Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sushma Swaraj passed away ,Sushma Swaraj biography

 సుష్మా స్వరాజ్ ఇకలేరు...గుండెపోటుతో ఢిల్లీ ఎయిమ్స్ లో కన్నుమూత...

Sushma Swaraj passed away ,Sushma Swaraj biography

Sushma Swaraj passed away: కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య శాలలో కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సుష్మ స్వరాజ్ వయస్సు 67 సంవత్సరాలు. అయితే హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సుష్మాకు గుండెపోటురావడంతో ఆమెను అత్యవసరంగా ఎయిమ్ష్ తరలించారు. అయితే చికిత్స అందిస్తుండగానే మధ్యలోనే సుష్మా కన్నుమూశారు. దీంతో సర్వత్రా విషాదం అలుముకుంది


సుష్మా స్వరాజ్ (ఫిబ్రవరి 14, 1952 - ఆగస్టు 6, 2019) భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నాయకురాలు. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశ మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు. 1970లో రాజకీయ రంగప్రవేశం చేసిన సుష్మా విద్యార్థి సంఘం నాయకురాలిగా ఉంటూ ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి 1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో కాలుపెట్టారు. అదే సంవత్సరంలో కేంద్రంలో ఏర్పాటైన జనతా ప్రభుత్వంలో స్థానం సంపాదించారు. 1996, 98లలో వాజపేయి మంత్రివర్గంలలో కూడా ఈమెకు చోటు లభించింది. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 మే 26 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు. సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్‌ ప్రముఖ న్యాయవాది మరియు మిజోరాం గవర్నరుగా పనిచేశారు.

విదేశీ వ్యవహారాల మంత్రి

పదవీ కాలము .2014, మే 26 నుంచి
నియోజకవర్గము విదిషా లోకసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం : .   1952 ఫిబ్రవరి 14 (వయస్సు: 67  సంవత్సరాలు)
అంబాలా కంటోన్మెంట్, హర్యానా
మరణం  :.            ఆగస్టు 6, 2019ఢిల్లీ
రాజకీయ పార్టీ:     భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి:     స్వరాజ్ కౌశల్
సంతానము:            ఒక కూతురు
నివాసము :             ఢిల్లీ

బాల్యం,విద్యాభ్యాసం

సవరించు



1952, ఫిబ్రవరి 14న అంబాలాలో జన్మించిన సుష్మాస్వరాజ్ కళాశాల విద్య వరకు స్థానికంగా అంబాలాలోనే జరిగింది. ఆ తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినారు. 1970లలో విద్యార్థి దశలోనే ఆమె ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమం నడిపారు.

రాజకీయ జీవితం

సవరించు

హర్యానా రాజకీయాలు
1977లో జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభ సభ్యురాలిగా ఎన్నికై 1982 వరకు ఆ పదవిని నిర్వహించి మళ్ళీ 1987లో రెండో పర్యాయం భారతీయ జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభకు ఎన్నికైనారు.[1] 1977 నుంచి 1979 వరకు దేవీలాల్ప్రభుత్వంలో కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖల కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. 1984లో సుష్మాస్వరాజ్ భారతీయ జనతా పార్టీలో చేరినారు. 1987 నుంచి 1990 వరకు దేవీలాల్ నేతృత్వంలోని లోకదళ్-భారతీయ జనతా పార్టీ సంయుక్త ప్రభుత్వంలో ఈమె విద్య, ఆరోగ్య మరియు సివిల్ సప్లై శాఖల కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు.
జాతీయ రాజకీయాలు
1990లో సుష్మాస్వరాజ్ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాలలో ప్రవేశించారు.[2] అంతకు ముందు 1980, 1984, 1989లలో కార్నాల్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి పరాజయం పొందినారు. 1996లోఈమె దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికైనారు. 1996లో 13 రోజుల అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించింది. 1998లో 12వ లోక్‌సభకు మళ్ళీ రెండో పర్యాయం దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి [3] ఎన్నికై వాజపేయి రెండో మంత్రివర్గంలో మళ్ళీ అదే శాఖను చేపట్టినారు. మార్చి 19 నుంచి అదనంగా టెలికమ్యునికేషన్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించడానికి 1998 అక్టోబరులో సుష్మాస్వరాజ్‌ను భారతీయ జనతా పార్టీ అధిష్టానం కేంద్రమంత్రిమండలి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాడానికి పంపబడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా సుష్మాస్వరాజ్ రికార్డు సృష్టించిననూ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పరాజయం పొందుటతో డిసెంబరులో మళ్ళీ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశీంచారు.
బళ్ళారిలో సోనియాగాంధీపై పోటీ
1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సోనియా గాంధీకర్ణాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయుసమయంలో భారతీయ జనతా పార్టీ తరఫున బలమైన మహిళా నాయకురాలిని నియమించుటకై సుష్మాస్వరాజ్‌ను బరిలోకి దించారు. దేశ స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పార్టీ తప్ప మరే పార్టీ ఇక్కడినుంచి విజయం సాధించలేకపోవడంతో సోనియాగాంధీ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొంది. ఊహించినట్లుగానే సుష్మాస్వరాజ్ ఓడిపోయిననూ [4]సోనియాపై పోటీచేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది.
రాజ్యసభ సభ్యురాలిగా
2004 ఏప్రిల్లో సుష్మాస్వరాజ్ ఉత్తరఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైంది. 2000 సెప్టెంబర్ నుంచి 2003జనవరి వరకు కేంద్రంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేసింది. జనవరి 2003 నుంచి మే 2004వరకు మరో రెండూ శాఖలు (ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు పార్లమెంటరీ వ్యవహారాలు) అదనంగా చేపట్టింది. 2006 ఏప్రిల్లో మధ్యప్రదేశ్ నుంచి మళ్ళీ రాజ్యసభకు ఎన్నికై ఆ పదవిలో కొనసాగుతోంది

వ్యక్తిగత జీవితం

సవరించు

1975లో సుష్మాస్వరాజ్ వృత్తిరీత్యా న్యాయవాదిఅయిన స్వరాజ్ కౌశల్‌ను వివాహంచేసుకున్నది. వారి సంతానం ఒక కూతురు. భర్త స్వరాజ్ కౌశల్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా, మిజోరాం గవర్నరుగా పనిచేశాడు. బరోడా బాంబు పేలుళ్ళ కేసులో జార్జి ఫెర్నాండెజ్ తరఫున వాదించి గెలిపించాడు

మరణం

సవరించు

2019ఆగస్టు 6 మంగళవారం సాయంత్రం గుండెపోటురావడంతో చికిత్సకోసం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ 2019ఆగస్టు 6 రాత్రి మరణించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sushma Swaraj passed away ,Sushma Swaraj biography"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0