Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What is a repo rate linked home loan?

SBI శుభవార్త.. ఇక వారికి కూడా ఆ తగ్గింపు ప్రయోజనం!
స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు మరో అదిరిపోయే శుభవార్త అందించనుంది. రెపో అనుసంధాన హోమ్ లోన్స్ బెనిఫిట్స్‌ను పాత కస్టమర్లకు కూడా అందించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని బ్యాంక్ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు.
What is a repo rate linked home loan?

ప్రధానాంశాలు:

  • ప్రస్తుత కస్టమర్లకు కూడా రెపో హోమ్ లోన్ బెనిఫిట్స్
  • ఈ దిశగా అడుగులు వెస్తున్న స్టేట్ బ్యాంక్
  • ఇప్పుడు కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే రెపో అనుసంధాన హోమ్ లోన్స్ అందుబాటులో
  • దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు తీపికబురు అందించేందుకు సిద్ధమౌతోంది. 
  • ఎస్‌బీఐ రెపో అనుసంధాన హోమ్ లోన్స్‌ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చింది.
  •  అయితే ఈ సేవలు కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

  • రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్ అంటే ఏంటీ?
    • సాధారణంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్ లెండింగ్ రేట్(MCLR) ఆధారంగా రుణాలపై వడ్డీ రేట్లు నిర్ణయిస్తుంటాయి బ్యాంకులు. ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించినా ఆ లాభం కస్టమర్లకు చేరదు. అదే వడ్డీ రేట్లను రెపో రేట్‌కు లింక్ చేస్తే కస్టమర్లకు మేలు కలుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అదే నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు జూలై 1 నుంచి రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్ ఆఫర్ చేయాలని నిర్ణయించింది. ఉదాహరణకు ప్రస్తుతం రెపో రేట్ 5.75 శాతం కాబట్టి దానికి మరో 2.65 శాతం కలిపి హోమ్ లోన్ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే హోమ్ లోన్ వడ్డీ రేటు 8.40 శాతంగా ఉంటుంది. ఇకపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ తగ్గించినప్పుడల్లా ఆ లాభం కస్టమర్లకు చేరుతుంది.
    • అయితే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ రెపో హోమ్‌ లోన్స్‌ ప్రయోజనాలను ప్రస్తుత కస్టమర్లకు కూడా అందించేందుకు అందుబాటులోకి మార్గాలను అన్వేషిస్తోంది. 2014లో ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్స్) రుణ రేట్లు అమలులోకి వచ్చాయి. అప్పుడు బ్యాంకులు కొత్త వారితోపాటు పాత కస్టమర్లకు కూడా ఎంసీఎల్ఆర్ ఆప్షన్ ఇచ్చాయి.
    • రెపో అనుసంధాన రుణ ప్రయోజనాలకు పాత కస్టమర్లకు కూడా అందిస్తారా? అనే ప్రశ్నకు ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ సమాధానమిస్తూ.. మేము ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.
    • ఎస్‌బీఐ రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) రెపో రేటుకు 2.25 శాతం ఎక్కువగా ఉంది. ప్రస్తుత రెపో రేటు 5.4 శాతం. అంటే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆర్ఎల్ఎల్ఆర్ 7.65 శాతంగా ఉంది. ఎస్‌బీఐ రెపో అనుసంధాన హోమ్ లోన్స్ రేటు ఆర్ఎల్ఎల్ఆర్ కన్నా 40 బేసిస్ పాయింట్లు, 55 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంది. అందువల్ల స్టేట్ బ్యాంక్‌లో కొత్తగా హోమ్ లోన్ తీసుకోవాలని భావించేవారికి 8.05 శాతం లేదా 8.2 శాతం వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది.
    • అదేసమయంలో ఎంసీఎల్ఆర్‌తో అనుసంధానమైన ఎస్‌బీఐ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.35-8.9 శాతం శ్రేణిలో ఉంది. రూ.75 లక్షల లోపు రుణాలకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. కాగా ఎస్‌బీఐ ఫిబ్రవరి నుంచి ఎంసీఎల్ఆర్ రేటును 30 బేసిస్ పాయింట్లమేర తగ్గించింది. అదేసమయంలో ఆర్‌బీఐ రెపో రేటులో 1.1 శాతం కోత విధించింది.

    SUBSCRIBE TO OUR NEWSLETTER

    Seorang Blogger pemula yang sedang belajar

    0 Response to "What is a repo rate linked home loan?"

    Post a Comment

    google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0