Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ABOUT SIVARAM HARIRAJ GURU

బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడ లాడించిన స్వాతంత్ర్య సమరయోధుడు...
శివరాం హరి రాజ్ గురు గారి జయంతి...
            24 ఆగష్ట
   
ABOUT SIVARAM HARIRAJ GURU
   
"శివరామ్ రాజ్ గురు" మహారాష్ట్రలోని పూనే జిల్లా ఖేద్ లో మధ్య తరగతికి కుటుంబములో *24 ఆగస్టు,1908న శివరాం హరి రాజ్ గురు జన్మించాడు.
సుఖ్ దేవ్ లాగానే బాల్యము నుండి బ్రిటిష్ వారి దమన నీతిని అరాచకాలను దగ్గరగా గమనిస్తూ ఉండే వాడు.ఈ అనుభవాలు అతనిలో భారతదేశ స్వాతంత్రానికి పోరాడే విప్లవ యోధులతో కలిసి పని చేయాలన్నబలమైన కోరికను అభివృద్ధి చేశాయి. *చంద్రశేఖర ఆజాద్ యొక్క ఉద్రేకపూరితమైన ఉపన్యాసాల వల్ల ప్రేరితుడై "హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ"లో చేరాడు.
రాజ్ గురు మంచి మల్లయద్ద ప్రవీణుడు, సంస్కృత పండితుడు. ఒకే రకమైన విప్లవ భావజాలము కలిగిన వాళ్ళు అవటం వల్ల భగత్ సింగ్ సుఖ్ దేవ్ లతో స్నేహము  కుదిరి  ఈ త్రయము వారి విప్లవాత్మక చర్యలతో బ్రిటిష్ ప్రభుత్వానికి దడ పుట్టించి నిద్ర లేకుండా చేశారు.

ఫిబ్రవరి 1928 లో సైమన్ కమిషన్ భారత దేశములో కొన్ని రాజ్యాంగ సవరణలు చేయటానికి ఇండియా వచ్చింది. ఆ కమీషన్ లో ఏ ఒక్క భారతీయుడు లేకపోవటము చాలా మంది భారతీయులకు అవమానకరంగాను, నిరాశ గానూ  తోచింది  ఈ నిరసన ఉద్యమాలలో ప్రముఖ నాయకుడు లాలా లజపతి రాయ్ పోలీసులు జరిపిన లాఠీ ఛార్జ్ లో తీవ్రముగా గాయపడి ప్రాణాలను కోల్పోయాడు దేశము అధికముగా ప్రేమించే వారి నాయకుడు లాలా లజపతి రాయ్ మరణానికి  ప్రతీకార చర్య జరపాలని ఈ ముగ్గురు నిశ్చయించుకున్నారు ఫలితముగా ఈ విప్లవ యోధుల త్రయము లాఠీ ఛార్జ్ కి కారణభూతుడైన పోలీస్ సూపరిండెంట్ జాన్ సాండర్స్ అనే అధికారిని హత్య చేశారు వెనువెంటనే భగత్ సింగ్ అతని అనుచరుడు బతుకేశ్వర్ దత్,  సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లోపల కరపత్రాలను వెదజల్లి రెండు బాంబులను విసిరి ప్రతీకారము తీర్చుకుని , వారు ప్రభుత్వానికి లొంగిపోయారు బ్రిటిష్ ప్రభుత్వము ఈ రెండు కేసులను కలిపి లాహోర్ కుట్ర కేస్ గా అభియోగాలు మోపి హిందుస్తాన్  సోషలిస్టు రిపబ్లికన్  ఆర్మీ యువ నాయకులను అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టారు....
చివరి రెండు సంవత్సరాలలో వీరు ముగ్గురు జైళ్లలో ఉండి స్వాతంత్ర పోరాటంలో భారతీయులు  మరువలేని న్యాయపోరాటం సాగించారు. కోర్టులను వారు సాధనాలుగా ఎన్నుకొని వారి విప్లవ భావాలను ప్రజలలో వ్యాప్తి చెందేటట్లు చేయగలిగారు అంతే  కాకుండా జైళ్లలో రాజకీయ ఖైదీలు పడే అవస్థలను ప్రపంచానికి తెలియ జేయటము లో సఫలమైనారు. వీరి బలమైన జాతీయవాదం,వీరి త్యాగాలు చాలా మంది యువకులను స్వాతంత్ర ఉద్యమములో చురుకుగా పాల్గొనేటట్లు చేసింది.
భగత్ సింగ్ సుఖ్ దేవ్,రాజ్ గురు లను మార్చ్ 23,1931 న ఉరి తీసినప్పుడు వారికి ఘనమైన నివాళులర్పించటానికి భారత దేశములోని వివిధ ప్రాంతాలలో వేలమంది యువకులు ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించి గుమికూడారు.*
 వీరి దేహాలకు సట్లెజ్ నది ఒడ్డున గల పంజాబ్ రాష్ట్రములోని హుస్సేనీవాలా (ప్రస్తుతము పాకిస్తానులో  ఉంది)  లో అంత్యక్రియలు ఘనముగా జరిగినాయి.

ఉరి తీసేటప్పుడు భగత్ సింగ్ ,సుఖ్ దేవ్ థాపర్ ల వయస్సు 23 ఏళ్లు ,రాజ్ గురు వయస్సు 22ఏళ్ళు.

అమోఘమైన దేశ భక్తి వారి బలిదానం....

 వెలకట్టలేనిది కానీ  ఉరి తీయబడ్డాక రాజ్ గురు సుఖ్ దేవ్ ల కుటుంబాలు వారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకోవటానికి చాలా కష్ట పడ వలసివచ్చింది వారి కుటుంబీకులు వారి పూర్వికులనుండి వచ్చిన ఆస్తిని కాపాడుకోవటానికి కుడా వారికి ప్రభుత్వాల తరుఫున
(స్వాతంత్రము తరువాత) ఏ విధమైన సహాయ సహకారాలు అందలేదు వారి  ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు చేశారు ప్రభుత్వమూ లోని పెద్దలు  మాటలలో వారి త్యాగాలను పొగడటం  వరకే పరిమితము చేశారు మన నాయకులు స్వాతంత్రము తరువాత నిజముగా త్యాగాలు బలిదానాలు చేసిన సుబాష్  చంద్ర బోస్, భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ చంద్రశేఖర్ ఆజాద్ వంటి ప్రముఖులెందరో నేటి తరానికి తెలియకుండా కనుమరుగు అవటానికి కారణమవుతు  అర్హత లేని నాయకులు అందలమెక్కి నిజమైన నాయకులకు అన్యాయము చేశారు.

ఇది ప్రస్తుత భారత దేశ పరిస్థితి.

     జోహార్ జోహార్...
అమర వీరుల కు జోహర్లు
    

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ABOUT SIVARAM HARIRAJ GURU "

Post a comment