Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Special leaves to State Government woman Teachers

ఉద్యోగం చేసే మహిళలకు వెసులుబాటు సర్వీసు కాలంలో 60 రోజులు


  ఉద్యోగుల అవసరాల నిమిత్తం ప్రభుత్వం వివిధ రకాల సెలవులు మంజూరు చేసింది. పురుషులతో పోలిస్తే మహిళలకు ప్రసూతి, పిల్లల సంరక్షణ వంటి ప్రత్యేక అవసరాలు ఉంటాయి. ఇందుకోసం ప్రత్యేక సెలవులను పొందే వెసులుబాటు వారికి ఉంటుంది.
Special leaves to State Government woman Teachers

సంరక్షణ సెలవులు

 ఉద్యోగం చేసే మహిళలు, ఉపాధ్యాయినిలకు  రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా "సంరక్షణ సెలవులు" పేరుతో  60 రోజులు మంజూరు చేస్తుంది. పిల్లలు పుట్టినప్పటినుంచి వారికి 18  సంవత్సరాలు వచ్చేలోపు ఎప్పుడైనా ఈ సెలవులను వినియోగించుకోవచ్చు ఒకే సారిగానీ, విడతల వారీగా  కానీ ఈ సెలవులను వాడుకునే సౌలభ్యం ఉంది. గతంలో జీవో జారీ  అయినా, అమలులో జాప్యం జరిగింది. కొన్ని మార్పులు, చేర్పులతో ప్రభుత్వం   ఉత్తర్వులు జారీ చేసింది. సంరక్షణ సెలవులకు సంబంధించి రెండేళ్ల క్రితమే జీవో విడుదల అయింది. ఆ తరువాత  మహిళా ఉద్యోగులు,  ఉపాధ్యాయుల నుంచి అందిన సూచనలు, సలహాల మేరకు మార్పులు చేర్పులతో ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.  వీటిని తక్షణం అమలు చేయాలని ఆదేశించింది. గతంలో చిన్న పిల్లల సంరక్షణకు మాత్రమే ఈ సెలవులు వర్తించేవి సవరించిన జీవోలో సాధారణ పిల్లలకు 18 ఏళ్ళు, దివ్యాంగులైతే 22 ఏళ్ల   వరకు ఈ సెలవులను వాడుకునే సౌకర్యం కల్పించింది.

  ఏయే సమయాల్లో..

● సంరక్షణ సెలవులను వాడుకునే సమయంలో  లీవ్ ట్రావెల్ స్పెషల్(ఎల్.టీ.సీ)ని వినియోగించుకోకూడదు.
● మైనర్లకు అనారోగ్యంగా సంభవిస్తే, ఆసుపత్రుల్లో ఆపరేషన్లు, ఇతర వైద్య పరీక్షలు చేసే సమయంలో మాత్రమే వినియోగించుకోవాలి.
●  విధి నిర్వాహణకు ఇబ్బంది కలగకుండా, ఇతర ఉద్యోగులకు పని భారం లేకుండా చూడాలి.
●  మహిళా ఉద్యోగి పనిచేసే కార్యాలయ పనివిధానం ఆధారంగా ఈ సెలవును మంజూరు చేస్తారు. ఎందుకు సెలవు మంజూరు చేయలేదని నిలదీసే అవకాశం లేదు.
●  కార్యాలయంలో ఉన్న ఇబ్బందులు దృష్యా అధికారులను సెలవు మంజూరుకు  తిరస్కరించే అవకాశం ఉన్నప్పుడు ఈ సెలవులను ఆప్షన్ గా తప్ప హక్కుగా భావించడానికి విల్లేదు. అదనపు సాయంగా మాత్రమే తీసుకోవాలి.
●  ఉద్యోగులకు సంపాదిత సెలవు మాదిరిగానే మంజూరు చేస్తారు.
● ఈ సెలవును మహిళలకు ఉన్న ఇతర సెలవులైన ప్రసూతి సెలవులతో కలిపి వాడుకునే వెసులుబాటు ఉంది.
●  సాధారణ సెలవులు, ప్రత్యేక సెలవులు, ఉద్యోగి అనారోగ్య సెలవుతో పాటు కలిపి వాడుకునే  అవకాశం ఉండదు.  పిల్లలకు సంబంధించిన అవసరాల మేరకే వాడుకోవాలి.
●  ప్రొబేషన్ పీరియడ్ లో కూడా వాడుకునే అవకాశం ఉంది.  కానీ ఈ సెలవు ఎన్ని రోజులు వాడు కుంటే అన్ని రోజులు అదనంగా ప్రొబేషన్ పీరియడ్ కొనసాగిస్తారు.
●  సంరక్షణ సెలవును వాడుకునే సమయంలో ముందుగా శాఖాధిపతి నుంచి అనుమతి తీసుకోవాలి.

  నిబంధనలు

●  సర్వీసు మొత్తంలో రెండు నెలలు(60రోజులు) మాత్రమే ఈ సెలవులు పొందే వీలు ఉంది.
● ఎంత మంది పిల్లలు ఉన్నా ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ సెలవులను వాడుకోవాలి.
●  సంరక్షణ సెలవుకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలి. దానిని సర్వీసు పుస్తకంలో నమోదు చేయాలి. జీతాలు చెల్లించే డీడీవోలు సర్వీసు రిజిష్టర్ లో ఈ పేజీని కేటాయించాలి.
●  లీవు అకౌంట్ లో పరిమితికి తగిన ఎన్ని సెలవులు వాడుకున్నా పర్వాలేదు.  మిగిలిన సెలవులను సర్వీసులో  అవసరమైనప్పుడు వాడుకునే వెసులుబాటు ఉంటుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Special leaves to State Government woman Teachers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0