Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If you have a phone in your hand, these apps are nothing to worry about. Save the relevant documents on the phone in online format and show the need to avoid the huge penalties ..

If you have a phone in your hand, these apps are nothing to worry about. Save the relevant documents on the phone in online format and show the need to avoid the huge penalties ..

పత్రాలు వెంట లేవా..? ఫోన్‌ ఉందిగా..!
గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా నూతన మోటార్‌ చట్టం గురించి ఒకటే చర్చ. ఆ నగరంలో ఆటో డ్రైవర్‌కు అంత ఫైన్‌ వేశారు.. ఈ నగరంలో లారీ డ్రైవర్‌ నుంచి ఇంత ఫైన్‌ ముక్కు పిండి వసూలు చేశారని!
If you have a phone in your hand, these apps are nothing to worry about. Save the relevant documents on the phone in online format and show the need to avoid the huge penalties ..
 దీంతో వాహనదారుల్లో గుబులు మొదలైంది. ఈ జరిమానాల గోల ఎందుకులే గానీ అన్ని పత్రాలు సమకూర్చుకుంటే పోలే అనే నిర్ణయానికి వచ్చేశారు వాహనదారులు. దీంతో డ్రైవింగ్‌ లైసెన్స్‌ మొదలుకుని.. బీమా వరకు అన్ని రకాల పత్రాలను లేని వారు సమకూర్చుకుంటున్నారు.. ఉన్నవారు తమ వద్ద ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి అన్ని పత్రాలు ఉన్నా.. పొరపాటునో.. ఏమరపాటునో మర్చిపోతే? అయ్యో సర్వీసింగ్‌కు వెళ్లి అక్కడ మర్చిపోయాను అని నిట్టూర్చాల్సి వస్తే? అయినా ఏం పర్లేదు! మీ చేతిలో ఫోన్‌ ఉండి ఈ యాప్స్‌ ఉంటే మీరు ఏమాత్రం భయపడనక్కర్లేదు. సంబంధిత పత్రాలను ఆన్‌లైన్‌ ఫార్మాట్‌లో ఫోన్‌లో భద్రపరుచుకుని అవసరం వచ్చినప్పుడు చూపిస్తే భారీ జరిమానాల నుంచి తప్పించుకోవచ్చిలా..

డిజిటల్‌ ఇండియాలో భాగంగా ప్రజలు తమ ముఖ్యమైన పత్రాలను ఆన్‌లైన్‌లో భద్రపరుచుకునేందుకు వీలుగా గతేడాది కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్‌ను యాప్‌ను తీసుకొచ్చింది. ఇందులో మన వాహనం తాలూక రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇతర పత్రాలను భద్రపరుచుకోవచ్చు. ఇందుకోసం గూగుల్‌ ప్లేస్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌లో ఈ యాప్‌ను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మొబైల్‌ నంబర్‌, ఓటీపీతో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. ఇందులోని అప్‌లోడ్‌ సెక్షన్‌ను ఉపయోగించి సంబంధిత పత్రాలను అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. మీ ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే మీకు ప్రభుత్వం నుంచి జారీ అయిన పత్రాలన్నీ ఆటోమేటిక్‌గా అందులో కనిపిస్తాయి.

వాహనదారులనుద్దేశించి ఎం పరిహవాహన్‌ యాప్‌ను కేంద్రం తీసుకొచ్చింది. ఇందులో వాహనానానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ వివరాలతో పాటు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వివరాలను పొందుపరుచుకోవచ్చు. ఇందుకోసం గూగుల్‌ ప్లేస్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ నుంచి ఎం పరిహవాహన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాంటాక్ట్‌ నంబర్‌తో యాప్‌లో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. గూగుల్‌ ప్లేస్టోర్‌లో లేదా యాప్‌ స్టోర్‌కి వెళ్లి ఆర్టీఏ-ఎంవ్యాలెట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందులో మీ వాహన నంబరు నమోదు చేస్తే... ఆర్సీ, లైసెన్సులకు సంబంధించి స్మార్ట్‌ కార్డులు ప్రత్యక్షమవుతాయి. వీటిని పోలీసులకు చూపించి ఎలాంటి ఇబ్బందీ లేకుండా బయట పడవచ్చు.
చెల్లుబాటు మాటేంటి?
నూతనంగా అమల్లోకి వచ్చిన వాహన చట్టం ప్రకారం.. డిజిలాకర్‌, ఎంపరివాహన్‌ యాప్‌ల్లో నిక్షిప్తం చేసిన ధ్రువపత్రాలను చూపిస్తే వాహనదారులకు ఎలాంటి జరిమానాలు విధించబోరని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. అయితే డిజిటల్ ఫార్మాట్‌లో అన్నంత మాత్రన ఫోన్‌లో ఫొటో తీసి పెట్టుకుంటే చెల్లుబాటు కాదని రవాణా శాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. కేవలం డిజిలాకర్‌ లేదా ఎంపరివాహన్‌ యాప్‌లను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. ఆర్‌టీఏ ఎంవ్యాలెట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినది కాబట్టి తెలంగాణలో ఇది చెల్లుబాటు అవుతుంది. 1989 కేంద్ర మోటార్‌ వాహనాల చట్టంలోని సవరించిన ప్రొవిజన్ల కింద వీటిని అమనుతిస్తున్నారు.
డిజి లాకర్ ను డౌన్లోడ్ చేసుకొనే లింక్ క్రింద ఇవ్వబడింది.

  DOWNLOAD DIgI LOCKER APP

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If you have a phone in your hand, these apps are nothing to worry about. Save the relevant documents on the phone in online format and show the need to avoid the huge penalties .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0