Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Details of Branch wise remaining posts in Village Secretariat

ఉద్యోగాలు మిగిలాయి..
గ్రామ సచివాలయాల తీరిది
Details of Branch wise remaining posts in Village Secretariat

 ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగాలకు అభ్యర్థులు కరవయ్యారు. అర్హులైన అభ్యర్థులు లేక పోస్టులు మిగిలిపోయాయి. ఆయా శాఖల్లో నిర్వహించిన రాత పరీక్షలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో అర్హులకంటే.. అనర్హులే ఎక్కువగా తేలారు. వ్యవసాయ, అనుబంధ శాఖల్లో అత్యధికంగా పోస్టులు మిగిలిపోయినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. తర్వాత ర్యాంకర్లతో పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. అభ్యర్థుల్లో అర్హతలేని వారే ఉన్నారు. ఇప్పటికే ఎంపీఈవోలు గత ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నారు. వారిలో కొందరు గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఎంపికయ్యారు.

శాఖల వారీగా మిగిలిన పోస్టులిలా..

పశుసంవర్ధకశాఖ: జిల్లాకు గ్రామ పశు సహాయకుల ఉద్యోగాలకు 805 పోస్టులు మంజూరు చేశారు. అందులో 136 మంది మాత్రమే అర్హత సాధించారు. వారందరికీ నియమాక ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా 669 పోస్టులు మిగిలిపోయాయి.
ఉద్యానశాఖ: జిల్లాకు గ్రామ ఉద్యాన సహాయకుల ఉద్యోగాలకు 483 పోస్టులు మంజూరు చేశారు. వారిలో 378 మంది ఎంపికయ్యారు. అయితే ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 316 మంది హాజరయ్యారు. వారిలో 243 మంది మాత్రమే పూర్తి అర్హత సాధించగా, ఇంకా 240 పోస్టులు మిగిలాయి.

వ్యవసాయశాఖ:జిల్లాకు గ్రామ వ్యవసాయ సహాయకుల ఉద్యోగాలకు 282 పోస్టులు మంజూరయ్యాయి. అందులో 217 మంది మాత్రమే అర్హత సాధించారు. ఇంకా 65 పోస్టులు మిగిలిపోయాయి.

ఎంపీఈవోల్లో ఆందోళన

ప్రతి వెయ్యి హెక్టార్లకు ఒకరు చొప్పున గత ప్రభుత్వం బహుళ వ్యవసాయ విస్తరణాధికారులను (ఎంపీఈవో) నియమించింది. ఐదేళ్లుగా ఎంపీఈవోలంతా బాగా పనిచేశారు. రైతులకు మంచి సేవలు కూడా అందించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ఒక్కో సచివాలయంలో 13 మందిని వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులను నియమించింది. దీంతో ఎంపీఈవోల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఉద్యోగాలు ఉంటాయా.. ఊడతాయా? అన్న సందిగ్ధంలో ఉన్నారు. వ్యవసాయశాఖలో 674 మంది ఎంపీఈవోలు పనిచేస్తున్నారు వారిలో 99 మంది గ్రామ వ్యవసాయ సహాయకులుగా ఎంపికయ్యారు. ఇంకా 575 మంది అదే పోస్టులో కొనసాగుతున్నారు. ఉద్యానశాఖలో ఎంపీఈవోలు 120 మంది పనిచేస్తుండగా, గ్రామ ఉద్యాన సహాయకుల పోస్టులకు 80 మంది ఎంపికయ్యారు. ఇంకా 40 మంది కొనసాగుతున్నారు. మొత్తం 615 మంది ఎంపీఈవోల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Details of Branch wise remaining posts in Village Secretariat"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0