Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do you know what is the meaning Do stickers on fruits.

Do you know what is the meaning Do stickers on fruits.
పండ్లపై ఉండె స్టిక్కర్లకు అర్థం తెలుసా?
Do you know what is the meaning Do stickers on fruits.

పండ్లపై ఉండె స్టిక్కర్లను బట్టి నాణ్యతను గుర్తించొచ్చు. మనం పలు రకాల పండ్లపై స్టిక్కర్లు అతికించి ఉండటం తరచూ చూస్తుంటాం. అసలు ఆ స్టిక్కర్లు ఎందుకు అతికిస్తారో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. పండ్ల వ్యాపారులకు సైతం స్టిక్కర్ల విషయం ఎక్కువగా తెలిసి ఉండదు. స్టిక్కర్లపై నంబరు కథా కమామీషుపై ఆంధ్రజ్యోతి అందిస్తున్న కథనం.

యాపిల్‌, దానిమ్మ, బత్తాయి పండ్లను తినడంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో మనందరికీ తెలుసు. పండ్లను తినడంతో శరీరానికి కీలకమైన పోషకాలు లభించడమే కాకుండా అనారోగ్యం బారిన పడకుండా మనలను రక్షించుకోవచ్చు. పండ్లను తినడం వరకు బాగానే ఉన్నా… వాటిని కొనుగోలు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని ఎలా పండించారో మనకు తెలిసి ఉండాలి. లేకుంటే కృత్రిమ రసాయనాలు వాడి పండించిన పండ్లను తింటే పోషకాల మాట దేవుడెరుగు… మన ఆరోగ్యానికి మొదటికే మోసం వస్తుంది.

పండ్లను కొనుగోలు చేసేటప్పుడు వాటిని సహజసిద్ధంగా పండించారా? లేదా రసాయనాలు వాడారా? అనే విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి. ఆ విషయాలు దుకాణదారులు మనకు చెప్పరు. అలాంటప్పుడు పండ్లను ఎలా పండించారు? నాణ్యతా ప్రమాణాలు తెలుసుకునే మార్గం ఉంది. మీరు పండ్లను కొనుగోలు చేసినప్పుడు వాటిపై పలు సంఖ్యలతో కూడిన స్టిక్కర్లు అతికించి ఉంటాయి. వీటిని మీరు చూసే ఉంటారు. మీకు స్టిక్కర్లు ఎందుకున్నాయనేది తెలిసి ఉండదు. ఈ స్టిక్కర్లపై ఉన్న సంఖ్యలతో పండ్లను సహజసిద్ధంగా పండించారా? లేదా రసాయనాలు వాడి పండించారా? అనే సమాచారం స్టిక్కర్లపై సంఖ్యలు తెలియజేస్తాయి.

3 లేదా 4 అంకె లతో ప్రారంభం అయి ఉంటే..

పండ్లపై వేసే స్టిక్కర్ల మీద నాలుగు అంకెల నెంబర్‌ ఉండి ఆ నెంబర్‌ మూడు లేదా నాలుగుతో ప్రారంభమైతే అప్పుడు ఆ పండ్లను కృత్రిమ రసాయనాలు, సహజసిద్ధమైన ఎరువులు వాడి పండించారని తెలుసుకోవాలి.

9 అంకెల నెంబర్‌ తోప్రారంభం అయి ఉంటే..

పండ్లపై వేసే స్టిక్కర్‌ మీద ఐదు అంకెల నెంబర్‌ ఉండి, అది 9తో ప్రారంభమైతే అప్పుడు ఆ పండ్లను పూర్తిగా సేంద్రియ ఎరువులను ఉపయోగించి అత్యంత సహజ సిద్ధంగా పండించారని అర్థం చేసుకోవాలి. ఈ పండ్లు మన శరీరానికి ఎలాంటి హాని కలిగించవు. పూర్తిగా సురక్షితమైనవిగా మనం తెలుసుకోవాలి.

8 అంకెల నెంబర్‌తో ప్రారంభం అయి ఉంటే..

పండ్లపై వేసే స్టిక్కర్‌ మీద ఐదు అంకెల నెంబర్‌ ఉండి, అది 8తో ప్రారంభమైతే అప్పుడు ఆ పండ్లను జన్యువుల మార్పిడితో పండించారని తెలుసుకోవాలి. ఇలాంటి పండ్లను అస్సలు తిన కూడదు. ఇవి చాలా ప్రమాదకరం. అనారోగ్యం కలిగిస్తాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do you know what is the meaning Do stickers on fruits."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0