Be Alert: Details of those who will change from September 1st
అలర్ట్‌గా ఉన్నారా: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇవి మారిపోయాయ్!
సాధారణంగా బడ్జెట్‌లోని మార్పులు చేర్పులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. కానీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 2019-20 పూర్తిస్థాయి బడ్జెట్‌ను జూలై నెలలో ప్రవేశపెట్టారు. దీంతో పలు మార్పులు చేర్పులు సెప్టెంబర్ 1, 2019నుంచి అమలులోకి వస్తున్నాయి.
ట్రాఫిక్ రూల్స్, ఐఆర్‌సీటీసీ సర్వీస్ ఛార్జ్ నుంచి ట్యాక్స్ వరకు పలు మార్పులు 1-9-2019 నుంచి చోటు చేసుకోనున్నాయి...మీ ఇన్‌కం ట్యాక్స్ మారనుందా? పన్ను కట్టే వారికి భారీ ఊరట?

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే తలనొప్పి
- ఆగస్ట్ 31వ తేదీలోపు మీరు ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా...
- అయితే ఫరవాలేదు. పైల్ చేయకుంటే మాత్రం రూ.5,000 నుంచి రూ.10,000 వరకు జరిమానాతో పైల్ చేయవలసి ఉంటుంది.
- అంతేకాదు రీఫండ్ పైన ఇంట్రెస్ట్ పొందలేరు... మీ నష్టాన్ని క్యారీఫార్వార్డ్ చేసుకోలేరు.
- ముఖ్యంగా బడ్జెట్‌లో ఐటీ సంబంధ మార్పులు, ఇతర మార్పులు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రావడం పెద్ద తలనొప్పిగా మారుతుంది.
TDSలో ఇవి అదనం
- ఇక నుంచి మీరు ఇంటిని కొనుగోలు చేస్తే అదనపు సౌకర్యాలకు సంబంధించిన అంశాలు పొందుపర్చాలి.
- క్లబ్ మెంబర్‌షిప్ ఫీజు, కారు పార్కింగ్ ఫీజు, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీ ఫీజు వంటి వివిధ సదుపాయాల కోసం చేసిన చెల్లింపును చేర్చవలసి ఉంటుంది.
- దీంతో ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు టీడీఎస్ మొత్తం పెరుగుతుంది.
- గతంలో ఆస్తి కొనుగోలుపై మాత్రమే పన్ను డిడక్షన్ ఉంది.
- ఇతర క్లబ్ సభ్యత్వం వంటి సదుపాయాలకు టీడీఎస్ నుంచి మినహాయించారు
- ఆదాయపన్ను చట్టంలో స్థిర ఆస్తి పరిశీలన సరిగ్గా నిర్వచించబడలేదని, ఆస్తి విలువ రూ.50 లక్షలకు మించితే టీడీఎస్ ఒక శాతం తగ్గిస్తారని చెబుతున్నారు.
- వెడ్డింగ్ ఫంక్షన్స్ వంటి కాంట్రాక్ట్స్ లేదా ప్రొఫెషనల్ పేమెంట్స్ రూ.50 లక్షలు దాటితే 5 శాతం టీడీఎస్ డిడక్ట్ అవుతుంది
రూ.1 కోటికి పైగా విత్ డ్రా చేస్తే 2 శాతం టీడీఎస్
- ఇక నుంచి రూ.1 కోటికి పైగా మొత్తాన్ని బ్యాంకు నుంచి విత్ డ్రా చేస్తే 2 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. బ్యాంకు, కో-ఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీస్ నుంచి తీస్తే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి టీడీఎస్ వర్తిస్తుంది.
- డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను ప్రోత్సహిస్తూ, క్యాష్ ట్రాన్సాక్షన్స్‌ను తగ్గించేందుకు దీనిని అమలు చేస్తున్నారు.
- ఇందుకోసం కొత్త సెక్షన్ 194N ను పొందుపర్చారు.
0 Response to "Be Alert: Details of those who will change from September 1st"
Post a Comment