Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Females don't buy tickets .. Buses are free from today

ఆడవాళ్లు టికెట్లు కొనక్కర్లేదు.. నేటి నుంచే బస్సులు ఫ్రీ
Females don't buy tickets .. Buses are free from today

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం అమలులోకి వచ్చింది. మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించారు. భాయ్ దూజ్ పర్వదినం సందర్భంగా ఈ పథకం ప్రారంభించారు. మహిళలకు రక్షణ కల్పించడమే భాగంగా ఈ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చామన్నారు ఆ రాష్ట్ర మంత్రి మనీష్ సిసోడియా. మరో ఏడాదిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మహిళలను ఆకట్టుకునే దిశగా ఆప్ సర్కార్ ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.

ఈ పథకంలో లబ్ధిపొందే మహిళలకు ముందుగానే పింక్ పాసులను విడుదల చేసింది. దీని ఆధారంగా ప్రభుత్వం ఆర్టీసీకి బిల్లులు చెల్లించనుంది. నోయిడా - ఎన్‌సీఆర్ ప్రాంతాలకు కూడా ఇదివర్తిస్తుందని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది.ఎయిర్‌పోర్టుతో పాటు డీటీసీ బస్సులు ఎక్కడి వరకు వెళితే అంతవరకు మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. కాగా ప్రభుత్వ ఉద్యోగం చేసే మహిళలు కూడా ఈ ఉచిత పథకం వినియోగించుకోవచ్చని తెలిపింది. దీన్ని వాడుకున్నవారికి ట్రావెల్ అలవెన్సులు ఉండవని స్పష్టం చేశారు. ఆగస్టు 29 న కేబినెట్ ఈ పథకానికి ఆమోదం తెలిపింది. దీంతో పాటు మహిళల భద్రత కోసం ప్రభుత్వ బస్సుల్లో ప్రస్తుతం నియమించిన 3400 మంది మార్షల్స్ ను 13 వేల పెంచింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Females don't buy tickets .. Buses are free from today"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0