Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The duties of village volunteers

The duties of village volunteers

 ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. ఈ వలంటీర్లకు గ్రామాల్లో 31 రకాల విధులను ప్రభుత్వం కేటాయించింది. సకాలంలో, పారదర్శకంగా సేవల నిర్ధారణ, అన్ని స్థాయిల్లో అవినీతి తొలగింపు, ఒక్కో వలంటీరు తన పరిధిలోని 50 కుటుంబాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం... లక్ష్యంగా ఈ వలంటీర్ల వ్యవస్థను రూపొందించారు. కుటుంబాలు, గ్రామ పంచాయతీలతో పాటు ప్రభుత్వ విభాగాలతో అనుసంధానమై ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సకాలంలో అభిప్రాయాన్ని సేకరించడం వీరి విధుల్లో మరో ముఖ్యమైనది.
The duties of village volunteers

ఆగస్టు 15 నుంచి వారికి కేటాయించిన 50 కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తారు.

గ్రామ వలేంటీర్ల సేవలు ఆగస్ట్ 15 నుంచి...51 రకాలు సేవలు..వివరాలు

అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తిస్తారు. పెన్షన్ల పంపిణీ, బియ్యం, ఇతర అత్యవసర వస్తువుల డోర్‌ డెలివరీ, రేషన్‌ కార్డులు/ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, అన్నీ రకాల ధృవపత్రాల పంపిణీని వీరు చేపడతారు.
రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి పారుదల, తాగునీరు, పారిశుధ్యం, పరిసరాల శుభ్రత, ప్రాథమిక విద్యలో తదితర అంశాలలో వీరు భాగస్వామవుతారు. పంచాయతీ కార్యదర్శి ఆధీనంలో పనిచేసే వలంటీర్లు గ్రామ సచివాలయం కోరిన సమాచారం ఎప్పటికప్పుడు అందచేస్తారు. కుల, మత, వర్గ, లింగ, రాజకీయ భేదాలకు అతీతంగా అర్హత కలిగిన వ్యక్తులకు ప్రభుత్వ పథకాలు అందించడంలో వలంటీర్లు సహకరించాలి. గ్రామాల్లోకి కొత్తగా ప్రవేశించిన వ్యక్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి పంచాయతీకి అందజేయాలి. విపత్తుల నిర్వహణ, ఆకస్మిక సంఘటనల నేపథ్యంలో నిర్దేశిత కుటుంబాలకు తగిన సహాయ సహకారాలను అందించడం, మద్యపాన నిషేధం, బాల్యవివాహాలు రూపుమాపడానికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The duties of village volunteers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0