Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The CPS can be annulled!

The CPS can be annulled!

ప్రజాశక్తి: 10.06.2019 

సిపిఎస్‌ రద్దు చెయ్యొచ్చు!
- విచక్షణాధికారం రాష్ట్ర సర్కారుదే!
- లేకపోతే ఒపిఎస్‌తో సమానమైన లబ్ది చేకూర్చాలి
- ప్రభుత్వానికి టక్కర్‌ కమిటీ నివేదిక
- నేడు మంత్రివర్గంలో చర్చ

The CPS can be annulled!

                             కంట్రిబ్యూటరీపింఛను విధానాన్ని రద్దు చేసే విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉరదని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. మాజీ సిఎస్‌ ఎస్‌పి టక్కర్‌ నేతృత్వంలో ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి 141 పేజీల నివేదికను సమర్పించినది. సిపిఎస్‌ను రద్దు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెబుతూనే రెండు ఆప్షన్లను కూడా ప్రభుత్వం ముందు ఉంచినది. అలాగే తన నివేదికలో ఓపిఎస్‌లో ఉద్యోగులు పొందుతున్న లబ్దిలో నాలుగో వంతు (25శాతం) మేరకే సిపిఎస్‌ ఉద్యోగులు పొందుతున్నారని నిగ్గు తేల్చినది. వాస్తవానికి ప్రభుత్వం భరిస్తున్న 10 శాతం వాటా మేరకు సిపిఎస్‌ ఉద్యోగులకు 25 శాతం మేలు కలుగుతోందని, దీనిని 20 శాతానికి పెంచినా మొత్తం లబ్ది 50 శాతం వరకే ఉంటుందని కమిటీ అభిప్రాయపడినది. ఈ నివేదిక ఆధారంగానే సోమవారం జరిగే తొలి మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నారు.
          1990 దశకంలో నెలకొన్న ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సిపిఎస్‌ను తెరపైకి తీసుకువచ్చింది. దీనిని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదిరచి అమలు చేయడం ప్రారంభిరచాయి. పశ్చిమ బెరగాల్‌, ఢిల్లీల్లో ఈ విధానాన్ని ఆమోదిరచలేదు. కేరళలో ఆనాటి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం తిరస్కరించినా ఆ తరువాత వచ్చిన యుడిఎఫ్‌ సర్కారు సిపిఎస్‌ను అమలు చేసింది. త్రిపుర మాత్రం గత ఏడాది సిపిఎస్‌కు ఆమోదాన్ని తెలిపిరది. అయితే మన రాష్ట్రంలో మాత్రం ఈ విధానం 2004 నుండి కొనసాగుతున్నప్పటికీ కొన్నేళ్లుగా దీనిని రద్దు చేయాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆరదోళనలు చేస్తున్నారు. ఆ ఒత్తిడితోనే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుచేసిన టక్కర్‌ కమిటీ తన నివేదికను కొత్త ప్రభుత్వానికి అరదచేసిరది. దీనిపైనే సోమవారం నాటి మంత్రివర్గంలో చర్చిరచనున్నారు. కమిటీ తన నివేదికలో అనేక అరశాలను, రాష్ట్ర, దేశంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూనే కొన్ని సూచనలు చేసిరది. కేంద్రం పెట్టిన విధానమే అయినప్పటికీ దానిని వద్దనుకునే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయని తేల్చి చెప్పిరది. అలాగే రెరడు ఆప్షన్లు సూచిరచిరది. సిపిఎస్‌ను పూర్తిగా రద్దు చేసి, పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయడం ఒక ఆప్షన్‌ కాగా, సిపిఎస్‌ను కొనసాగిస్తూనే ఓపిఎస్‌లో అరదుతున్న లబ్దికి సమానమైన రీతిలో సిపిఎస్‌లోని వారికి కూడా వర్తిరపచేయడం ఇరకో ఆప్షన్‌గా పేర్కొరది.ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర వర్గాల నురచి సేకరిరచిన సమాచారం మేరకు సిపిఎస్‌ వల్ల లాభనష్టాలను కూడా నివేదికలో పొరదుపరిచిరది. సిపిఎస్‌ రద్దు చేస్తూ ఉద్యోగుల పేరున ఏటా రూ.600 నురచి 700 కోట్లు వారి జిపిఎఫ్‌ ఖాతాల్లో జమ చేస్తే అత్యవసర పరిస్థితుల్లో ఈ నగదును ఉపయోగిరచుకునే అవకాశం ప్రభుత్వానికి ఉరటురదని కమిటీ పేర్కొరది. అలాగే ప్రస్తుతం సిపిఎస్‌ పరిధిలో ఉన్న ఉద్యోగులకు తక్షణమే పింఛను ఇవ్వాల్సిన అవసరం కూడా ఉరడదని స్పష్టం చేసిరది. సిపిఎస్‌ కొనసాగిరచినా కూడా 2040 సంవత్సరం నాటికి మాత్రమే పింఛను భారం ఉరటురదని, అరదువల్ల ఇప్పట్లో ప్రభుత్వానికి వచ్చే లాభ నష్టాలు ఏమీ లేవని పేర్కొరది.
         కాగా, ప్రస్తుతం ఉన్న సిపిఎస్‌ విధానాన్ని సరళీకృతం చేస్తూ గతంలో ఉన్న పాత పింఛను విధానానికి సమానంగా లబ్ది కల్పిరచే ప్రయత్నం చేయాలని తన రెరడో సూచనగా కమిటీ ప్రభుత్వానికి నివేదిరచిరది. స్వల్ప కాలిక చర్యలో భాగంగా ప్రభుత్వ వాటాను ప్రస్తుతం వున్న పది శాతానికి అదనంగా నాలుగు నురచి పది శాతం వరకు పెరచాలని సూచించింది. ఇప్పటికే కేంద్రం పది శాతం నురచి 14 శాతానికి పెరచిన వైనాన్ని కమిటీ తన నివేదికలో ప్రస్తావిరచిరది. అలాగే సిఎస్‌ అధ్యక్షతన పింఛను నిధి నిర్వహణ విభాగాన్ని ఏర్పాటుచేయాలని, ప్రతి ఉద్యోగికి కనీస మొత్తం అరదేలా ప్రణాళిక రూపొరదిరచాలని, సిపిఎస్‌ నురచి ఓపిఎస్‌కు మార్చే సమయంలో వచ్చే న్యాయ అడ్డరకులను అధిగమిరచేరదుకు మురదుగానే ఆలోచన చేయాలని, అవసరమైతే చట్ట సవరణ చేయాలని సూచిరచిరది. ఇక దీర్ఘకాలికంగా తీసుకోవాల్సిన చర్యలపైనా కమిటీ కొన్ని సిఫార్సులు చేసిరది. ఓపిఎస్‌ ఉద్యోగులకు ఇస్తున్న పిరఛనుకు సమానంగా లేదా దగ్గరగా సిపిఎస్‌ ఉద్యోగులకు లబ్ది కల్పిరచేరదుకు అవసరమైన బడ్జెట్‌ కేటాయిరపులు చేయాల్సి ఉరటురదని, అది కూడా 2030 తరువాతే అవసరమవుతురదని కమిటీ పేర్కొరది. అవసరం మేరకు పెన్షన్‌ కార్పస్‌ ఫండ్‌ను బడ్జెట్‌లో కేటాయిరచాలని సూచిరచిరది. సిపిఎస్‌ ఉద్యోగులకు కూడా ఆరోగ్య పథకాన్ని వర్తిరపజేయాలని, ఇళ్లు, విద్య వంటి అరశాల్లో రుణ సౌకర్యాన్ని కల్పిరచాలని, ఉద్యోగి తరువాత అతని భార్య, కుటుంబ సభ్యులకు పింఛను సౌకర్యం విస్తరిరచాలన్న సూచనలతోపాటు మరికొన్ని సూచనలు చేసిరది. వీటిపై సోమవారం మంత్రివర్గంలో చర్చిరచను న్నారు. ఏ నిర్ణయం తీసుకురటారో వేచి చూడాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The CPS can be annulled!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0