Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DRDO Scholarship:

DRDO Scholarship:
అమ్మాయిలకు గుడ్ న్యూస్...
డీఆర్‌డీఓ నుంచి స్కాలర్‌షిప్
 ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినులకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. వివరాలు
DRDO Scholarship
  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ లేదా పీజీ చదువుతున్న అమ్మాయిలకు శుభవార్త. డీఆర్‌డీఓ స్కాలర్‌షిప్స్ ప్రకటించింది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్, రాకెట్రీ, ఏవియానిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ చదువుతున్న అమ్మాయిలు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • డీఆర్‌డీఓ సహకారంతో ఏరోనాటిక్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డ్ (AR&DB) ఈ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తుంది. మొత్తం 30 స్కాలర్‌షిప్స్ ఉన్నాయి
  • ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు ప్రక్రియ 2019 జూలై 25న ప్రారంభమైంది. సెప్టెంబర్ 10న ముగుస్తుంది. https://rac.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • తగిన అర్హతలు ఉన్న అమ్మాయిలకు ఏటా రూ.1,86,000 వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. విద్యార్థినులకు స్కాలర్‌షిప్ ఇచ్చే విషయంలో డీఆర్‌డీఓ కొన్ని నియమనిబంధనల్ని విధించింది.
  • కేవలం భారతీయులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిలకు 20 స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. ఏటా రూ.1,20,000 లేదా వార్షిక ఫీజును స్కాలర్‌షిప్ రూపంలో అందిస్తుంది డీఆర్‌డీఓ.
  • నాలుగేళ్ల వరకు ఈ స్కాలర్‌షిప్  పొందొచ్చు. JEE (Main) స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ఇక ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్న అమ్మాయిలకు 10 స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. క్వాలిఫయింగ్ ఎగ్జామ్‌లో కనీసం 60% మార్కులతో పాటు గేట్ స్కోర్ తప్పనిసరి. నెలకు రూ.15,500 చొప్పున ఏటా రూ.1,86,000 వరకు ఆర్థిక సాయం లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ రెండేళ్లు ఇస్తారు
  • స్కాలర్ షిప్ కోసం ఎంపికైనవాళ్లు డీఆర్‌డీఓ, ప్రభుత్వ ల్యాబరేటరీస్ లేదా AR&DB నిధులతో నడుస్తున్న సంస్థల్లో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించిన విద్యార్థినులు అన్ని పరీక్షల్లో పాస్ కావాలి.
  • ONLINE APPLICATION HERE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "DRDO Scholarship:"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0