Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ANANDA VEDIKA THURSDAY PROGRAME Dated on 25-07-2019

ఆనంద వేదిక గురువారం కృత్యముతేదీ 25.7.2019



(  లెవెల్ ..1-2) 1 నుండి 5 తరగతులు

మనం చూసిన విన్న  చదివిన దానికంటే కృత్యం ద్వారా లభించిన జ్ఞానం ఎల్లప్పుడూ..గుర్తుండి పోతుంది. విద్యార్థి తనకు తాను వ్యక్తిగా ఎదుగుతూ..తనపట్ల తాను అవగాహన ఏర్పరచుకుంటూ..కుటుంబం పట్ల సమాజం పట్ల  ప్రకృతి పట్ల ఒక సంపూర్ణావగాహన పెంచుకోవడమే..లక్ష్యంగా.. కావాలి.

ANANDA VEDIKA  THURSDAY PROGRAME


కృత్య నిర్వహణ గురు శుక్రవారాలలో ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే.
 నిన్న . విద్యార్థులు విన్నకథ లోని మౌళిక విలువల ఆధారంగా..కృత్యాల నిర్వహణ ఉంటుంది.ఆటలంత ఆనందంగా..
పాటలంత ఉత్సాహంగా .కృత్య నిర్వహణ జరిగేలా చూసే బాధ్యత ఉపాధ్యాయునిదే

కృత్యము.


పండ్లు -కూరగాయలు

 ముందుగా
మైండ్ ఫుల్ యాక్టివిటీ (ధ్యాన ప్రక్రియ) మూడు నిమిషాలు చేయించాలి
* సాధారణ శ్వాసలు
* వాటి కొనసాగింపు
* దీర్ఘ శ్వాసలు
* వాటి కొనసాగింపు
* తిరిగి సాధారణ శ్వాసలు
* నెమ్మదిగా. కళ్ళు తెరవడం


తదుపరి కృత్యం నిర్వహణ.

ఈ రోజు 1-5తరగతులకు
 కృత్యం
**********
పండ్లు -కూరగాయలు

  ఉద్దేశ్యము:
 విద్యార్థులలో..చురుకుదనం ఏకాగ్రతను పెంపొందించుట.
విద్యార్థులలో.. పరస్పర సంబంధాలను మెరుగుపరచుట.


 నిర్వహణ సోపానాలు :


 విద్యార్థులందరూ...వృత్తాకారం గా కూర్చోవాలి..
ఒక విద్యార్థి పండ్లు కూరగాయలు అమ్ముతున్నట్లుగా..అభినయిస్తూ వృత్తం మధ్యలో తిరుగుతూ ఉంటాడు.
ఒక విద్యార్థి దగ్గర ఆగినప్పుడు ఆ...విద్యార్థి లేచి -
పండ్లు అని అనగానే ..రెండు పండ్ల పేర్లు ..
కూరగాయలు అనగానే.. 2 కూరగాయల పేర్లుచెప్పాలి.
చెప్పలేని విద్యార్థి పండ్లు కూరగాయలు అమ్ముతూ..తిరగాలి.
విద్యార్థి చెప్పగలిగితే...తిరుగుతున్న విద్యార్థి కొనసాగాలి.


ఉపాధ్యాయుడు విద్యార్థి తో... చర్చి చవలసిన ప్రశ్నలు:


నీవు పండ్లు కూరగాయలు అమ్మినప్పుడు నీకేమనిపిస్తుంది?
నీ మిత్రుడు నిన్నడిగినప్పుడు నీకేమనిపించింది?
ఈ కృత్యం లో...కూరగాయలు అంటూ తిరుగుతుంటే..అది నీకు ఇస్టం గా...అనిపించిందా..?

ఉపాధ్యాయులకు సూచనలు:

ఇందులో...విద్యార్థులందరూ..పాల్గొన్నట్లు చూడాలి
ఉపాధ్యాయుడు వీలైతే  విద్యార్థులతో పండ్లు ...అమ్ముతున్నట్లుగా అభినయం చేయించాలి .

మౌనప్రక్రియ:


విద్యార్థులందరినీ... రెండు నిమిషాలపాటు కళ్ళు మూసుకొని కూర్చోమనాలి. కళ్ళు మూసుకొని ఉంచలేనట్లయితే...కళ్ళు తెరచి కిందకి చూడమనవచ్చు.
ఈ కృత్యాన్ని ఇంట్లో..తల్లి దండ్రులతోనూ...స్నేహితుల తోనూ కలసి  చేయవచ్చు. అని చెప్పాల

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ANANDA VEDIKA THURSDAY PROGRAME Dated on 25-07-2019"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0