Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NASA intensifies efforts to restore sigils with Vikram

‘విక్రమ్‌’తో సిగల్స్ పునరుద్ధరణకు రంగంలోకి నాసా.. తీవ్ర ప్రయత్నాలు!
NASA intensifies efforts to restore sigils with Vikram

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 తుది మెట్టుపై ఆగిపోగా, చంద్రుడి ఉపరితలంపై దిగుతూ ల్యాండర్ విక్రమ్‌కు భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి.
చంద్రుడి ఉపరితలంపైకి దిగుతూ 2.1 కిలోమీటర్ల దూరంలో సంకేతాలు నిలిచిపోయిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో సంకేతాలను పునరుద్ధరించేందుకు ఓవైపు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై నిర్దేశిత ప్రదేశంలోనే విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ కాగా, ల్యాండర్ పక్కకు వంగినట్టు గుర్తించారు. తాజాగా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సైతం విక్రమ్‌తో సంబంధాలు పునరుద్దరణకు ప్రయత్నిస్తోంది. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలోని డీప్ స్పేస్ నెట్‌వర్క్ గ్రౌండ్ స్టేషన్ల నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా విక్రమ్‌తో సంకేతాలు పునరుద్ధరించే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఇస్రో అంగీకారంతోనే డీప్ స్పేస్ నెట్‌వర్క్ (డీఎస్ఎన్) ద్వారా తన వంతు ప్రయత్నం చేస్తోందని తెలిపింది. విక్రమ్‌తో కమ్యూనికేషన్ పునరుద్ధరించాలనే ఇస్రో ఆశలు సజీవంగా ఉన్నా, రోజులు గడిచేకొద్దీ అవకాశాలు తగ్గిపోతున్నాయి. చంద్రుడిపై ఒక్క రోజు (అంటే మనకు 14 రోజులు) మనుగడ సాగించేలా దీనిని రూపొందించారు. ఇప్పటికే ఐదు రోజులు గడిచిపోవడంతో పరిస్థితి కొంత సంక్లిష్టంగా మారింది. చంద్రుడి ఉపరితలంపై సూర్యకిరణాల సాయంతో విద్యుత్‌ను తయారుచేసుకునేలా సోలార్ ప్యానల్స్ ఏర్పాటుచేయగా, ఇవి సెప్టెంబరు 20 నుంచి 21 వరకు మాత్రమే పనిచేస్తాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NASA intensifies efforts to restore sigils with Vikram"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0