Income tax return date extend up to August 31
రిటర్న్ దాఖలుకు ఈ పత్రాలన్నీకీలకం
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ముందు ప్రతి ఒక్కరూ కొన్ని ఆధార పత్రాలు తప్పనిసరిగా సేకరించుకుని ఉంచుకోవాలి. జూలై 31 వరకు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసేందుకు గడువు ఉన్నప్పటికీ అంతకన్నా ముందుగానే ఈ పత్రాలన్నీ సిద్ధం చేసుకోవడం తప్పనిసరి.
వాటి ఆధారంగా పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవడంతో పాటు రిటర్న్‌లను ఎలాంటి అంతరాయాలు లేకుండా దాఖలు చేయగలుగుతారు.*
వేతన జీవులైతే ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ఫారం-16 తప్పనిసరి. యాజమాన్యాలు ఉద్యోగుల వేతనం నుంచి పన్ను మినహాయించినట్టయితే చట్టప్రకారం ఫారం-16 అందించి తీరాలి. పన్ను చెల్లింపు ఆదాయ పరిమితిలోకి వచ్చిన వారందరికీ ఫారం-16లు విడివిడిగా వారి పేర్ల మీద అందించాలి. ఇందులో ఆ ఉద్యోగికి చెల్లించిన వేతనం, వేతనం చెల్లింపు స్థానంలో పన్ను మినహాయింపు (టీడీఎస్) వివరాలన్నీ సవివరంగా పొందుపరిచి ఉంటాయి.
2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన ఐటీఆర్-1 యాజమాన్యాలు ఇచ్చే ఫారం-16తో అనుసంధానం అయింది. ఈ అనుసంధానం కారణంగా ఫారం-16లో ఉన్న అవసరమైన వివరాలన్నింటినీ కాపీ చేసుకుని ఐటీఆర్-1లో ఆయా విభాగాల్లో పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇంతకు ముందు ఆ అనుసంధానత లేకపోవడం వల్ల రిటర్ను దాఖలు చేసే వారందరూ ప్రతి ఒక్క అంశాన్ని వేతనం స్లిప్‌ల ఆధారంగా వేర్వేరుగా రాయాల్సివచ్చేది.
ఫారం-16 తీసుకోగానే అందులో మీ పాన్ నంబర్, పేరు తప్పులు లేకుండా నమోదయింది, లేనిది చూసుకోవాలి.అందులో పొరపాట్లేవైనా ఉంటే సవరించిన ఫారం-16ను యాజమాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఆర్‌డీలపై వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకు ప్రస్తుత పన్ను చట్టాల కింద అర్హత గల పన్ను మినహాయింపు పరిమితికి పైబడి చెల్లిస్తున్న వడ్డీ సొమ్ముపై పన్ను మినహాయించి ఉన్నట్టయితే దానికి ఫారం-16ఏ కింద టీడీఎస్ సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది.
మీరు ఏదైనా ఆస్తిని విక్రయించి ఉన్నట్టయితే దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి ఫారం-16బీ కింద టీడీఎస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. మీకు ఆస్తి ఉన్నట్టయితే దాన్ని బాడుగకు తీసుకున్న వ్యక్తి నుంచి టీడీఎస్ వివరాలతో ఫారం-16సీ ఇవ్వాలని కోరే అర్హత మీకుంది.
ప్రస్తుత చట్టాల ప్రకారం నెలవారీ అద్దె రూ.50 వేలు దాటినట్టయితే బాడుగకు తీసుకున్న వ్యక్తి దానిపై టీడీఎస్ మినహాయించాల్సి ఉంటుంది.
ఈ ఏడాది ఐటీఆర్‌లో అసెసీ సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతరత్రా ఆదాయాల కింద ఎంత మొత్తంలో వడ్డీలు అందుకుంటున్నది వేర్వేరుగా పొందుపరచాల్సి ఉంటుంది. పోస్టాఫీసు లేదా బ్యాంకు ఎఫ్‌డి నుంచి వడ్డీ రూపంలో పొందుతున్న ఆదాయంపై 80 టీటీఏ కింద రూ.10 వేల వరకు మినహాయింపును కోరవచ్చు. సీనియర్ సిటిజెన్లయితే ఇలాంటి వడ్డీ ఆదాయాలపై రూ.50 వేల వరకు మినహాయింపు అర్హత ఉంది.
మార్చి 31వ తేదీ లోగా పొందిన ఇలాంటి వడ్డీ ఆదాయాలన్నింటి మీద ఆయా బ్యాంకుల నుంచి సర్టిఫికెట్లు సేకరించి ఉంచుకోవాలి. ఒకవేళ సంబంధిత ఆర్థిక సంస్థ మీకు వడ్డీ చెల్లించే సమయంలోనే పన్ను మినహాయించి ఆ వివరాలతో టీడీఎస్ ఇచ్చి ఉంటే అసెసీ వేరుగా ఈ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
సొంతానికి, భార్యా పిల్లల పేరు మీద ఆరోగ్య బీమా పాలసీలపై చెల్లించిన ప్రీమియంలపై ఏడాదిలో గరిష్ఠంగా రూ.25,000 వరకు 80-డీ సెక్షన్ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.
అలాగే తల్లిదండ్రులపై తీసుకున్న ఆరోగ్యబీమా పాలసీలకు చెల్లిస్తున్న ప్రీమియంపై తల్లిదండ్రుల వయసును బట్టి రూ.25,000 (60 ఏళ్లలోపు వయసు వారైతే), రూ.50,000 (60 ఏళ్ల వయసు మీరిన వారైతే) మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.
తల్లిదండ్రులపై ఎలాంటి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోకపోయినా వారి కోసం చేసిన వైద్య వ్యయాలపై కూడా ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.
ఫారం 26 ఏఎస్ వార్షిక కన్సాలిడేటెడ్ పన్ను స్టేట్‌మెంట్. ఒక పాన్ నంబర్‌పై డిపాజిట్ అయిన పన్ను వివరాలన్నీ అందులో ఉంటాయి.
🔷మీరు చెల్లించిన సెల్ఫ్ అసెస్‌మెంట్ పన్నులు
🔷2018-19లో ఆ వ్యక్తి చెల్లించిన అడ్వాన్స్ పన్ను
🔷యజమాని మినహాయించిన టీడీఎస్
🔷బ్యాంకులు మినహాయించిన టీడీఎస్
🔷మీకు చెల్లింపులు చేసిన సంస్థలు మినహాయించిన టీడీఎస్
⬛ *ట్రేసెస్ వెబ్‌సైట్ నుంచి ఎవరైనా ఈ కన్సాలిడేటెడ్ స్టేట్‌మెంట్ లేదా ఫారం 26 ఏఎ్‌సను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోని మీ ఖాతాలోకి లాగిన్ అయి మై అకౌంట్ విభాగంలో వ్యూ 26 ఎఎస్ అనే అంశం క్లిక్ చేయాలి. అది ఆటోమేటిక్‌గా ట్రేసెస్ వెబ్‌సైట్‌లోకి మిమ్మల్ని పంపుతుంది. అక్కడ 26 ఏఎస్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది*.
⬛ *ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న 26 ఏఎస్ ఫారంలో 2018-19లో మీ పాన్ నంబర్‌పై మినహాయించిన టీడీఎ్‌సలన్నీ సరిగ్గా ఉన్నది లేనిది చూసుకోవాలి. ఏదైనా పొరపాటు దొర్లితే దాన్ని సవరించాలని పన్ను మినహాయించిన సంస్థను కోరాల్సి ఉంటుంది. తేడా ఉన్న ఫారంతో టాక్స్‌క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకునే అవకాశం మీకుండదు*.
మీరు ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి హోమ్‌లోన్ తీసుకున్నట్టయితే గత ఏడాదిలో చేసిన చెల్లింపులకు సంబంధించిన స్టేట్‌మెంట్ తీసుకోవడం తప్పనిసరి. ఇంటి రుణంపై చెల్లించిన వడ్డీకి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24 కింద గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆ ఇంటిపై మీరు చెల్లిస్తున్న వడ్డీని, దానిపై మీకు అద్దె రూపంలో వస్తున్న ఆదాయం ఏమైనా ఉంటే దాన్ని కూడా రిటర్న్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. అదే ఇంటిలో సొంతంగా నివశిస్తున్నా కూడా మినహాయింపు ఆర్హత ఉంది.
పన్ను పొదుపు లక్ష్యంగా చేసిన పెట్టుబడులు, వ్యయాలపై 80సీ, 80సీసీసీ, 80సీసీడీ (1) కింద మినహాయింపులకు అర్హత ఉంటుంది. ఈ మూడు సెక్షన్ల కింద గరిష్ఠంగా లక్షన్నర రూపాయల వరకు టాక్స్ బ్రేక్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు.
🔷ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలో చెల్లింపులు
🔷పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ ఖాతాలో చెల్లింపులు
🔷ఈక్విటీ అనుసంధానిత పొదుపు సాధనాల్లో పెట్టుబడులు
🔷జీవితబీమా ప్రీమియం చెల్లింపులు
🔷నేషనల్ పెన్షన్ స్కీమ్ ఖాతాలో చెల్లింపులు
🔷అన్‌లిస్టెడ్ కంపెనీల పెట్టుబడి ఆధారాలు
🔷ఒకవేళ మీరు ఏవైనా అన్‌లిస్టెడ్ కంపెనీల వాటాల్లో పెట్టుబడి పెట్టి ఉంటే ఆ వివరాలు ఇవ్వడం కూడా తప్పనిసరి.
🔷ఆ వివరాలతో పాటు మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ పాన్ నంబర్ కూడా పొందుపరచాలి.ఇవన్నీ సేకరించుకోవలసి ఉంటుంది.
పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి 2019 ఏప్రిల్ నుంచి ఆధార్ తప్పనిసరి. ప్రతి ఒక్కరూ తమ రిట ర్న్‌లో ఆధార్ నంబర్ ఇచ్చి తీరాలి. ఒకవేళ ఆధార్ కోసం దరఖాస్తు చేసి ఉంటే ఎన్‌రోల్‌మెంట్ నంబర్ పొందుపరిచి తీరాలి.
బ్యాంకు ఖాతాను పాన్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి. 2019 మార్చి 1 నుంచి ఈ-రిఫండ్ విధానం అమలు పరుస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. దాని ప్రకారం మనకి రావలసిన రిఫండ్ సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమ అవుతుంది.
ఆస్తులు, మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీ షేర్లు విక్రయించినట్టయితే వాటిపై వచ్చిన లాభాలను కూడా ఐటీఆర్-2లో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడులపై ఒక ఏడాది కాలంలో వచ్చిన వడ్డీ లక్ష రూపాయలు దాటినట్టయితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి పెట్టుబడి లాభాలన్నింటి పైనా ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకుండానే 10 శాతం పన్ను విధిస్తారు.
🔷ఫారం-16
🔷వేతనం స్లిప్‌లు
🔷బ్యాంకుల నుంచి వడ్డీ
🔷సర్టిఫికెట్లు
🔷ఫారం 26 ఏఎస్
🔷ఫారం 16ఏ, 16బీ, 16 సీ
🔷హోమ్‌లోన్ స్టేట్‌మెంట్
🔷పన్ను చెల్లింపు చలానా
🔷ఆధార్ కార్డు
ఐటీ రిటర్నులో మీ బ్యాంకు ఖాతాలన్నింటి వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. బ్యాంకు పేరు, బ్రాంచి వివరాలు, సేవింగ్స్/కరెంట్ అకౌంట్ నంబర్, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్ అన్నీ పొందుపరచాలి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇటీవల దేనాబ్యాంకు, విజయాబ్యాంకు విలీనమైనందు వల్ల ఆ బ్యాంకుల్లో ఖాతాలున్న వారు ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ను సరిచూసుకుని మార్పులేవైనా ఉంటే చేయాలి.
ఆదాయపు పన్ను చట్టంలో ఏయే అంశాలపై పన్ను చెల్లించాలనే విభాగంతో పాటు పన్ను ఆదా చేసుకునే సాధనాలకు సంబంధించిన విభాగం కూడా ఉంది. దాని ప్రకారం
🛑 *సెక్షన్ 80సీ :* పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, పిల్లల ట్యూషన్ ఫీజులు, ఇంటి రుణంపై చెల్లించే ప్రిన్సిపల్ వంటి మొత్తాలు
🛑 *సెక్షన్ 80డీ :* సొంతానికి, కుటుంబ సభ్యుల కోసం చెల్లించిన మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు
🛑 *సెక్షన్ 24 :* ఇంటి రుణంపై చెల్లించిన వడ్డీ
🛑 *సెక్షన్ 80 ఈఈఈ :* ఇంటి యజమానులైతే 2017 ఆర్థిక సంవత్సరంలో తాము పొందిన రుణంపై చెల్లించే వడ్డీపై రూ.50 వేల వరకు మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.
🛑 *సెక్షన్ 80 జీ :* చారిటబుల్ సంస్థలకు అందించిన విరాళాలు
🛑 *సెక్షన్ 80 టీటీఏ :* పొదుపు ఖాతాలపై ఆర్జించిన వడ్డీ (రూ.10 వేలపై)

ఫారం-16

ఈ ఏడాది స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000.
ఫారం-16 తీసుకోగానే అందులో మీ పాన్ నంబర్, పేరు తప్పులు లేకుండా నమోదయింది, లేనిది చూసుకోవాలి.అందులో పొరపాట్లేవైనా ఉంటే సవరించిన ఫారం-16ను యాజమాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
ఫారం 16-ఎ, 16-బి, 16-సి
ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఆర్‌డీలపై వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకు ప్రస్తుత పన్ను చట్టాల కింద అర్హత గల పన్ను మినహాయింపు పరిమితికి పైబడి చెల్లిస్తున్న వడ్డీ సొమ్ముపై పన్ను మినహాయించి ఉన్నట్టయితే దానికి ఫారం-16ఏ కింద టీడీఎస్ సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది.
మీరు ఏదైనా ఆస్తిని విక్రయించి ఉన్నట్టయితే దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి ఫారం-16బీ కింద టీడీఎస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. మీకు ఆస్తి ఉన్నట్టయితే దాన్ని బాడుగకు తీసుకున్న వ్యక్తి నుంచి టీడీఎస్ వివరాలతో ఫారం-16సీ ఇవ్వాలని కోరే అర్హత మీకుంది.
ప్రస్తుత చట్టాల ప్రకారం నెలవారీ అద్దె రూ.50 వేలు దాటినట్టయితే బాడుగకు తీసుకున్న వ్యక్తి దానిపై టీడీఎస్ మినహాయించాల్సి ఉంటుంది.
బ్యాంకులు, పోస్టాఫీసుల వడ్డీ సర్టిఫికెట్లు
ఈ ఏడాది ఐటీఆర్‌లో అసెసీ సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతరత్రా ఆదాయాల కింద ఎంత మొత్తంలో వడ్డీలు అందుకుంటున్నది వేర్వేరుగా పొందుపరచాల్సి ఉంటుంది. పోస్టాఫీసు లేదా బ్యాంకు ఎఫ్‌డి నుంచి వడ్డీ రూపంలో పొందుతున్న ఆదాయంపై 80 టీటీఏ కింద రూ.10 వేల వరకు మినహాయింపును కోరవచ్చు. సీనియర్ సిటిజెన్లయితే ఇలాంటి వడ్డీ ఆదాయాలపై రూ.50 వేల వరకు మినహాయింపు అర్హత ఉంది.
మార్చి 31వ తేదీ లోగా పొందిన ఇలాంటి వడ్డీ ఆదాయాలన్నింటి మీద ఆయా బ్యాంకుల నుంచి సర్టిఫికెట్లు సేకరించి ఉంచుకోవాలి. ఒకవేళ సంబంధిత ఆర్థిక సంస్థ మీకు వడ్డీ చెల్లించే సమయంలోనే పన్ను మినహాయించి ఆ వివరాలతో టీడీఎస్ ఇచ్చి ఉంటే అసెసీ వేరుగా ఈ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
80డీ, 80యూ డాక్యుమెంటరీ ఆధారాలు
సొంతానికి, భార్యా పిల్లల పేరు మీద ఆరోగ్య బీమా పాలసీలపై చెల్లించిన ప్రీమియంలపై ఏడాదిలో గరిష్ఠంగా రూ.25,000 వరకు 80-డీ సెక్షన్ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.
అలాగే తల్లిదండ్రులపై తీసుకున్న ఆరోగ్యబీమా పాలసీలకు చెల్లిస్తున్న ప్రీమియంపై తల్లిదండ్రుల వయసును బట్టి రూ.25,000 (60 ఏళ్లలోపు వయసు వారైతే), రూ.50,000 (60 ఏళ్ల వయసు మీరిన వారైతే) మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.
తల్లిదండ్రులపై ఎలాంటి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోకపోయినా వారి కోసం చేసిన వైద్య వ్యయాలపై కూడా ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.
ఫారం 26 ఏఎస్ వార్షిక కన్సాలిడేటెడ్ పన్ను స్టేట్‌మెంట్. ఒక పాన్ నంబర్‌పై డిపాజిట్ అయిన పన్ను వివరాలన్నీ అందులో ఉంటాయి.
ఫారం 26 ఏఎస్
🔷మీరు చెల్లించిన సెల్ఫ్ అసెస్‌మెంట్ పన్నులు
🔷2018-19లో ఆ వ్యక్తి చెల్లించిన అడ్వాన్స్ పన్ను
🔷యజమాని మినహాయించిన టీడీఎస్
🔷బ్యాంకులు మినహాయించిన టీడీఎస్
🔷మీకు చెల్లింపులు చేసిన సంస్థలు మినహాయించిన టీడీఎస్
⬛ *ట్రేసెస్ వెబ్‌సైట్ నుంచి ఎవరైనా ఈ కన్సాలిడేటెడ్ స్టేట్‌మెంట్ లేదా ఫారం 26 ఏఎ్‌సను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోని మీ ఖాతాలోకి లాగిన్ అయి మై అకౌంట్ విభాగంలో వ్యూ 26 ఎఎస్ అనే అంశం క్లిక్ చేయాలి. అది ఆటోమేటిక్‌గా ట్రేసెస్ వెబ్‌సైట్‌లోకి మిమ్మల్ని పంపుతుంది. అక్కడ 26 ఏఎస్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది*.
⬛ *ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న 26 ఏఎస్ ఫారంలో 2018-19లో మీ పాన్ నంబర్‌పై మినహాయించిన టీడీఎ్‌సలన్నీ సరిగ్గా ఉన్నది లేనిది చూసుకోవాలి. ఏదైనా పొరపాటు దొర్లితే దాన్ని సవరించాలని పన్ను మినహాయించిన సంస్థను కోరాల్సి ఉంటుంది. తేడా ఉన్న ఫారంతో టాక్స్‌క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకునే అవకాశం మీకుండదు*.
బ్యాంకుల నుంచి హోమ్ లోన్ స్టేట్‌మెంట్
మీరు ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి హోమ్‌లోన్ తీసుకున్నట్టయితే గత ఏడాదిలో చేసిన చెల్లింపులకు సంబంధించిన స్టేట్‌మెంట్ తీసుకోవడం తప్పనిసరి. ఇంటి రుణంపై చెల్లించిన వడ్డీకి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24 కింద గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆ ఇంటిపై మీరు చెల్లిస్తున్న వడ్డీని, దానిపై మీకు అద్దె రూపంలో వస్తున్న ఆదాయం ఏమైనా ఉంటే దాన్ని కూడా రిటర్న్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. అదే ఇంటిలో సొంతంగా నివశిస్తున్నా కూడా మినహాయింపు ఆర్హత ఉంది.
పన్ను పొదుపు పెట్టుబడుల ఆధారాలు
పన్ను పొదుపు లక్ష్యంగా చేసిన పెట్టుబడులు, వ్యయాలపై 80సీ, 80సీసీసీ, 80సీసీడీ (1) కింద మినహాయింపులకు అర్హత ఉంటుంది. ఈ మూడు సెక్షన్ల కింద గరిష్ఠంగా లక్షన్నర రూపాయల వరకు టాక్స్ బ్రేక్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు.
80సీ కింద మినహాయింపు అర్హత గల సాధనాలివే...
🔷ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలో చెల్లింపులు
🔷పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ ఖాతాలో చెల్లింపులు
🔷ఈక్విటీ అనుసంధానిత పొదుపు సాధనాల్లో పెట్టుబడులు
🔷జీవితబీమా ప్రీమియం చెల్లింపులు
🔷నేషనల్ పెన్షన్ స్కీమ్ ఖాతాలో చెల్లింపులు
🔷అన్‌లిస్టెడ్ కంపెనీల పెట్టుబడి ఆధారాలు
🔷ఒకవేళ మీరు ఏవైనా అన్‌లిస్టెడ్ కంపెనీల వాటాల్లో పెట్టుబడి పెట్టి ఉంటే ఆ వివరాలు ఇవ్వడం కూడా తప్పనిసరి.
🔷ఆ వివరాలతో పాటు మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ పాన్ నంబర్ కూడా పొందుపరచాలి.ఇవన్నీ సేకరించుకోవలసి ఉంటుంది.
ఆధార్ అనుసంధానం
పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి 2019 ఏప్రిల్ నుంచి ఆధార్ తప్పనిసరి. ప్రతి ఒక్కరూ తమ రిట ర్న్‌లో ఆధార్ నంబర్ ఇచ్చి తీరాలి. ఒకవేళ ఆధార్ కోసం దరఖాస్తు చేసి ఉంటే ఎన్‌రోల్‌మెంట్ నంబర్ పొందుపరిచి తీరాలి.
పాన్‌తో బ్యాంకు ఖాతా అనుసంధానం
బ్యాంకు ఖాతాను పాన్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి. 2019 మార్చి 1 నుంచి ఈ-రిఫండ్ విధానం అమలు పరుస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. దాని ప్రకారం మనకి రావలసిన రిఫండ్ సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమ అవుతుంది.
పెట్టుబడి లాభాలు
ఆస్తులు, మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీ షేర్లు విక్రయించినట్టయితే వాటిపై వచ్చిన లాభాలను కూడా ఐటీఆర్-2లో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడులపై ఒక ఏడాది కాలంలో వచ్చిన వడ్డీ లక్ష రూపాయలు దాటినట్టయితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి పెట్టుబడి లాభాలన్నింటి పైనా ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకుండానే 10 శాతం పన్ను విధిస్తారు.
చెక్ లిస్ట్...
🔷ఫారం-16
🔷వేతనం స్లిప్‌లు
🔷బ్యాంకుల నుంచి వడ్డీ
🔷సర్టిఫికెట్లు
🔷ఫారం 26 ఏఎస్
🔷ఫారం 16ఏ, 16బీ, 16 సీ
🔷హోమ్‌లోన్ స్టేట్‌మెంట్
🔷పన్ను చెల్లింపు చలానా
🔷ఆధార్ కార్డు
బ్యాంకు ఖాతాల వివరాలు
ఐటీ రిటర్నులో మీ బ్యాంకు ఖాతాలన్నింటి వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. బ్యాంకు పేరు, బ్రాంచి వివరాలు, సేవింగ్స్/కరెంట్ అకౌంట్ నంబర్, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్ అన్నీ పొందుపరచాలి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇటీవల దేనాబ్యాంకు, విజయాబ్యాంకు విలీనమైనందు వల్ల ఆ బ్యాంకుల్లో ఖాతాలున్న వారు ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ను సరిచూసుకుని మార్పులేవైనా ఉంటే చేయాలి.
పన్ను ఆదా సాధనాలు...
ఆదాయపు పన్ను చట్టంలో ఏయే అంశాలపై పన్ను చెల్లించాలనే విభాగంతో పాటు పన్ను ఆదా చేసుకునే సాధనాలకు సంబంధించిన విభాగం కూడా ఉంది. దాని ప్రకారం
🛑 *సెక్షన్ 80సీ :* పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, పిల్లల ట్యూషన్ ఫీజులు, ఇంటి రుణంపై చెల్లించే ప్రిన్సిపల్ వంటి మొత్తాలు
🛑 *సెక్షన్ 80డీ :* సొంతానికి, కుటుంబ సభ్యుల కోసం చెల్లించిన మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు
🛑 *సెక్షన్ 24 :* ఇంటి రుణంపై చెల్లించిన వడ్డీ
🛑 *సెక్షన్ 80 ఈఈఈ :* ఇంటి యజమానులైతే 2017 ఆర్థిక సంవత్సరంలో తాము పొందిన రుణంపై చెల్లించే వడ్డీపై రూ.50 వేల వరకు మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.
🛑 *సెక్షన్ 80 జీ :* చారిటబుల్ సంస్థలకు అందించిన విరాళాలు
🛑 *సెక్షన్ 80 టీటీఏ :* పొదుపు ఖాతాలపై ఆర్జించిన వడ్డీ (రూ.10 వేలపై)
0 Response to "Income tax return date extend up to August 31"
Post a Comment