Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Reforms in the CCE Examination Policy

 CCE పరీక్ష విధానం లో సంస్కరణలు

18/9/ 2018 లను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల. 

ఇందులోని ముఖ్యాంశాలు ఇలా...

Reforms in the CCE Examination Policy


★ 1). విద్యార్థి  100 మార్కులకు పరీక్ష వ్రాయవలసి ఉంటుంది.
80% S.A.2 ఫైనల్ పరీక్ష నుండి, 20% మార్కులు ఇంటర్నల్ గాను కేటాయిస్తారు.

★ 2). 6 నుండి 9 తరగతులకు 20% ఇంటర్నల్ మార్కుల ను 4 F.A. ల నుండి (50x4=200 m), మరియు S.A. 1లో  80 మార్కులు కలిపి మొత్తం 280 మార్కులకు లెక్కిస్తారు.

★ 3).10వ తరగతి విద్యార్థులకు 20% ఇంటర్నల్ మార్కులను తొలగించారు. ఎస్ఏ 1 పరీక్ష, ప్రీ ఫైనల్ పరీక్షలు, బోర్డు పరీక్షలు.. ప్రస్తుతం ఉన్న 11 పేపర్ల విధానంలోనే 100 మార్కులకు నిర్వహిస్తారు.
పేపర్–1 ను 50 మార్కులకు, పేపర్-2 ను 50 మార్కులకు నిర్వహిస్తారు. హిందీ 100 మార్కులకు ఒకటే పేపర్ ఉంటుంది.

★ 4) కాంపోజిట్ కోర్సులకు పేపర్–1 లో 70 మార్కులకు, పేపరు-2 ను 30 మార్కులకు నిర్వహిస్తారు.

★ 5). పదవ తరగతిలో 4 F.A. లను ఒక్కొక్కటి 50 మా. చొప్పున నిర్వహిస్తారు.

★ 6). 6 నుండి 10 తరగతుల SA1, SA 2 ప్రశ్నా పత్రాలు SCERT వారిచే గోప్యంగా రూపొందించబడి తగు పాస్వర్డ్ రక్షణతో DCEB లకు పంపుతారు.
DCEB లు వాటిని ప్రింట్ చేసి పాఠశాలలకు సరఫరా చేస్తుంది.

★ 7). 6-9 తరగతుల ప్రశ్నాపత్రాలకు సంబంధించిన బ్లూప్రింట్, వెయిటేజ్, నమూనా ప్రశ్న పత్రాలు, క్వశ్చన్ బ్యాంక్ లను & 10 వ తరగతి కి మోడల్ ప్రశ్నాపత్రాలను SCERT వారు విడుదల చేస్తారు.

★ 8). DEO చైర్మన్ గా గల DCEB ప్రశ్నాపత్రా లను ప్రింట్ చేయించి స్కూల్స్ కు సరఫరా చేస్తారు.

★ 9).1 నుండి 5 తరగతుల ప్రశ్నా పత్రాలు SCERT వారిచ్చిన క్వశ్చన్ బ్యాంకు నుండి జిల్లా కామన్ బోర్డువారు తయారు చేసి, స్కూల్స్ కు సరఫరా చేస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Reforms in the CCE Examination Policy"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0