RTC information is in our hand if we have a android phone
అరచేతిలో ఆర్టీసీ సమాచారం
- మీరు ఎక్కడికైనా ఊరికి వెళ్లాలనుకుంటున్నారా..?
- అలాగే మీరు వెళ్లే ఊరికి బస్సులు ఎప్పుడెప్పుడు వస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా?
- అలాగే ఆ బస్సు ఎక్కడుందో తెలుసుకోవాలా..
- బస్సులో ఆకతాయిల వేధింపులా...?
- సమస్య ఏదైనా.. సమాచారం తెలుసుకోవాలన్నా చాలా సులువు.
- అదేంటో తెలుసుకుందామా..?
- సమస్యలపై అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా..?
- మీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు
- ఆర్టీసీ సేవలన్నీ పొందే వెసులుబాటు ఉంది.
- ఆర్టీసీ లైవ్‌ట్రాక్ యాప్ ద్వారా ఆర్టీసీ సేవలు సులువుగా తెలుసుకోవచ్చు.
ఆర్టీసీ లైవ్ ట్రాక్ యాప్
- ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రయాణం కొనసాగించడానికి ఏపీఎస్ ఆర్టీసీ సాంకేతికతను వినియోగిస్తోంది.
- ఆర్టీసీ లైవ్ ట్రాక్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే అన్ని సేవలు పొందే వీలు ఉంటుంది.
- దూర ప్రాంతాలకు టిక్కెట్ రిజర్వేషన్ చేసుకోవడానికి ఆర్టీసీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు.
- దీంతో బస్ స్టాండ్లలో బారులు తీరాల్సిన బాధ తప్పుతుంది.
ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి....?
- గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఏపీఎస్ ఆర్టీసీ లైవ్ ట్రాక్ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు.
- ఈ యాప్ దగ్గరలోని బస్టాండు ఎక్కడ ఉందో జీపీఎస్ ద్వారా తెలియజేస్తుంది. ప్రారంభ, గమ్య స్థానాలను యాప్‌లో నమోదు చేయగానే రెండు ప్రదేశాల మధ్య ఎన్ని బస్సులు ఉన్నాయో?
- ఏ సమయానికి ఉన్నాయో?
- డ్రైవర్, కండక్టర్ వివరాలు అందులో కనిపిస్తాయి.
- రిజర్వేషన్ చేసుకున్న తర్వాత సర్వీసు నంబరు ఆధారంగా బస్సు ఎక్కడుందో యాప్ ద్వారా తెలిసిపోతుంది.
- మనకు కావాల్సిన బస్సు నంబరు యాప్‌లో నమోదు చేయగానే అది ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుస్తుంది.
నిరీక్షణకు తెర
- గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు ఏ సమయానికి వస్తాయో తెలియని పరిస్థితి.
- అయితే కొన్ని సమయాల్లో ముందు సమాచారం చెప్పకుండానే రద్దు చేస్తుంటారు.
- ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే బస్సు ఎక్కడుంది? ఏ సమయానికి వస్తుంది.? తెలిసిపోతుంది.
- దీనివల్ల ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించేవారి సంఖ్య కూడా తగ్గుతుంది.
- ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు–వెలుగు బస్సుల్లో ఆక్యుపెన్సీ శాతం పెరిగిందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.
- గ్రామీణ ప్రాంతాల వారే ఈ యాప్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.
- ప్రతి బస్సులో జీపీఎస్ ‘ట్రాకింగ్’ పరికరాన్ని అమర్చారు. దీంతో బస్సును ట్రాకింగ్ చేయడం సాధ్యపడుతోంది.
- గత ఏడాది అధికారులు ప్రయాణికులకు విస్తతంగా అవగాహన కల్పించారు.
- ప్రయాణికులు దీన్ని వినియోగించుకుంటే భద్రత, సుఖవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందనడంలో సందేహం లేదు.
మహిళలకు భద్రత
- ఈ యాప్ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలామంది బస్సు ఏ సమయానికి ఉందో తెలియక రోడ్డుపై నిరీక్షిస్తుంటారు.
- ఆ సమయంలో మహిళలు, ఆకతాయిల వేధింపులు, చైన్ స్నాచర్స్ నుంచి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
- అయితే ఈ యాప్ ద్వారా బస్సు వచ్చే సమయానికి అక్కడికి చేరుకోవచ్చు.
- ఒకవేళ బస్సులో ఇబ్బందులు ఎదురైతే ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
- లైవ్ ట్రాక్ ద్వారా పోలీసులు బస్సున్న చోటికి నిమిషాల్లో చేరుకుంటారు.
0 Response to "RTC information is in our hand if we have a android phone"
Post a Comment