Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Village Secretariat Ward Secretariat on examination management arrangements and examination Time Table

  ●మౌఖిక పరీక్షల్లేవ్‌
   ●రాత పరీక్షలతోనే ‘గ్రామ సచివాలయ’ ఎంపికలు
   ●నిమిషం నిబంధన కచ్చితం

మౌఖిక పరీక్షల్లేవ్‌

  • గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షల ద్వారానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, 
  • మౌఖిక (ఇంటర్వ్యూలు) పరీక్షలు ఉండబోవని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరు గిరిజా శంకర్‌ వెల్లడించారు. 
  • రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
  •  సెప్టెంబరు 1 నుంచి 8వ తేదీ మధ్య 19 రకాల పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలను రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 21,69,719 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరికోసం 6వేలకుపైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 
  • పంచాయతీరాజ్‌, పురపాలకశాఖల ఆధ్వర్యంలో తాడేపల్లిలో మంగళవారం పరీక్షల నిర్వహణపై జరిగిన కార్యశాల సందర్భంగా గిరిజా శంకర్‌ ‘ఈనాడు ప్రతినిధి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ...

Village Secretariat Ward Secretariat on examination management arrangements and examination Time Table

కనీసం 30 కిలోమీటర్ల పరిధిలో


  • అభ్యర్థులు దరఖాస్తుల్లో పేర్కొన్న చిరునామాల ఆధారంగా మండలాలను క్లస్టర్లుగా విభజించి పరీక్షా కేంద్రాలను కేటాయించాం. 
  • కనీసం 30 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. అభ్యర్థులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 
  • ఆర్టీసీ బస్సులను నడుపుతాం. ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు రాసే అభ్యర్థులకు ఒకే కేంద్రాన్ని కేటాయించాం. 
  • అభ్యర్థులకు అందజేసే హాల్‌టికెట్లలో కేంద్రాల చిరునామా స్పష్టంగా ఉంటుంది. 
  • వారి సెల్‌ఫోన్లకు పరీక్షా కేంద్రాన్ని గుర్తించే వెబ్‌లింకును పంపుతాం.
  •  దీనిని క్లిక్‌ చేస్తే గూగుల్‌ మ్యాప్‌ ద్వారా పరీక్షా కేంద్రాన్ని గుర్తించవచ్చు. 
  • ప్రారంభం రోజునే అంటే 1వ తేదీనే (కేటగిరీ-1) గరిష్ఠంగా 12.54 లక్షల మంది పరీక్షలు రాయబోతున్నారు.


ర్యాండమ్‌ విధానంలో ఇన్విజిలేటర్ల ఎంపిక


  • ర్యాండమ్‌ విధానంలో ఇన్విజిలేటర్ల ఎంపిక జరుగుతుంది.
  •  జూనియర్‌ అసిస్టెంట్‌/సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ స్థాయివారు ఇన్విజిలేటర్లుగా ఉంటారు. 
  • వారికి వారం రోజుల ముందుగా తెలియజేస్తాం.
  •  కానీ కేటాయించిన కేంద్రాల గురించి పరీక్షల నిర్వహణ ముందు రోజే తెలుస్తుంది. 
  • ర్యాండమ్‌ విధానంలోనే పరీక్షల నిర్వహణ బాధ్యతలను అధికారులకు కలెక్టర్లు కేటాయిస్తారు.


ఓఎంఆర్‌ షీటు ప్రతి


  • సాంకేతిక పాఠ్యాంశాలకు సంబంధించిన రాత పరీక్షలే ఎక్కువగా ఉన్నాయి. 
  • తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రశ్నలిస్తున్నాం. జవాబులు గుర్తించిన ఓఎంఆర్‌ షీటు ప్రతిని అభ్యర్థులు వెంట తీసుకెళ్లొచ్చు. 
  • రుణాత్మక (మైనస్‌) మార్కులున్నాయి. 
  • పరీక్షలు జరిగే రోజు సాయంత్రమే ప్రాథమిక ‘కీ’ విడుదలవుతుంది. 
  • అభ్యంతరాలను నిపుణుల బృందాలు పరిశీలిస్తాయి. 
  • అక్టోబరు 2వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల ఎంపికైనవారు విధుల్లో చేరతారు.

కమాండ్‌ కంట్రోల్‌


  • రాజధానిలోనూ, ప్రతి జిల్లా కేంద్రంలోనూ కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థల ద్వారా పరీక్షలపై పర్యవేక్షణ ఉంటుంది.
  •  నిర్వహణ సమయంలో అధికారులు తప్పిదాలు చేస్తే శాఖాపరంగా కఠిన చర్యలుంటాయి. 
  • పరీక్షల నిర్వహణకు ఒక్కో అభ్యర్థిపై కనీసం రూ.150 వరకు ఖర్చవుతోంది. 
  • మొత్తమ్మీద రూ.30 కోట్లు అవుతోంది.
  •  ప్రశ్నపత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్‌రూంలు సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయి.


సమయం దాటితే అనుమతి లేదు


  • సెప్టెంబరు 1 నుంచి 6 రోజులపాటు రాత పరీక్షలు జరుగుతాయి. 
  • ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలుంటాయి. 
  • అభ్యర్థులు కనీసం గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. 
  • పరీక్ష ప్రారంభమైన తరువాత నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను అనుమతించేదిలేదు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Village Secretariat Ward Secretariat on examination management arrangements and examination Time Table"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0