Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

No political interference in PMC election

No political interference in PMC election
పీఎంసీ ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు.

 ప్రభుత్వ , జడ్పి మున్సిపల్ , ఎయిడెడ్ పాఠశాలల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న పేరెంట్స్ మోనటరింగ్ కమిటీ ( పీఎంసీ ) లకు నిర్వహించే ఎన్నికల్లో రాజకీయ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవాలని , ఆ మేరకు ఎన్నికల ప్రక్రియలో రాజకీయ జోక్యం జరిగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి చినవీరభద్రుడు హెచ్చ రించారు . స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ ( ఎస్ఎంసీ ) ల స్తానే పేరు మార్పుతో కొత్తగా ఈ నెల 23న పీఎంసీలకు నిర్వహిం చనున్న ఎన్నికలపై సోమవారం ఎస్ఎస్ఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు . ఎస్డీడీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచ నలు చేశారు . ప్రతి తరగతికి ముగ్గురు తల్లిదండ్రులతో కూడిన సభ్యులు పీఎంసీలో ఉండాల్సిందేనని అన్నారు . ఈ నెల 19వ తేదీ వరకు ఎన్నికల నోటిఫికేషన్ , ఓటర్ల జాబితాను స్కూల్ నోటీసు బోర్డులోను , పంచాయతీ గోడపైన , బహిరంగ ప్రదేశా ల్లోను ప్రదర్శనకు పెట్టాలని ఆదేశించారు .
No political interference in PMC election

ఎన్నికల పరిశీలకు లుగా తహసీల్దార్ , ఎంపీడీవో , వీఏవో , వీఆర్వోలు వ్యవహరిస్తారని , వీరి నియామకాలకు సంబంధించి కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని కోరారు . అలాగే ఎన్ని కలను పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ సహకారాన్ని తీసుకోవాలని సూచించారు . విద్యార్థి తల్లి / తండ్రి / సంరక్షకులలో ఎవరైనా ఒకరికి ఓటుహక్కు ఉంటుం దని , ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీరు రేషన్ కార్డు / ఆధార్ కార్డు / డ్రైవింగ్ లైసెన్సు / ఓటరు ఐడి / ప్రభు త్వం జారీచేసిన ఏదైనా గుర్తింపు కార్డులలో ఒకటి చూపించాల్సి ఉంటుందన్నారు . పేరెంట్ కాని వారు ఎక్కడైనా పీఎంసీ కి ఎన్నికైతే సంబంధిత స్కూలు ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తప్పవన్నారు . పీఎంసీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా స్కూలు హెచ్ఎం , టీచర్ , ఏఎన్ఎం , డ్వాక్రా సంఘ మండల అధ్యక్షురాలు , అంగన్ వాడీ వర్కర్ , వార్డు మెంబరు ఉంటారని వివరించారు . పీఎంసీ ఎన్నికలను హైస్కూళ్ళకు కూడా నిర్వహించాలని ఆదేశించారు . వీడియో కాన్ఫరెన్సులో ఎస్ఎస్ఏ పీవో ఎం . కాత్యాయని ప్రసన్న తదితరులు పాల్గొన్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "No political interference in PMC election"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0