Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Reservation Implementation in Medical Counseling


  • మెడికల్‌ కౌన్సెలింగ్‌పై తర్జనభర్జన
  • ప్రభుత్వానుమతి లేకుండానే బ్రేక్‌?
  • వర్సిటీ సొంత నిర్ణయంతో తంటాలు
  • హైకోర్టును ఆశ్రయించిన బీసీ సంఘాలు

అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): మెడికల్‌ కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్‌ అమలు రోజుకో వివాదంగా మారుతోంది. దీంతో కౌన్సెలింగ్‌ విషయంపై ప్రభుత్వం ఎటూ తేల్చలేకపోతోంది. మొత్తంగా రీ కౌన్సెలింగ్‌ నిర్వహించాలా? లేక రెండో విడత కౌన్సెలింగ్‌ రద్దు చేసి, ఆ సీట్లకే మళ్లీ కౌన్సెలింగ్‌ నిర్వహించాలా? అనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోంది.
Reservation Implementation in Medical Counseling

మరోవైపు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని మెడికల్‌ విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అధికారులు మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు. కానీ ఈ రెండు విడతల కౌన్సెలింగ్‌ల సమయంలో లోపాల వల్ల రిజర్వేషన్‌ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో రెండు వారాల కిందటే కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలిపివేశారు. మరోవైపు రిజర్వేషన్‌ అభ్యర్థులకు అన్యాయం జరిగిందా? లేదా? అని అడిగితే మాత్రం వర్సిటీ అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. మరోవైపు వర్సిటీ అధికారులు చేసిన తప్పిదం ప్రభుత్వ మెడకు చుట్టుకుంది. రిజర్వేషన్‌ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఒప్పుకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. ఒప్పుకోకపోతే బీసీ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ప్రభుత్వానికి పాలుపోవడం లేదు. 2017లో నిర్వహించిన మెడికల్‌ కౌన్సెలింగ్‌లో జీవో 550ని అమలు చేశారు. ఈ సమయంలో తొలి విడత కౌన్సెలింగ్‌లో తొలుత ఓపెన్‌, తర్వాత రిజర్వేషన్‌ ఆ వెంటనే ఓపెన్‌ టూ ఆల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు భర్తీ చేశారు. ఈ ఏడాది మాత్రం తొలి విడతలో తొలుత ఓపెన్‌ కేటగిరి, ఆ తర్వాత రిజర్వేషన్‌ కేటగిరిని తెరమీదికి తెచ్చారు. ఓపెన్‌ టూ ఆల్‌ కౌన్సెలింగ్‌ ప్రస్తావన లేకుండా మళ్లీ విద్యార్థుల నుంచి ఆప్షన్లు కోరారు. దీంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొత్తం గందరగోళానికి దారితీసింది. మరోవైపు రెండో విడత కౌన్సెలింగ్‌లో తొలుత ఓపెన్‌ కేటగిరి సీట్లు భర్తీ చేయాల్సి ఉండగా రిజర్వేషన్‌ కేటగిరి సీట్లు భర్తీ చేశారు. దీంతో సుమారు 80 నుంచి 100 మంది రిజర్వేషన్‌ అభ్యర్థులు సీట్లు కోల్పోయారు.

స్టే ఇచ్చిన హైకోర్టు

రిజర్వేషన్‌ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని గత వారంలో బీసీ సంఘాల నేతలు హైకోర్టును ఆశ్రయించారు. వీరి ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తొలుత కౌన్సెలింగ్‌పై స్టే ఇచ్చింది. తాము చెప్పే వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించవద్దని స్పష్టం చేసింది. అప్పటికే కౌన్సెలింగ్‌ నిలిపివేసిన వర్సిటీ అధికారులు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ బుధవారం దీనిపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేస్తుందోనని వర్సిటీ సహా విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం ఆగస్టు 31తో దేశ వ్యాప్తంగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగించాలి. అప్పటికి భర్తీ చేయకపోతే ఆ సీట్లు మురిగిపోయే ప్రమాదముంది. మరోవైపు కన్వీనర్‌ కోటా(ఏ-కేటగిరి) సీట్లు భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో బీ, సీ కేటగిరి సీట్ల భర్తీ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఏ కేటగిరి సీట్ల భర్తీపై స్పష్టత వస్తే కానీ మిగిలిన కేటగిరీల సీట్లు భర్తీ చేయడానికి వీలుపడదు. కాబట్టి ఆగస్టు తర్వాత కూడా కౌన్సెలింగ్‌కు ఎంసీఐ నుంచి ముందే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆప్షన్లకు అనుమతిలేదు:

ఈ ఏడాది కౌన్సెలింగ్‌లో వర్సిటీ అధికారులు సొంత నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 గతేడాది టీడీపీ ప్రభుత్వం మెడికల్‌ కౌన్సెలింగ్‌లో జీవో 550 అమలు చేసేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అప్పటికే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జీవో 550 దేశ వ్యాప్తంగా అమలవుతోంది. కాబట్టి సుప్రీం కోర్టు కూడా జీవో 550 ద్వారానే మెడికల్‌ సీట్లు భర్తీ చేయాలని స్పష్టం చేసింది. కానీ కౌన్సెలింగ్‌ తర్వాత ఎంత మంది విద్యార్థులు ఓపెన్‌ నుంచి రిజర్వేషన్‌లోకి వచ్చారో తెలుసుకోవాలని సూచించింది. దీనిని మెరిటోరియల్‌ రిజర్వేషన్‌ కేటగిరి(ఎంఆర్‌సీ) అంటారు. ఈ ఎంఆర్‌సీ అభ్యర్థులను గుర్తించేందుకు వర్సిటీ అధికారులు మొదటి విడత కౌన్సెలింగ్‌ సమయంలో తొలుత ఓపెన్‌, తర్వాత రిజర్వేషన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి బ్రేక్‌ ఇచ్చి, మళ్లీ విద్యార్థుల దగ్గర నుంచి అప్షన్లు అడిగారు. కౌన్సెలింగ్‌కు బ్రేక్‌ ఇచ్చి విద్యార్థుల నుంచి ఆప్షన్లు కోరడంతో ప్రక్రియ గందరగోళంగా మారింది. ఎంఆర్‌సీ అభ్యర్థులను గుర్తించాలని సుప్రీం కోర్టు సూచించింది కాబట్టే తాము ఈ విధంగా చేశామని వర్సిటీ అధికారులు చె బుతున్నారు. మరోవైపు వర్సిటీ అధికారులు ప్రభు త్వం నుంచి అనుమతి తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Reservation Implementation in Medical Counseling"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0