No SMS alerts from SBI? To your mobile in any transaction. Do this process
No SMS alerts from SBI? To your mobile in any transaction. Do this process
SBI SMS Alerts: ఎస్‌బీఐ నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్స్ రావట్లేదా? ఇలా చేయండి
SBI SMS Alerts: ఎస్‌బీఐ నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్స్ రావట్లేదా? ఇలా చేయండి
- ఇటీవల కాలంలో ఆర్థిక మోసాలు ఎక్కువైపోయాయి. కార్డు మోసాలు పెరిగిపోతున్నాయి. ఏటీఎం కార్డు మీ జేబులో ఉన్నా ఎక్కడో లావాదేవీలు జరిగిపోతుంటాయి.
- తర్వాత ఎప్పుడో స్టేట్‌మెంట్ చూస్తే తప్ప అసలు విషయం బయటపడదు.
- ఇలాంటి మోసాలను వెంటనే గుర్తించడానికి ఉపయోగపడేది ఎస్ఎంఎస్ అలర్ట్.
- మీ అకౌంట్‌పై జరిగే ప్రతీ లావాదేవీకి ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపిస్తుంటాయి బ్యాంకులు. చాలామంది వీటి గురించి పెద్దగా పట్టించుకోరు. ఫోన్ నెంబర్ మార్చినప్పుడు బ్యాంకులో అప్‌డేట్ చేయరు. దీంతో ఎస్ఎంఎస్ అలర్ట్స్ అందుకోలేరు.
- మీ అకౌంట్‌లో జరిగే లావాదేవీల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కు రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి.
- బ్యాంకులో మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేస్తే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కి ఓటీపీలు పొందడం కూడా సులువే.
- ... ఏదైనా అనధికార లావాదేవీలు జరిగితే వెంటనే మెసేజ్ వస్తుంది కాబట్టి అప్రమత్తం కావచ్చు.
- మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి.
- ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి
- హోమ్ పేజీలో SMS Alerts లింక్ పైన క్లిక్ చేయండి.
- మీ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ల జాబితా కనిపిస్తుంది.
- మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ లావాదేవీలపై అలర్ట్స్ వస్తాయి.
- ఆన్‌లైన్‌లో కాకుండా మీరు బ్రాంచ్‌కు వెళ్లి కూడా ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి రిజిస్టర్ చేసుకోవచ్చు.
- మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి రిజిస్టర్ చేసుకోవడం మాత్రమే కాదు... మీరు పొందాల్సిన అలర్ట్స్‌ని మార్చుకోవచ్చు. అప్‌డేట్ చేయొచ్చు. మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి రిజిస్టర్ చేసుకుంటే ఈ కింది అంశాలకు అలర్ట్స్ పొందొచ్చు.
- Hold on account balance: అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ని హోల్డ్ చేయొచ్చు.
- Pos Transaction: పీఓఎస్ ట్రాన్సాక్షన్ అలర్ట్ అంటే ఎక్కడైనా పాయింట్ ఆఫ్ సేల్స్‌లో మీ డెబిట్ కార్డును స్వైప్ చేస్తే అలర్ట్ వస్తుంది.
- Cheque Stop alert: మీరు ఎవరికైనా ఇచ్చిన చెక్‌ను నిలిపివేయొచ్చు.
- Cheque dishonor alert: ఇన్‌వార్డ్ లేదా ఔట్‌వార్డ్ క్లియరింగ్ నిలిపివేయొచ్చు.
- Cheque book: కొత్త చెక్ బుక్ కోసం దరఖాస్తు చేస్తే అలర్ట్ పొందొచ్చు.
0 Response to "No SMS alerts from SBI? To your mobile in any transaction. Do this process"
Post a Comment