Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

VINDAAM NERCHUKUNDAAM 26-08-19.MONDAY PROGRAME

Instructions for Teachers to follow when Pupils Listening to Radio Lessons
(రేడియో పాఠాలు వినిపించేటపుడు ఉపాధ్యాయులు అనుసరించవలసిన సూచనలు)
 VINDAAM NERCHUKUNDAAM 26-08-19.MONDAY PROGRAME

ప్రాథమిక విద్యను గుణాత్మకంగా అందించడం మన ప్రధానలక్ష్యం. ఈ దిశలో "విందాం నేర్చుకుందాం" రేడియో పాఠాలను ప్రసారం చేస్తున్నాం. ఇందులో భాగంగా సామర్ధ్యాలు మరింత సమర్థవంతంగా బోధించడానికి IRI పాఠాలు ఉప యోగ పడుతాయి.
 IRI అంటే "ఇంటరాక్టివ్ రేడియో ఇన్స్ట్రక్షన్" అంటే రేడియోలో ఇచ్చిన సూచనల ఆధారంగా ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు కృత్యాలు నిర్వహించడం, ఆటలు ఆడటం, పాటలు పాడటం, విద్యా ప్రమాణాల ఆధారంగా కల్పించిన బోధనాభ్యసన ప్రక్రియలు, కృత్యాలలో చురుకుగా పాల్గొనాలి.
 IRI రేడియో పాఠాలు ప్రపంచ దేశాల్లో 26 సంవత్సరాల క్రితమే ప్రసారంలో ఉన్నాయి. అనేక దేశాలు ఈ కార్యక్రమన్ని వారి చిన్నారుల కోసం నిర్వహిస్తున్నాయి. వినడంతో పాటు సూచన ఆధారంగా విద్యార్థులు కృత్యాలు చేయడం ఇందులో కీలకమైన అంశం.

రేడియో పాఠాలు విన్పించుటకు సూచనలు :


1. రేడియో పాఠాలు విన్పించుటకు ముందు చేయాల్సిన కృత్యాలు:

  • రేడియో ప్రసార షెడ్యూల్స్ లో మార్పులుండవు.
  •  ప్రసార విషయానికి చెందిన అంశం ఆధారంగా సంబంధిత ఉపాధ్యాయుడు నిర్దేశించిన తేదీలలో తరగతి, సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలి.
  •      టీచర్ పిల్లలతో మాట్లాడడం ద్వారా, చర్చించడం ద్వారా రేడియోలో ప్రసారమయ్యే పాఠ్యాంశానికి సంసిద్ధులను చేయాలి. 
  • పాఠం వినడానికి ఆసక్తి కలిగేలా పాఠానికి సంబంధించిన తేలికైన ప్రశ్నలను అడగాలి. 
  • పిల్లలలో రేడియో పాఠంపట్ల ప్రేరణను కలుగజేయాలి. ఇలా చేయడం వల్ల శ్రద్ధగా ఏకాగ్రతతో, ఆసక్తితో రేడియో పాఠాన్ని వింటారు.

2. రేడియో కార్యక్రమాలు వినేందుకు పిల్లలను కూర్చుండ బెట్టే విధానం - సూచనలు:


  • పిల్లల్ని అర్థవృత్తాకారంలో కూర్చోమనాలి.
  • ఈ ఆర్థవృత్తంలో తగినంత ఎత్తులో టేబుల్/ కుర్చీ పైన "రేడియో/ఆర్.సి.సి.పిని ఉంచాలి.
  • ఇతర తరగతి గదులలో కూర్చున్న పిల్లలకు ఆటంకం కలగకుండా రేడియో / ఆర్.సి.సి.పి వాల్యూమ్ ఉండేట్లుగా చూసుకోవాలి.
  • 3. రేడియో పాఠం విన్పించడం:
  • పిల్లలతో పాటు టీచర్ కూడా శ్రద్దగా రేడియో పాఠం వినాలి. 
  • వింటున్నప్పుడు సాంకేతిక పదాలు, ముఖ్యాంశాలు, ఆసక్తికర సంభాషణాంశాలను ఒక నోటు బుక్కులో నమోదు చేయాలి. 
  • వాటి గురించి రేడియోపాఠం తర్వాత చర్చించడం, కృత్యాలు నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించాలి. 
  • మధ్య మధ్య పిల్లలు ఏకాగ్రతతో వింటున్నారా లేదా పరిశీలించాలి.
  • పిల్లల ప్రతిస్పందనలు, నమోదు చేయాలి. ఇవే కార్యక్రమ విజయాన్ని, వైఫల్యాన్ని తెలుపడంలో కీలకపాత్ర వహిస్తాయి.

4. రేడియో పాఠం విన్న తర్వాత నిర్వహించాల్సిన కృత్యాలు :

  • టీచర్ రేడియో స్విచ్ ఆఫ్ చేయాలి. పిల్లలు ఎక్కడ ఎలా కూర్చున్నారో అలాగే కూర్చోమనాలి.
  • రేడియో పాఠం వింటున్నప్పుడు నమోదు చేసిన అంశాల ఆధారంగా చర్చను చేపట్టాలి.
  • ఇందుకోసం మొదట పిల్లలను కొన్ని మామూలు / సాధారణ ప్రశ్నలు అడగాలి.
  • ఉదాహరణ:
  • పాఠం ఎలా ఉంది?
  • నీ కిష్టమైందా? ఎందుకు?
  • పాఠంలో నీకు బాగా నచ్చిన అంశం ఏది?
  •  ఎందుకు నచ్చింది?
  • పిల్లల నుండి సమాధానాలను రాబట్టుతూ అందరిని చర్చలో చురుకుగా పాల్గొనేట్లు చూడాలి.

  • విందాం - నేర్చుకుందాం"*నేటి రేడియో పాఠం*

తేది : 26.08.2019
 విషయము : పరిసరాల విజ్ఞానము
 పాఠం పేరు : "నది జీవన విధానం"
*తరగతి : 5వ తరగతి
సమయం : 11-00 AM
 నిర్వహణ సమయం : 30 ని.లు
〰〰〰〰〰〰〰〰
✳ *నది జీవన విధానం* 
〰〰〰〰〰〰〰〰
✡ *బోధనా లక్ష్యాలు:*
*విద్యార్థినీ విద్యార్థులు :*
• నదుల ఆవశ్యకత గురించి తెలుసుకుంటారు.
• గోదావరి ఏయే రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందో అవగాహన చేసుకుంటారు.
• నదులపై ఆధారపడికొందరు జీవనాధారం కొనసాగిస్తున్నారని గ్రహిస్తారు.
• నదీ తీర ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలుగా విలసిల్లుతున్నాయని గ్రహిస్తారు.
• నదీ తీర ప్రాంతాలలో ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయని అర్థం చేసుకొంటారు.
★★★★★★★★★★★★★
✡ *బోధనాభ్యసన సామగ్రి:* నల్లబల్ల, సుద్దముక్క, పాఠ్యపుస్తకం
★★★★★★★★★★★★★
*ఆట :*
*ఆట పేరు నది - గట్టు*
• తరగతిలో పెద్ద వృత్తం గీయవలెను.
• రేడియోలో మ్యూజిక్ వస్తున్నంత సేపు వృత్తం చుట్టూ పరిగెత్తుతుండాలి.
• రేడియో మ్యూజిక్ ఆగి, రేడియో టీచర్ "నది'" అనగానే వృత్తం లోపలకు దూకాలి.  "గట్టు" అనగానే వృత్తం బయటకు దూకాలి. ఇలా ఆట ఆడించాలి.
★★★★★★★★★★★★★
*కార్యక్రమములో ప్రసారమయ్యే పాటను చార్డుపై స్పష్టంగా రాసి తరగతి గదిలో ప్రదర్శించాలి.*
🎼  *పాట*
🎤 పల్లవి :
గల గలా పరుగులెత్తి గోదావరి తల్లీ
తెలుగు వారి లోగిలిలో నీవు కల్పవల్లీ   //గల గలా//

🎻 చరణం 1:
పడమటి కనుమలలో నీవు జనియిం చావు
ఆంధ్రాలో రావిగూడాన అడుగు పెట్టావు
వొంపు సొంపులతో నిండుగా ప్రవహించావు,
తెలుగు వాకిట సిరులెన్నో కురిపించావు    //గల గలా //

🎻 చరణం 2:
చక్కని అందాలు పంచే దక్షిణ గంగవయ్యావు
ఎందరికో ఉపాధి నిచ్చి గోదారి తల్లివయ్యావు
మంచి జలము నిచ్చి గోదావరి వయ్యావు
మన పుడమి తల్లినే పులకింపజేశావు  //గల గలా //

🎻 చరణం 3:
నీ సుదీర్ఘ పయనంలో ప్రాజెక్టులెన్నో నిలిపావు
రైతులకు సిరుల నిచ్చే కల్పతరువై నిలిచావు
ఆలయాల కెన్నింటికో ఆలవాలమైనావు
జనులందరికీ సుఖ శాంతులు ప్రసాదించావు.   //గల గలా //
★★★★★★★★
✡ *పాట ప్రసార సమయంలో*
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
★★★★🔚🙋‍♂★★★★

      

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " VINDAAM NERCHUKUNDAAM 26-08-19.MONDAY PROGRAME"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0