Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ANANDA VEDIKA LEVEL 3 , 6thClass to 8th Class

ANANDA VEDIKA LEVEL 3 , 6thClass to 8th Class

ఆనంద వేదిక (గురువారం)  కృత్యము
(లెవెల్ ..3) 6 నుండి 8 తరగతులు
తేదీ 1.8 2019


మనం చూసిన విన్న  చదివిన దానికంటే కృత్యం ద్వారా లభించిన జ్ఞానం ఎల్లప్పుడూ..గుర్తుండి పోతుంది. విద్యార్థి తనకు తాను వ్యక్తిగా ఎదుగుతూ..తనపట్ల తాను అవగాహన ఏర్పరచుకుంటూ..
కుటుంబం పట్ల సమాజం పట్ల  ప్రకృతి పట్ల ఒక సంపూర్ణావగాహన పెంచుకోవడమే..లక్ష్యం కావాలి.
ANANDA VEDIKA LEVEL 3 , 6thClass to 8th Class
కృత్య నిర్వహణ గురు శుక్రవారాలలో ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే.
 నిన్న . విద్యార్థులు విన్నకథ లోని మౌళిక విలువల ఆధారంగా..కృత్యాల నిర్వహణ ఉంటుంది.ఆటలంత ఆనందంగా..
పాటలంత ఉత్సాహంగా .కృత్య నిర్వహణ జరిగేలా చూసే బాధ్యత ఉపాధ్యాయునిదే.


R.PRASADA RAO (DRP)


కృత్యము మొదటిరోజు.


ఆనందానికి అర్ధము ( 3వ లెవెల్)


మైండ్ ఫుల్ యాక్టివిటీ (ధ్యాన ప్రక్రియ)

 మూడు నిమిషాలు చేయించాలి
* సాధారణ శ్వాసలు
* వాటి కొనసాగింపు
* దీర్ఘ శ్వాసలు
* వాటి కొనసాగింపు
* తిరిగి సాధారణ శ్వాసలు
* నెమ్మదిగా. కళ్ళు తెరవడం

తదుపరి మొదటి రోజు  కృత్యం నిర్వహణ.(6 నుండి 8 తరగతులకు)
 



  ఉద్దేశ్యము:

ఆనందము యొక్కఅర్ధాన్ని గుర్తించుట.
అర్ధమయ్యేటట్లు చేయడం.

కార్యాచరణ సోపానాలు:


ముందు ఉపాధ్యాయుడు భావోద్వేగాలు ...దుఃఖం కోపం...లాంటివి చేసి చూపాలి.
 అభినయించే..సమయంలో...మాట్లాడకూడదు.
ఇలా..భావోద్వేగాలు అందరూ...చేసి చూపాలి
ఆనందానికిఅర్ధం...లో..ఉన్నట్లుగా...మిగిలిన ప్రశ్నలు చర్చించండి


ఉపాధ్యాయుడు విద్యార్థి తో... చర్చించవలసిన ప్రశ్నలు:


సంతోషం భావోద్వేగాలు ఏమిటి..?
దుఃఖం భావోద్వేగాలు ఏమిటి?
 సంతోషం మనలో ఉంటుందా..?
విద్యార్థులందరూ..సంతోషముగా ఆనందవేదిక జరపాలి.

ఉపాధ్యాయులకు సూచనలు:


ఇందులో...విద్యార్థులందరూ..పాల్గొన్నట్లు చూడాలి

ఉపాధ్యాయుడు వీలైతే  విద్యార్థులతో సహజంగా..స్వేచ్ఛగా..మాట్లాడేలా.. చేయాలి.
తరగతి వాతావరణం ఉల్లాసంగా ఉండే లా.. చూడాలి.

మౌనప్రక్రియ:

విద్యార్థులందరినీ... రెండు నిమిషాలపాటు కళ్ళు మూసుకొని కూర్చోమనాలి. కళ్ళు మూసుకొని ఉంచలేనట్లయితే...కళ్ళు తెరచి కిందకి చూడమనవచ్చు.
* ఈ కృత్యాన్ని ఇంట్లో..తల్లి దండ్రులతోనూ...స్నేహితుల తోనూ చెప్పి వారితో కలసి ఉన్నప్పుడు సంతోషంగా..ఉండేవిధంగా మసలు కోవాలని విద్యార్థులకు తెలియజేయాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ANANDA VEDIKA LEVEL 3 , 6thClass to 8th Class"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0