Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Grama Sachivalayam jobs 1.60 Lakh Vacancies Recruitment 2019 through DSC in Village Secretariats Notification, vacancies details, Apply Online

AP Grama Sachivalayam jobs 1.60 Lakh Vacancies Recruitment 2019 through DSC in Village Secretariats Notification, vacancies details, Apply Online

AP Grama Sachivalayam jobs 1.60 Lakh Vacancies Recruitment 2019 through DSC in Village Secretariats Notification, vacancies details, Apply Online


డీఎస్సీ ద్వారా గ్రామసచివాలయాల్లో 1.60 లక్షల ఉద్యోగాల భర్తీ


అమరావతి: ఏపీలోని గ్రామ సచివాలయాల్లో శాశ్వత ప్రాతిపదికన 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని.. ఈ ఉద్యోగాల భర్తీకి జులై 15 నాటికి నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆయన ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అక్టోబర్‌ 2 నుంచి గ్రామ సచివాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి 2వేల మందికి గ్రామ సచివాలయం ఉండాలని.. అందులో ఉద్యోగాలను జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాల భర్తీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జగన్‌ ఆదేశించారు.

వివిధ అర్హతలున్నవారిని పరిగణనలోకి తీసుకోవాలని.. వారు తమకు కేటాయించిన ఏపనినైనా చేయగలిగేలా తీర్చిదిద్దాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

AP Grama Sachivalayam Jobs 2019 : Notification AP Village Secretariat Jobs
Details of AP Grama Sachivalayam (Village Secretariat) Recruitment in Telugu :
శాఖలవారీగా నియామకానికి చర్యలు ఆరంభం

ఏపీ గ్రామ సచివలయం జాబ్స్ 2019  పోస్ట్లు వివరాలు, జాబ్ చార్ట్డి, ఎస్సి జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎపి విలేజ్ సెక్రటేరియట్స్ రిక్రూట్మెంట్.

READ : AP Grama Sachivalayam Jobs 2019 Structure Posts Details Job Chart AP Village Secretariats  Recruitment by DSC District Selection Committee

 గ్రామ సచివలయాల లో కొత్తగా నియమించ బడే ఉద్యోగుల విధులు



జిల్లాల వారీగా గ్రామ సచివాలయాల సంఖ్య



రాష్ట్రవ్యాప్తంగా 12,671 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు పంచాయితీరాజ్‌ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అక్టోబరు 2వతేదీ నాటికి గ్రామ సచివాలయాల వ్యవస్థ అమలులోకి వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో అవినీతికి ఏమాత్రం తావులేకుండా, పథకాల ప్రయోజనాన్ని లబ్ధిదారులకు వేగంగా చేరవేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాను ప్రమాణస్వీకారం చేసిన రోజే గ్రామ సచివాలయాల ఏర్పాటుపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రతి గ్రామ సచివాలయంలో పది మంది చొప్పున కొత్తగా ఉద్యోగులను నియమిస్తామన్నారు. వీరిని పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తిస్తామని భరోసా ఇచ్చారు

గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 13,065 గ్రామ పంచాయితీలను పంచాయితీరాజ్‌ శాఖ 12,671 గ్రామ సచివాలయాలుగా వర్గీకరించింది. ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం చొప్పున ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీటిని 12,671కి పెంచుతూ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

గ్రామ సచివాలయాల్లో నియమించే వారిని పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణిస్తారు. ఉద్యోగంలో నియమించిన మొదటి రెండేళ్ల పాటు ప్రొబేషనరీగా ఉంచి గౌరవ వేతనం అందజేస్తారు.

గ్రామ సచివాలయాల సిబ్బందిని జిల్లా ఎంపిక కమిటీ ద్వారా నియమిస్తారు. వీరికి సంబంధిత శాఖలు తగిన విధంగా ప్రత్యేక శిక్షణ ఇస్తాయి.

గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది పర్యవేక్షణకు సంబంధిత శాఖలు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసుకోవాలి.

కేవలం సంబంధిత శాఖ వ్యవహారాలకే పరిమితం కాకుండా గ్రామ సచివాలయ పరిధిలో ఏ పని అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉండాలి.

ఒక్కో గ్రామ సచివాలయంలో పంచాయితీ కార్యదర్శి ఆధ్వర్యంలో మొత్తం 11 మంది చొప్పున ఉద్యోగులు పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు. పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉండే చోట మరికొంత మందిని అదనంగా నియమించే అవకాశం ఉందని పంచాయితీరాజ్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వివిధ రకాల ఉద్యోగుల పర్యవేక్షణ బాధ్యతలు పంచాయితీరాజ్, రెవెన్యూ, వైద్యారోగ్య, పశుసంవర్ధక, మహిళా శిశు సంక్షేమం, పంచాయితీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం, వ్యవసాయం, ఉద్యానవన, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో ఉంటాయి









SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Grama Sachivalayam jobs 1.60 Lakh Vacancies Recruitment 2019 through DSC in Village Secretariats Notification, vacancies details, Apply Online"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0