The full details of the millionaire with the sale of samosa
సమోసాలు అమ్ముతూనే రూ.లక్షలు వెనకేశాడు!
సమోసాలు, కచోరీలు విక్రయించి రూ.లక్షలకు లక్షలు సంపాదించాడు. 12 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది రాలేదు. అయితే ఇప్పుడు సడన్‌గా పన్ను నోటీసులు వచ్చాయి. దీంతో ఈయన గురించి అందరికీ తెలిసిపోయింది.
సమోసాలు, కచోరీలు విక్రయించి రూ.లక్షలకు లక్షలు సంపాదించాడు. 12 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది రాలేదు. అయితే ఇప్పుడు సడన్‌గా పన్ను నోటీసులు వచ్చాయి. దీంతో ఈయన గురించి అందరికీ తెలిసిపోయింది.
ప్రధానాంశాలు:
- ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చోటుచేసుకున్న ఘటన
- పన్ను నోటీసులు జారీ చేసిన అధికారులు
- వార్షిక ఆదాయం రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉండొచ్చని అంచనా
- జీఎస్‌టీ, ట్యాక్స్ వంటివి తనకు తెలియవని వివరణ ఇచ్చిన షాపు యాజమాని
- డబ్బు సంపాదనకు ఏదీ అడ్డు కాదు.
- పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి.. కంపెనీలు నడపాలి..
- ఇలాంటివేమీ అవసరం లేదు.
- రోడ్డుపక్కన సమోసాలు అమ్మి కూడా లక్షాధికారి కావొచ్చు.
- కోటీశ్వరుడివి కూడా అయ్యే అవకాశముంది
ఎలా అనుకుంటున్నారా? ఈయనను ఆదర్శంగా తీసుకోవాలి.
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన కచోరీలు, సమోసాలు విక్రయించే ముకేశ్ అనే వ్యక్తి ఏకంగా రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. ఆదాయపు పన్ను వారు ఈయనకు నోటీసు పంపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సీమా సినిమా హాల్ పక్కనే ఈ కచోరీ షాప్ ఉంది. దీని పేరు ముకేశ్ కచోరి షాప్. అక్కడ చాలా పాపులర్. ఉదయం నుంచి రోజంతా ఇక్కడ సమోసాలు, కచోరీలు విక్రయిస్తారు.
ముకేశ్ కచోరీ షాప్ ఎందుకంతా పాపులరో
- తెలుసుకునేందుకు ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ టీమ్ ఆ షాప్ పక్కన ఉంచి గమనించారు.
- అమ్మకాలను నిశితంగా గమనించారు.
- దీంతో ముకేశ్ వార్షికంగా రూ.60 లక్షలు నుంచి రూ.1 కోటీ మధ్యలో సంపాదిస్తున్నారని అంచనాకు వచ్చారు.
- అధికారులు ఈ నేపథ్యంలోనే ముకేశ్‌కు నోటీసులు జారీ చేశారు.
- ఈయన తన షాప్‌ను జీఎస్‌టీ కింద రిజిస్టర్ చేయించలేదు.
- అలాగే ఎలాంటి పన్నులు కట్టలేదు.
- ‘నాకు ఈ విషయాల గురించి తెలియదు.
- నేను నా షాపును గత 12 ఏళ్లుగా నడుపుతున్నాను. ఎవ్వరూ ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రక్రియ ఉంటుందని చెప్పలేదు.
- జీవించేందుకు సమోసాలు, కచోరీలు విక్రయించే కుటుంబం మాది’ అని ముకేశ్ వివరణ ఇచ్చారు.
- స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ)కు చెందిన ఒక అధికారి ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ‘ముకేశ్ తనకు ఎంత ఆదాయం వస్తుందో తెలిపారు.
- అలాగే తన ఖర్చులకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందించారు’ అని ఈయన తెలిపారు.
- వార్షిక ఆదాయం రూ.40 లక్షలు, ఆపైన ఉన్నవారు కచ్చితంగా జీఎస్‌టీ కింద రిజిస్టర్ చేసుకోవాలి.
- తయారుచేసే ఆహార పదార్థాలపై 5 శాతం పన్ను పడుతుంది.
- ముకేశ్ తన షాపును జీఎస్‌టీ కింద రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుందని ఎస్ఐబీ అధికారి తెలిపారు.
- అలాగే ఒక ఏడాది పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
- ముకేశ్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని ఎస్‌ఐబీ డిప్యూటీ కమిషనర్ ఆర్‌పీడీ కౌంటేయ తెలిపారు.
0 Response to "The full details of the millionaire with the sale of samosa"
Post a Comment