Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

EPFO launch e-nomination facility

ఇ. పి.ఆఫ్ ఖాతాదారులకు కొత్త సౌకర్యం !
EPFO  launch e-nomination facility
  • ఇ-నామినేషన్ సౌకర్యాన్ని ఆవిష్కరించిన ఈపీఎఫ్‌వో
  • ఈ ఫెసిలిటీ కేవలం అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు
  • ఈపీఎఫ్‌వో అకౌంట్‌‌తో ఆధార్ లింక్ చేసుకున్న వారికే ఈ సౌకర్యం

    ఇ- నామినేషన్ సౌకర్యాన్ని ఆవిష్కరించిన ఈపియఫ్ వో

     మీరు ఈపీఎఫ్వో సబ్ స్క్రిబరా? అయితే మీకు శుభవార్త . ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్( ఈపీఎఫ్వో ) చందాదారుల కోసం ఇ - నామినేషన్ సౌకర్యాన్ని  అందుబాటులోకి తీసుకువచ్చింది . సెప్టెంబర్ 12 నాటి సర్కులర్లో ఈపీఎఫ్వో ఈ విషయాన్ని వెల్లడించింది . అయితే ఇ - నామినేషన్ సౌకర్యం కేవలం కొంద మందికి మాత్రమే అందుబాటులో ఉంటుంది . ఈపీఎఫ్వో ఆకౌంటకు ఆధార్ లింక్ చేసుకున్న వారు , వెరిఫైడ్ సబ్ స్కైబర్లకు మాత్రమే ఈ ఫెసిలిటీ వర్తిస్తుంది . | ఈపీఎఫవో సభ్యులు ఈపీఎఫ్వో మెంబర్ సేవా పోర్టలకు వెళ్లి ఈ సౌకర్యాన్ని పొందొచ్చు . ' ఈపీఎఫ్వో సభ్యులకు ఇ - నామినేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం . మెంబర్ పోర్టల్ ఈ ఫెసిలిటీని పొందొచ్చు . ఆధార్తో లింక్ చేసుకున్న వారు , వెరిఫైడ్ చందాదారులు ఆన్లైన్లోనే నామినేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు ' అని ఈపీఎఫ్వో సర్కులర్లో ఉంది . - ఇకపోతే ఆన్లైన్ పెన్షన్ క్లెయిమ్స్ అనేవి ఇ - నామినేషన్ అంశంపై ఆధారపడి ఉంటాయి . అలాగే ఇ - నామినేషన్ ఫెసిలిటీని  ఉపయోగించుకోవాలంటే యాక్టివ్ యూఏఎన్  నెంబర్ తప్పనిసరి .

    ఈపీఎఫ్వో నామినేషన్ రూల్స్ 

    ఈపీఎఫ్వో సబ్స్క్రైబర్ కుటుంబ సభ్యులను మాత్రమే నామినీగా చేర్చుకోవాలి . ఒకవేళ కుటుంబం లేకపోతే అప్పుడు ఎవరినైనా నామినీగా చేర్చుకోవచ్చు . • ఒకవేళ కుటుంబ సభ్యులు ఉన్నా కూడా ఇతరులను నామినీగా చేర్చుకుంటే ఆ నామినేషన్ చెల్లదు .• నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయని చందాదారుల పోర్టల్లో లాగిన్ అయితే వారికి ఈ విషయం ఒక పాపప్ మెసేజ్ ద్వారా డిస్ప్లే అవుతుంది . ఇ - నామినేషన్ ఫైల్ చేయమని కోరుతుంది .

    SUBSCRIBE TO OUR NEWSLETTER

    Seorang Blogger pemula yang sedang belajar

    0 Response to "EPFO launch e-nomination facility"

    Post a Comment

    google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0