Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About Ammavadi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అమ్మ ఒడి' పథకంపై ఉపాధ్యాయుల యొక్క కొన్ని అభిప్రాయాలు 


   అమ్మ ఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలకు  వర్తిస్తుందని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మూత పడే  అవకాశం ఉందని ఉపాధ్యాయులందరూ అభిప్రాయపడుతున్నారు.

About Ammavadi


ఇక్కడ కొన్ని ప్రశ్నలతో మనం చర్చించుకుందాం.


1.అసలు అమ్మ ఒడి పథకం కింద ప్రతి విద్యార్థి తల్లికి డబ్బులు ఇవ్వడం  ఎందుకు? విద్యార్థి తల్లి కావలసింది 15000 ఆదాయమా ?ఆ విద్యార్థికి నాణ్యమైన  చదువు సౌకర్యవంతమైన పాఠశాలా?

2. ప్రతి విద్యార్థి తల్లికి సంవత్సరానికి 15000 ఇచ్చినంత మాత్రాన ఆ  విద్యార్థికి పూర్తిస్థాయిలో విద్య అంది విద్యార్థి జ్ఞాన సంపన్నుడు  అవుతాడా?

3.15000 ని ఆ తల్లి విద్యార్థి చదువుకు మాత్రమే ఖర్చు చేస్తుందా?

4.ప్రైవేట్ పాఠశాలలు ఆమాత్రం ఫీజుతో మేము మీ పిల్లల చదువు చెబుతాం అంటూ  గ్రామాలలో ఆ పాఠశాల యొక్క బ్రాంచ్ లు నెలకొల్పే అవకాశం లేదా?
ఇలా ఎన్నో రకాలైన లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి...


మరి అమ్మ ఒడి పథకాన్ని ఏ విధంగా వినియోగించవచ్చు. విద్యా వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చెయ్యొచ్చో చూద్దాం.


_ఉదాహరణకు 100 మంది విద్యార్థులు ఉన్న ఒక పాఠశాలను తీసుకుంటే ఒక్క  విద్యార్థికి పదిహేనువేలు చొప్పున వంద మందికి 15 లక్షల రూపాయలు  సంవత్సరానికి ఇవ్వవలసి ఉంటుంది. అదే 15 లక్షలు ఒక పాఠశాల మౌలిక వసతులకు  కనీస అవసరాలకు వినియోగిస్తే ఆ పాఠశాల ఎంత బలోపేతం అవ్వగలదో ఆలోచిద్దాం.

1.ప్రాథమిక పాఠశాల తీసుకున్నట్టయితే ఏ పాఠశాలలోనూ కొన్ని పురపాలక  పాఠశాలల్లో తప్ప మిగిలిన పాఠశాలలో స్వీపర్లు లేరు.ప్రస్తుతం ఆ పని  ఉపాధ్యాయులు విద్యార్థులు మాత్రమే చేసుకుంటున్నారు. ఇలా ఏ ప్రైవేట్  పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాఠశాలను తుడుచుకుంటూ, బాత్రూములు  కడుక్కుంటూ లేరు.అందువల్ల అక్కడ ఉపాధ్యాయులు,విద్యార్థులు కేవలం బోధన  అభ్యసన మీదే సమయం కేటాయిస్తారు. దీనికోసం ఔట్ సోర్సింగ్ విధానంలో స్వీపర్  ని నియమిస్తే ఐదు వేల నుండి ఆరు వేల రూపాయలకు స్వీపర్ లభిస్తారు.అంటే  సంవత్సరానికి వాళ్ల కోసం చేసే ఖర్చు 72000.


విద్యార్థులకు ఏ ప్రాథమిక పాఠశాలల లో ఫర్నిచర్ లేదు


2.విద్యార్థులకు ఏ ప్రాథమిక పాఠశాలల లో ఫర్నిచర్ లేదు. పురపాలక పాఠశాలలో  తప్ప, ఎక్కడో కొన్ని పాఠశాలల్లో విరాళాల ద్వారా చేయించినవి  తప్పితే.ఫర్నిచర్ కొరకు వంద మంది విద్యార్థులకు కు 50 వేలు ఖర్చు పెడితే  తయారవుతాయి.

3. విద్యార్థులకు ఇప్పుడు ఇచ్చే పాఠ్య పుస్తకాలతోపాటు వర్క్ బుక్స్ ను  కూడా తయారుచేసి ప్రైవేటు పాఠశాలలో మాదిరిగా ఇవ్వవచ్చు.దీనికిగాను  విద్యార్థికి 500 రూపాయలు చొప్పున 50వేలు అవుతాయి.

4. ప్రతి తరగతి గదులను డిజిటల్ చేసే విధంగా టీవీ స్క్రీన్ ఏర్పాటు చేయుటకు ఐదు తరగతులకు లక్షా 50 వేల రూపాయలు.

5. ప్రతి తరగతి గదిని అందమైన పెయింటింగ్స్ పిల్లలకు ఉపయుక్తకరమైన  పాఠ్యాంశాలతో తీర్చిదిద్దడానికి తరగతి గదికి 25 వేల రూపాయల చొప్పున లక్షా  25 వేలు.

6. ఉపాధ్యాయులకు రికార్డుల నిర్వహణ భారం లేకుండా అవుట్ సోర్సింగ్  విధానంలో ఒక రికార్డ్ అసిస్టెంట్ ని కూడా పెట్టుకోవచ్చు.ఇందుకోసం అయిన  ఖర్చు నెలకి పదివేలు చొప్పున 120000.

7.మనం కూడా విద్యతోపాటు కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అ అమలు చేయవచ్చు  సంగీతం నాట్యం వంటి వాటిలో మొదలైన వారితో నెలలో కొన్ని తరగతులు  నిర్వహించవచ్చు. ఇందుకుగాను నెలకు 5000 నుంచి 8000. సంవత్సరానికి 96,000.

8.విద్యార్థులు క్రీడా నైపుణ్యాలను పెంపొందించడానికి అన్ని రకాల క్రీడా  సామాగ్రిని అందుబాటులో ఉంచవచ్చు.దీనికిగాను అయ్యే ఖర్చు 20 వేల రూపాయలు._

9.ప్రతి పాఠశాలలోనూ మినీ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయొచ్చు దీనికి అయ్యే ఖర్చు 150000.

 మచ్చుకి కొన్ని మాత్రమే...


ఒక్కసారి ఆలోచించండి ప్రతి క్లాస్ కి ఒక టీచర్,ప్రతి స్కూల్ కి ఓ  రికార్డు అసిస్టెంట్ , ఒక స్వీపర్, ప్రతి విద్యార్థికి ఫర్నిచర్,  కార్పొరేట్ పాఠశాల మాదిరిగా స్టడీమెటీరియల్స్,ప్రతి తరగతిలోనూ డిజిటల్  క్లాసులు, నాణ్యమైన ఆహారం,నాణ్యత కలిగిన యూనిఫాం,క్రీడలు, సంగీతం,నాట్యం..  ఇలా ఎన్నో సౌకర్యాలు సుమారు 6లక్షల నుండి ఎనిమిది లక్షలు ఖర్చు చేస్తే ఆ  పాఠశాలలు బలోపేతం అవుతాయి‌.మరి 30 మంది ఉండే పాఠశాలలకే సంగతేంటని కొందరికి  అనుమానం రావచ్చు 30 మంది అంటే 450000 ఒక సంవత్సరానికి.ఇలా ప్రతి సంవత్సరము  చేయవలసిన అవసరం కూడా ఉండదు ఒక సంవత్సరం పాఠశాలలను బలోపేతం చేస్తే అది  కొన్ని సంవత్సరాల పాటు నిలిచి ఉంటుంది. విద్యార్థి తల్లి కోరుకునేది 15 వేల  రూపాయల ఆదాయం కాదు.విద్యార్థికి నాణ్యమైన చదువు,మంచి సౌకర్యాలు కలిగిన  పాఠశాల.ఈ విషయం గ్రహిస్తే చాలా మంచిదని  ఉపాధ్యాయుల అభిప్రాయం.
ఇది ప్రభుత్వాన్ని తప్పు పట్టే కార్యక్రమం కాదు ఉపాధ్యాయుల అభిప్రాయాలు మాత్రమే. ఇలా చేస్తే బాగుంటుందేమో అనే అభిప్రాయం మాత్రమే సుమా.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "About Ammavadi"

Post a comment