక్నిక్‌ కాలేజీల్లో కోర్సులను మెరుగుపరచాలని జగన్‌ తెలిపారు.®

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ammaodi"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0