Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Alert Alert SBI Customers

డబ్బును మన పాత రోజుల్లో లా చెట్టు తొర్రలోనో,...పెరటి తోటలోనో... పోపుల డబ్బాల్లోనో.... ఇలా ఎవరికి వారు .... ఎవ్వరికి తెలియకుండా వుండే విధం గా దాచుకోవడమే.... పొరపాటున తెలిసిందో అక్కడ దాచినందుకు కూడా చార్జీలు పడిపోతాయ్ .... జాగ్రత్త సుమా
Alert Alert SBI Customers

SBI కస్టమర్లకు అలర్ట్.. నేటి నుంచి మారుతున్న 8 అంశాలు.. బాదుడు!

ఇక బ్యాంకులో డబ్బులు తీసినా తప్పే.... వేసినా తప్పే... తగ్గినా తప్పే....

స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. బ్యాంక్ పలు అంశాలను మార్చింది. అక్టోబర్ 1 నుంచి దాదాపు 8 విషయాలు మారాయి. ఏటీఎం క్యాష్ విత్‌డ్రా నుంచి చెబ్ బుక్ వరకు చాలా నిబంధనల్లో మార్పు వచ్చింది. అవేంటో తెలుసుకోండి.

మీకు దేశీ దిగ్గజ స్టేట్ బ్యాంక్ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో అకౌంట్ ఉందా? అయితే మీకో అలర్ట్. స్టేట్ బ్యాంక్ నిబంధనలు నేటి నుంచి మారాయి. ఆరు కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవి బ్యాంక్ ఖాతాదారులపై ప్రభావం చూపనున్నాయి. దీంతో కొత్తగా మారిన అంశాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.
లోన్లు, చెక్ బుక్స్, ఏటీఎం, మినిమమ్ బ్యాలెన్స్, ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ వంటి పలు అంశాలు మారాయి. అవేంటో చూద్దాం..

SBI new ATM charges:

 ఏటీఎం రూల్స్‌లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. మెట్రో నగరాల్లో డెబిట్ కార్డు ద్వారా బ్యాంక్ ఏటీఎం ద్వారా 10 లావాదేవీలు నిర్వహించొచ్చు. ఇప్పుడు ఈ పరిమితి ఆరుగా ఉంది.

SBI cash withdrawal from branches:

 మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.25,000 కలిగి ఉంటే నెలకు రెండు సార్లు ఉచితంగానే బ్యాంక్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. రూ.25 వేల నుంచి రూ.50,000 మధ్యలో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఉంటే 10 సార్లు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు మంత్లీ బ్యాలెన్స్ కలిగి ఉంటే 15 లావాదేవీలు ఉచితంగా పొందొచ్చు. రూ.లక్షపైన అయితే ఎన్ని సర్లైనా బ్యాంక్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత లావాదేవీకి రూ.50తోపాటు జీఎస్‌టీ చెల్లించాలి

SBI Credit Card:

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకు షాక్. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ అమలులోకి వచ్చింది. దీని వల్ల క్రెడిట్ కార్డు ద్వారా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టిస్తే 0.75 శాతం డిస్కౌంట్ లభించదు. ఇది క్రెడిట్ కార్డు ఉపయోగించే వారికి నిజంగా బ్యాడ్‌న్యూస్. దాదాపు చాలా మంది క్రెడిట్ కార్డుతోనే వారి వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ కొట్టిస్తూ ఉంటారు.

SBI cash deposit:

స్టేట్ బ్యాంక్ కస్టమర్లు నెలకు మూడు సార్లు మాత్రమే బ్యాంకులో ఉచితంగా డబ్బు డిపాజిట్ చేయగలరు. ఈ పరిమితి దాటిన తర్వాత కస్టమర్లు రూ.50 చెల్లించాల్సి రావొచ్చు. రూ.100 జమ చేసినా రూ.50 చార్జీ పడుతుంది. దీనికి జీఎస్‌టీ అదనం. ఐదో డిపాజిట్ తర్వాత నుంచి బ్యాంక్ తన కస్టమర్ల నుంచి రూ.56 వసూలు చేస్తుంది.

SBI monthly average balance:

స్టేట్ బ్యాంక్ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ పరిమితిని తగ్గించింది. ఇది కస్టమర్లకు శుభవార్త. పట్టణ ప్రాంతాల్లో పరిమితిని రూ.5,000 నుంచి రూ.3,000 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే సెమీ అర్బన్ బ్రాంచుల్లో మంత్లీ బ్యాలెన్స్ పరిమితి రూ.2,000గా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.1,000 ఉండాలి. ఇక మంత్లీ బ్యాలెన్స్ కలిగి లేకపోతే రూ.10 నుంచి రూ.15 పెనాల్టీ చెల్లించాలి. దీనికి జీఎస్‌టీ అదనం.

SBI NEFT/ RTGS charges:

నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లావాదేవీలు ఆన్‌లైన్‌లో ఉచితం. అయితే బ్రాంచ్‌కు వెలితే చార్జీలు పడతాయి. రూ.10,000 వరకు నెఫ్ట్ ట్రాన్సాక్షన్లకు రూ.2తోపాటు జీఎస్‌టీ చెల్లించాలి. రూ.2 లక్షలకు పైన లావాదేవీకి బ్యాంకు రూ.20తో జీఎస్‌టీ వసూలు చేస్తోంది. రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల మధ్యలో ఆర్‌టీజీఎస్ లావాదేవీలకు రూ.20తోపాటు జీఎస్‌టీ చెల్లించాలి. రూ.5 లక్షల పైన లావాదేవీకి రూ.40తోపాటు జీఎస్‌టీ అదనం.

SBI check book charges:

 స్టేట్ బ్యాంక్ చెక్ బుక్‌ సేవలపై చార్జీలు వసూలు చేస్తుంది. సేవింగ్స్ అకౌంట్‌ ఓపెన్ చేసిన వారికి ఒక ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు 10 చెక్కులు మాత్రమే ఉచితంగా లభిస్తాయి. తర్వాత 10 చెక్కులు ఉన్న బుక్‌కు రూ.40తోపాటు జీఎస్‌టీ కట్టాలి. అదే 25 చెక్కులు ఉన్న బుక్‌కు రూ.75తోపాటు జీఎస్‌టీ చెల్లించాలి. సీనియర్ సిటిజన్స్‌కు, వేతన జీవులకు చార్జీలు ఉండవు. అలాగే బౌన్స్ కాకుండా ఇతర టెక్నికల్ రీజన్ కారణంగా చెక్ చెల్లుబాటు కాకపోతే అప్పుడు ఇష్యూ చేసినవారు రూ.150 చార్జీ చెల్లించాలి. దీనికి జీఎస్‌టీ కలుపుకుంటే రూ.168 పెనాల్టీ పడుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Alert Alert SBI Customers "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0