Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Teachers ... Adjustment is not easy

ఉపాధ్యాయుల... సర్దుబాటు తేలేదెలా!
● ఆగస్టు ఒకటి తర్వాత ప్రవేశాల సంగతేమిటి?
● ఛైల్డ్‌ఇన్‌ఫోకు ఎక్కని పిల్లల సమాచారం
● సెకండరీగ్రేడ్‌లోనే 180 మంది మిగులు టీచర్లు
● 600కు పైగా అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల ఆవశ్యకత

ఈనాడు, గుంటూరు: జిల్లాలో ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియ చేపట్టడానికి జిల్లా విద్యాశాఖకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో దీన్ని ఎలా పూర్తి చేయాలో తెలియక యంత్రాంగం సతమతమవుతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆగస్టు ఒకటో తేదీ నాటికి ఉన్న ప్రవేశాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయుల లెక్కలు తేల్చాలని ప్రభుత్వం ఆదేశించింది. అవసరమనుకుంటే మిగులు ఉపాధ్యాయులను ఆయా పాఠశాలలకు డిప్యుటేషన్‌పై పంపాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియను ఈ నెల 20 నాటికి పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి ఆదేశించారు. ఈ నెల 14న ప్రతి పాఠశాల నోటీసు బోర్డులో పిల్లల సంఖ్య, మిగులు ఉపాధ్యాయుల వివరాలను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి దాకా జిల్లాలో ఆగస్టు ఒకటో తేదీ నాటికి ఉన్న పిల్లలు, వారి సంఖ్య ఆధారంగా ఉన్న మిగులు ఉపాధ్యాయులను గుర్తించటానికి తొలుత తమకు వాస్తవ ప్రవేశాల లెక్కలు తేలటం లేదని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి విద్యార్థి ప్రవేశాన్ని చైల్డ్‌ ఇన్‌ఫో డేటాకు అనుసంధానించాలి. ఇది పూర్తిగా ఆధార్‌ ప్రాతిపదిక డేటా. బయోమెట్రిక్‌ యంత్రాలు చాలా మంది పిల్లల కనురెప్పలు, వేలిముద్రలను స్వీకరించటం లేదు. దీంతో వాస్తవంగా ఛైల్డ్‌ ఇన్‌ఫో డేటాకు, వాస్తవంగా పాఠశాల ప్రవేశాల రిజిస్టర్‌లో ఉన్న సంఖ్యకు పొంతన ఉండడం లేదు. ప్రభుత్వం మాత్రం తప్పనిసరిగా ఛైల్డు ఇన్‌ఫో డేటా ఆధారంగానే మిగులు ఉపాధ్యాయులను గుర్తించాలని ఆదేశించటంతో ఈ ప్రక్రియ నిర్వహణలో ఎలా ముందుకెళ్లాలో తెలియటం లేదని విద్యాశాఖవర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి స్పష్టతను ఇవ్వాలని కోరామని, వారి నుంచి స్పందన లేదంటున్నారు. పాఠశాల ప్రవేశాల రిజిస్టర్ల ఆధారంగా అయితే పిల్లల సంఖ్య పెరుగుతారు. అదే ఛైల్డ్‌ఇన్‌ఫో డేటా అయితే తక్కువ మంది ఉంటారని, చాలా మంది పిల్లల కనురెప్పలు చిత్రీకరించే పరిస్థితి లేకపోవటంతో వారి వివరాలను మాన్యువల్‌గా చూపాల్సి వస్తోందని గుర్తు చేశారు.

ఆగస్టు ఒకటి తర్వాత చేరికలు...: 

ఆగస్టు ఒకటో తేదీ నాటికి ఉన్న ప్రవేశాల ఆధారంగా మిగులు ఉపాధ్యాయులను గుర్తించాలని ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లో ఉంది. అయితే ఆగస్టు 30 వరకు ప్రవేశాలు చేసుకునేలా ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో ఇంకా పిల్లలు చేరుతూనే ఉన్నారు. ఈ చేరికల వల్ల వాస్తవ సంఖ్య ఎంత అనేది పక్కాగా రాదని, దీనిపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరినా ఎవరూ స్పందించటం లేదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇంత అయోమయ పరిస్థితుల్లో మిగులు ఉపాధ్యాయుల లెక్కలు తేల్చటం కష్టమేనని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం మిగులు ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి పారదర్శకంగా వారికి విధి నిర్వహణ కేటాయిస్తామని పేర్కొంది. అసలు పిల్లల సంఖ్య నిర్ధారింపులోనే స్పష్టత లేదని, మిగులు ఉపాధ్యాయుల లెక్కలు తేల్చటం ఎలా సాధ్యమని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇవన్నీ పక్కాగా తేలాకే కౌన్సెలింగ్‌ ద్వారా వారిని అవసరం ఉన్న పాఠశాలలకు పంపటానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయుల్లో ఎక్కడా మిగులు సిబ్బంది లేరు. కేవలం సెకండరీ గ్రేడ్‌ టీచర్లు మాత్రమే 180 మంది వరకు లెక్క తేలారని, వారిని కూడా ఆగస్టు ఒకటి తర్వాత చేరిన ప్రవేశాలతో ధ్రువీకరిస్తే ఇంకా కొంత మంది తగ్గే అవకాశం ఉంటుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

600కు పైగా అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల ఆవశ్యకత! : 

జిల్లా వ్యాప్తంగా ఉన్న సెకండరీ గ్రేడ్‌లో మిగులు టీచర్లను ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేయగా ఇంకా 600 మందికి పైగా అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల ఆవశ్యకత ఉంటుందని జిల్లా విద్యాశాఖ తాత్కాలికంగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బీఈడీ ఉపాధ్యాయ విద్య అభ్యసించిన వారితో ఈ పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తోంది. వీరిని నియామకం చేయకపోతే అనేక పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడి బోధన కుంటుపడటమేకాదు.. అంతిమంగా పది ఫలితాలపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Teachers ... Adjustment is not easy"

Post a comment