Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Government releases funds for schools

సర్కారీ బడులకు పైసలొచ్చాయ్‌!పాఠశాలలకు నిధులు విడుదల


ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలకు సమగ్ర శిక్ష అభియాన్‌ నుంచి తొలివిడత నిర్వహణ నిధులు విడుదల అయ్యాయి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా కేటాయించిన ఈ నిధులను పాఠశాల అభివృద్ధి కమిటీల ఖాతాలకు నేరుగా జమ చేశారు. ఈ నిధుల వినియోగంపై సమగ్ర శిక్ష అభియాన్‌ అధికారులు ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు జారీ చేశారు.
Government releases funds for schools


పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి నిధులను కేటాయించారు.

 వంద లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.25 వేలు, 250 లోపు ఉంటే రూ.50 వేలు, వెయ్యి లోపు ఉంటే రూ.75 వేలు, విద్యార్థుల సంఖ్య వెయ్యికు పైగా ఉంటే రూ.లక్ష చొప్పున విడుదల చేశారు.

గ్రంథాలయానికి అవసరమైన పుస్తకాల కొనుగోలుకు, 

పత్రికలు, మాసపత్రికల కొనుగోలుకు, తాగునీరు, విద్యుత్తు, టెలిఫోన్, ఇంటర్‌నెట్‌ బిల్లులు, క్రీడాసామగ్రి, టీఎల్‌ఎం, స్టేషనరీ కొనుగోలుకు, పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, ట్యాంకులు, క్రీడామైదానాలు, పాఠశాల ఆవరణలు, విద్యుత్తు ఉపకరణాల అమరిక, శానిటరీ, ఇతర సామగ్రి కొనుగోలుకు ఖర్చు చేసుకోవచ్చు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల చెల్లింపు, ఇతర అలవెన్సుల కింద ఖర్చు చేయవచ్చు. వీటితో పాటు దాతల నుంచి సేకరించిన విరాళాలను పాఠశాల నిర్వహణ ఖర్చులకు వాడుకోవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ నిధులు పాఠశాల అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో వినియోగించాల్సి ఉంది.

కొంత వెసులుబాటు

సమగ్ర శిక్ష అభియాన్‌ నుంచి తొలి విడత నిధులు విడుదల కావడంతో పాఠశాలల నిర్వహణకు కొంత వెసులుబాటు కలిగింది. పాఠశాల అభివృద్ధి కమిటీల తీర్మానం మేరకు ప్రధానోపాధ్యాయులు నిధులను వెచ్చించాలి.

తీర్మానాలు తప్పనిసరి


పాఠశాల అభివృద్ధి కమిటీల ఖాతాలకు నిధులు జమ అయ్యాయి. పాఠశాల అభివృద్ధి కమిటీ సమావేశం తీర్మానం మేరకు నిధులను వినియోగించాలి. ప్రతి పైసాకు ఆడిట్‌ ఉంటుంది. నిధులను పాఠశాలల అభివృద్ధికి వెచ్చించే క్రమంలో ప్రధానోపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి.

School Annual Grants Release of funds 1st instalment to 6313 Secondary schools for the year 2019-20



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Government releases funds for schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0