Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A.P CABINET DESESSIONS

కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్
ప్రభుత్వ ఉద్యోగులకు 27% ఐఆర్‌, సీ.పీ.ఎస్ రద్దుకు కేబినెట్ ఆమోదం

A.P CABINET SESSIONS


 ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఐదున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే సమయంలో పాలనలో పారదర్శకత కొరవడొద్దని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అవినీతికి పాల్పడితే సహించేది లేదని సీఎం జగన్ హెచ్చరికలు చేశారు. అవినీతి చేసినట్లు తెలిస్తే తక్షణమే పదవి నుంచి తొలగిస్తానని సీఎం స్పష్టం చేశారు.

కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
♦సామాజిక పెన్షన్లు రూ.2250కి పెంపు
♦ఆశా వర్కర్ల జీతాలు 3000 నుంచి 10,000కు పెంపు
_♦ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ చెల్లింపునకు ఆమోదం. పెంచిన ఐఆర్‌ జులై నుంచి అమలు._
*♦సీపీఎస్ రద్దుకు కేబినెట్ ఆమోదం. ఇందుకోసం కమిటీ ఏర్పాటు. న్యాయ, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సీపీఎస్ రద్దు ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.*
♦జనవరి 26 నుంచి ‘‘అమ్మ ఒడి’’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులను ఈ పథకానికి అర్హులుగా పేర్కొన్నారు.
*♦ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ సుముఖత. కమిటీ ఏర్పాటు. ఈ కమిటీ మూడు నెలల్లో నివేదిక ఇవ్వనుంది.*
♦వైఎస్సార్‌ రైతు భరోసా అమలుపై కేబినెట్‌లో చర్చించారు. అక్టోబర్ 15 నుంచి అమలు చేయాలని నిర్ణయం.
♦గిరిజన సంక్షేమశాఖలోని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు. రూ. 400 నుంచి 4000 వరకు వేతనాల పెంచుతూ నిర్ణయం.
♦టీడీపీ హయాంలో ఉన్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలన్నీ రద్దు. పారదర్శకంగా కొత్త ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఏర్పాటు.
♦మున్సిపల్, పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.18వేలకు పెంపు.
♦కొత్త ఇసుక విధానం.
♦స్కాం లను వెలికితీస్తే అధికారులతో పాటు మంత్రులను సైతం సన్మానించాలని నిర్ణయించారు.
♦అన్ని నామినెటెడ్ పదవుల రద్దుకు త్వరలో ఆర్డినెన్స్.
ప్రతి ఏటా ఆరు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం.
♦అంగన్ వాడీ, హోంగార్డుల జీతాలు పెంపు.
         DOWNLOAD PDF 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A.P CABINET DESESSIONS"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0