Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If you can't pay your LIC Policy regular.You have a good news

If you can't pay your LIC Policy regular.You have a good news
  • పాలసీ చెల్లించలేక పోతున్నారా...అయితే మీకో తీపి కబురు
  • దేశీయ దిగ్గజ భీమా కంపెనీ ఎల్ఐసీ వినియోగదారులు పాలసీ తీసుకున్నాక ప్రీమియం చెల్లించలేకపోతే తీసుకున్న పాలసీని సంస్థకు సరెండర్ చేయవచ్చు తెలుసా. 

  • అయితే ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదు. కావున పాలసీదారులకు ఇక్కడ మరో ఆప్షన్ అందుబాటులో ఉంది. 
  • పాలసీని పెయిడ్ అప్ పాలసీగా మార్చుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో ప్రీమియం చెల్లించలేక పాలసీని ఆపేయవచ్చు. ఇలాంటప్పుడు మీ పాలసీ ఆటోమేటిక్‌గానే పెయిడ్ అప్ పాలసీగా మారుతుంది. 
  • అయితే కనీసం 3 ఏళ్లు ప్రీమియం చెల్లించి ఉండాలి. ఇలా అయితేనే పాలసీ పెయిడ్ అప్ పాలసీగా మారుతుంది. లేదంటే లేదు. పాలసీదారులు.. పెయిడ్ అప్ పాలసీగా కన్వర్ట్ అయిన పాలసీపై డబుల్ యాక్సిడెంట్ కవర్, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ వంటి ప్రయోజనాలు కోల్పోతారు.
  • అలాగే మీరు ఎంత మొత్తానికైతే పాలసీ తీసుకున్నారో.. అంతే మొత్తం రాదు. తక్కువ బీమా మొత్తం లభిస్తుంది. పాలసీ సరెండర్ చేస్తే ఈ మొత్తం కూడా రాదనే విషయాన్ని గుర్తకు పెట్టుకోవాలి.
  • అంతేకాకుండా పాలసీ హోల్డర్ పాలసీని మూడేళ్లకు ముందుగానే సరండర్ చేయాలని భావిస్తే.. ఎలాంటి డబ్బులు రావు. 
  • మూడేళ్ల తర్వాత సరెండర్ చేస్తే చెల్లించిన ప్రీమియం మొత్తంలో దాదాపు 30 శాతాన్ని ఎల్ఐసీ మీకు సరెండర్ వ్యాల్యూ రూపంలో అందిస్తుంది. దీనికి కూడా షరతులు వర్తిస్తాయి.
  • ఎలాంటి బోనస్ ఉండదు. అలాగే తొలి ఏడాది ప్రీమియం మొత్తాన్ని లెక్కలోకి తీసుకోరు. అందుకే పాలసీని సంస్థకు తిరిగి ఇచ్చేయాలనే నిర్ణయం మాత్రం దాదాపు తీసుకోవద్దు. ఇకపోతే పెయిడ్ అప్ పాలసీ విషయానికి వస్తే..
  • ఉదాహరణకు మీరు 25 ఏళ్లకు పాలసీ తీసుకున్నారు. బీమా మొత్తం రూ.10 లక్షలు. 5 ఏళ్లు ప్రీమియం చెల్లించారు. తర్వాత పాలసీ ఆపేశారు. ఇప్పుడు మీ పాలసీ పెయిడ్ అప్ వ్యాల్యూ రూ.2,00,000కు తగ్గుతుంది. అంటే మీకు రూ.10 లక్షలు కాకుండా రూ.2 లక్షల బీమా మొత్తం లభిస్తుంది. 
  • పెయిడ్ అప్ వ్యాల్యూ= చెల్లించిన ప్రీమియాలు/చెల్లించాల్సిన ప్రీమియాలు×సమ్ అస్యూర్డ్ (బీమా మొత్తం).

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If you can't pay your LIC Policy regular.You have a good news"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0