Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP BUDGET 2019

బడ్జెట్ ముఖ్యాంశాలు..

దేశ నిర్మాణంలో తనకూ పాత్ర ఉందని ప్రతి పేద వ్యక్తీ గ్రహించాలనే జాతిపిత మహాత్మా గాంధీ వ్యాఖ్యల స్ఫూర్తితో బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
పోలవరం, వంశధార, హంద్రీనీవ ప్రాజెక్టులను పూర్తి చేయడం లక్ష్యం.

AP BUDGET 2019

ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం లక్ష్యం.

బడ్జెట్ అంచనా రూ.2.27,974.99 కోట్లు

మూలధన వ్యయం: రూ. 32,293.39 కోట్లు

వడ్డీ చెల్లింపులు రూ. 8,994 కోట్లు


 రాష్ట్ర రుణం 2014తో పోలిస్తే.. 2019 నాటికి విపరీతంగా పెరిగిపోయింది.


రెవెన్యూ వ్యయం రూ. 1,80,475 కోట్లు
 ద్రవ్యలోటు సుమారు రూ. 35,260.58 కోట్లు
 2018-19తో పోలిస్తే బడ్జెట్ 19.32 శాతం పెరుగుదల.

ఇచ్చిన హామీ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని కోరుతున్నాం: బుగ్గన

 హోదా వచ్చి ఉంటే 2020 నాటికి దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ నిలిచి ఉండేది - బుగ్గన.
 2022 నాటికి ఏపీ వృద్ధిపథంలో ఏ స్థానంలో ఉంటుందనే విషయం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పనితీరు నిర్ధారిస్తుంది.
 సింగపూర్‌కు విమాన సర్వీసులను నడపడానికి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అందించాలా..? లేదంటే తల్లులకు పోషకాహారం అందించడం ముఖ్యమో మేం నిర్ణయించుకున్నాం - బుగ్గన.
బడ్జెట్ కేటాయింపులు ఇలా..
 వైఎస్ఆర్ రైతు భరోసా: రూ.8750 కోట్లు, 15 లక్షల మంది కౌలు రైతులు సహా రైతులందరికీ అక్టోబర్ 15 నుంచే రైతు భరోసా.
వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు: రూ.100 కోట్లు
 వైఎస్ఆర్ బీమా: రూ.1163 కోట్లు
 ధరల స్థిరీకరణ నిధి: రూ.3 వేల కోట్లు
 ఉచిత బోరు బావుల తవ్వకం: రూ.200 కోట్లు
 గ్రామ సచివాలయాలు: రూ.700 కోట్లు
గ్రామ వాలంటీర్లు: రూ.720 కోట్లు
 ఆర్టీసీకి సాయం : రూ.1000 కోట్లు
రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ : రూ. 260 కోట్లు
 పౌరసరఫరాల కార్పొరేషన్‌‌కు ఆర్థిక సాయం: రూ.384 కోట్లు
 బీసీ సంక్షేమం: రూ.7271 కోట్లు
వైఎస్ఆర్ అగ్రిల్యాబ్: రూ.109.8 కోట్లు
 అగ్రిగోల్డ్ బాధితులు: రూ.1150 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్: రూ.100 కోట్లు
 కాపు కార్పొరేషన్ : రూ.2000 కోట్లు
 డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు: రూ. 1180 కోట్లు
 పాడి రైతులకు లీటర్‌‌కు రూ.4 బోనస్
 చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు సాయం రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.
 మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ: రూ.210 కోట్లు
ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం: రూ.200 కోట్లు
కడప ఉక్కు ఫ్యాక్టరీ: రూ.250 కోట్లు
 ఆత్మహత్య చేసుకున్న, ప్రమాదవశాత్తూ మరణించిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం:
 బీసీలకు వైఎస్ఆర్ కళ్యాణ కానుక: రూ.300 కోట్లు
 ఎస్టీలకు కల్యాణ కానుక: రూ.45 కోట్లు
గిడ్డంగుల నిర్మాణం: రూ. 37.5 కోట్లు
 పారిశ్రామిక మౌలిక కల్పన: రూ.250 కోట్లు

జగనన్న అమ్మ ఒడి పథకం: రూ.6455 కోట్లు, 43 లక్షల మంది తల్లులకు లబ్ధి.

ఉచిత విద్యుత్: రూ.4525 కోట్లు
 విపత్తు నిర్వహణ: రూ.2002.08 కోట్లు
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం. తెలుగు బోధన తప్పనిసరి చేస్తాం.
అభివృద్ధి పథకాల అంచనా వ్యయం: రూ.92 వేల కోట్లు
 మధ్యాహ్న భోజనం వంట మనిషి, సహాయకుల వేతనం రూ.3 వేలకు పెంపు.
 జగన్ అన్న విద్యా దీవెన పథకం: రూ.4962 కోట్లు

ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019-20లో..


ముఖ్యమైన పథకాలు.. కేటాయింపులు



1) వైయస్ఆర్ రైతు భరోసాః రూ. 8,750 కోట్లు

2) వైయస్ఆర్ 9 గంటల ఉచిత విద్యుత్ః రూ. 4,560 కోట్లు

3) ధరల స్థిరీకరణ నిధిః రూ. 3,000 కోట్లు

4) ప్రకృతి వైపరీత్యాల నిధిః రూ. 2,002.08 కోట్లు

5) వైయస్ఆర్ - పీఎం ఫసల్ బీమా యోజనః రూ. 1163 కోట్లు

6) ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కోసంః రూ. 475 కోట్లు

7) రైతులకు ఉచిత బోర్లు ( వైయస్ఆర్ రైతు భరోసా)ః రూ. 200 కోట్లు

8) రైతు విత్తనాల కోసంః రూ. 200 కోట్లు

9) వేర్ హోసింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ః రూ. 200 కోట్లు

10) వైయస్ఆర్- అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ః రూ. 109. 28 కోట్లు

11) ఫామ్ మెకనైజేషన్ః రూ. 100. 05 కోట్లు

12) రైతులకు వైయస్ఆర్ సున్నావడ్డీ రుణాలుః రూ. 100 కోట్లు

13) రైతులు మరణిస్తే.. నష్ట పరిహారంః రూ 100 కోట్లు

14) సహకార డైరీల బలోపేతం కోసంః రూ. 100 కోట్లు

15) పశు గ్రాసం, దాణా కోసంః రూ. 100 కోట్లు

16) గోదాముల నిర్మాణం కోసంః రూ. 37. 54 కోట్లు

17) మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం కోసంః రూ. 100 కోట్లు

18) జెట్టీలు, హార్బర్ల నిర్మాణాల కోసంః రూ. 100 కోట్లు

19) మత్స్యకారుల బోట్లకు డీజిల్ సబ్సిడీ కోసంః రూ. 100 కోట్లు

20) మత్స్యకారుల |అభివృద్ధికిః రూ. 100 కోట్లు

21) షెడ్యూలు కులాల మత్స్యకారుల సంక్షేమం కోసంః రూ. 50 కోట్లు

22) జగనన్న అమ్మఒడిః రూ. 6,455.80 కోట్లు

23) పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసంః రూ. 1500 కోట్లు

24) మధ్యాహ్న భోజన పథకం కోసంః రూ. 1077 కోట్లు

25) వైయస్ఆర్ - స్కూళ్ళ నిర్వహణ నిధిః రూ. 160 కోట్లు

26) వంటశాలల నిర్మాణం కోసం(అక్షయపాత్ర)ః రూ. 100 కోట్లు

27) డా. వైయస్ఆర్ ఆరోగ్యశ్రీః రూ. 1740 కోట్లు

28) ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కోసంః రూ. 1500 కోట్లు

29) ఆశా వర్కర్ల గౌరవ వేతనం కోసంః రూ. 455.85 కోట్లు

30) వైద్య భవనాల కోసంః రూ. 68 కోట్లు

31) డా. వైయస్ఆర్ ట్రైబల్ మెడికల్ కాలేజీః రూ. 66 కోట్లు

32) గురజాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసంః రూ. 66 కోట్లు

33) విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసంః రూ. 66 కోట్లు

34) పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆసుపత్రి కోసంః రూ. 50 కోట్లు

35) రాష్ట్ర క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కోసంః రూ. 43.60 కోట్లు
-----------

36) గృహ నిర్మాణం కోసం మొత్తంః రూ.9,785.75 కోట్లు
వైయస్ఆర్ గృహ వసతిః రూ. 5000 కోట్లు
1. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(అర్బన్)ః రూ. 1370 కోట్లు
2. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్)ః
వైయస్ఆర్ బలహీనవర్గాల గృహ నిర్మాణం కోసంః రూ. 1280.29 కోట్లు
వైయస్ఆర్ అర్బన్ హౌసింగ్ ః రూ. 1000 కోట్లు
ప్రధాన మంత్రి ఆవాస యోజన(గ్రామీణ)ః రూ. 565.25 కోట్లు
బలహీన వర్గాల ఇళ్ళ నిర్మాణం కోసంః రూ. 150.21
-----------
37) వైయస్ఆర్ పెన్షన్స్..
 వైయస్ఆర్ పెన్షన్స్ కోసంః  రూ. 15,813.51 కోట్లు
 వైయస్ఆర్ పెన్షన్ కానుక వృద్ధులు, వితంతువులు కోసంః రూ. 12801.04 కోట్లు
దివ్యాంగుల పెన్షన్ కానుక కోసంః రూ. 2133.62 కోట్లు
ఒంటరి మహిళల పెన్షన్ కానుక కోసంః రూ. 300 కోట్లు
మత్స్యకారుల పెన్షన్ కానుక కోసంః రూ. 130 కోట్లు
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ల కోసంః రూ. 100.20 కోట్లు
కిడ్నీ డయాలసిస్ రోగుల పెన్షన్ల కోసంః రూ. 85 కోట్లు
కల్లు గీత కార్మికుల పెన్షన్ల కోసంః రూ. 78.85 కోట్లు
వైయస్ఆర్ అభయ హస్తం పెన్షన్ల కోసంః రూ. 90.88 కోట్లు
ట్రాన్స్ జెండర్ల పెన్షన్ల కోసం రూ. 7 కోట్లు

38) వైయస్ఆర్ కళ్యాణ కానుక..
 బీసీల కోసం వైయస్ఆర్ కళ్యాణ కానుకః రూ. 300 కోట్లు
ఎస్సీల కోసం  వైయస్ఆర్ కళ్యాణ కానుకః రూ. 200 కోట్లు
వైయస్ఆర్ గిరి పుత్రిక కళ్యాణ పథకం(ఎస్టీ)ః రూ. 40 కోట్లు
వైయస్ఆర్ షాదీ క తోఫా(మైనార్టీ)ః రూ. 100 కోట్లు
వైయస్ఆర్ కళ్యాణ కానుకః రూ. 30.26 కోట్లు
1.వైయస్ఆర్ కళ్యాణ కానుక(ఇంటర్ క్యాస్ట్)ః రూ. 36 కోట్లు
2.వైయస్ఆర్ కళ్యాణ కానుక(ఇంటర్ క్యాస్ట్)ః రూ. 5 కోట్లు
---------

39) కాపు సంక్షేమం కోసంః రూ. 2000 కోట్లు

40) అగ్రిగోల్డ్ బాధితుల కోసంః రూ. 1150 కోట్లు

41) వైయస్ఆర్ బీమాః రూ. 404.02 కోట్లు

42) ఆటో డ్రైవర్ల కు ఆర్థిక సాయంః రూ. 400 కోట్లు

43)నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్స్ కు వైయస్ఆర్ ఆర్థిక సాయంః రూ. 300 కోట్లు

44)చేనేతలకు వైయస్ఆర్ ఆర్థిక సాయంః రూ. 200 కోట్లు

45)ధార్మిక సంస్థలకు వైయస్ఆర్ గ్రాంట్స్ః రూ. 234 కోట్లు

46)బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ః రూ. 100 కోట్లు

47) లాయర్ల సంక్షేమం కోసం, ట్రస్టు ఏర్పాటుః రూ. 100 కోట్లు

48) లాయర్లకు సాయంః రూ. 10 కోట్లు

49) సబ్సిడీ బియ్యం కోసంః రూ. 3000 కోట్లు

50) రైస్ ప్యాకెట్ల  తయారీ కోసంః రూ. 750 కోట్లు

51) సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ కోసంః 384 కోట్లు

52) గ్రామ వాలంటీర్ల కోసంః రూ. 720 కోట్లు

53) గ్రామ సచివాలయాలకుః రూ. 700 కోట్లు

54) మున్సిపల్ వార్డు వాలంటీర్లకుః రూ. 280 కోట్లు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP BUDGET 2019"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0