Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good teacher Inspiration

మా మంచి మాస్టారు
 రిటైర్డ్ అనంతరం సేవలందిస్తున్న ఉపాధ్యాయుడు యోగా గురువుగా విద్యార్థులకు శిక్షణ
గేయ రచనలతో స్ఫూర్తి నింపుతున్న వైనం

సేవ చేయాలనే సంకల్పం ఉండా లనే కాని వయసుతో సంబంధం లేదంటున్నారు ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు . ఓ వైపు బోధిస్తూ . . . మరో వైపు విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా గేయ రచనలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు . వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం కూలూరుకు చెందిన కాసా విజయ భాస్కర్ రెడ్డి 1984లో ఉపాధ్యాయుడిగా ఎంపికై పలు చోట్ల పని చేస్తూ చాగలమర్రిలో స్థిరపడ్డారు . 2018లో ఉద్యోగ విరమణ పొందినా తర్వాత కాలక్షే పంతో సమయానికి గడిపేయకుండా పేద విద్యార్థుల సేవలో తరిస్తున్నారు . మండలంలో నీ చింతలచెరువు , శెట్టివీడు , చాగలమర్రి మెయి న్ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా , కలుగొట్లపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యా యునిగా పని చేసి రిటైర్డ్ అయ్యారు . ప్రస్తుతం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశా లలో ఉపాధ్యాయునిగా పాఠాలు బోధించడంతో పాటు విద్యార్థులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు .

సేవా కార్యక్రమాలు . .


  •  స్థానిక బాలికల వసతి గృహంలో యోగా గురువుగా ఉచిత శిక్షణ ఇస్తున్నారు . .
  •  చాగలమర్రికి చెందిన నిరుపేద విద్యార్థి కొండన్నను సొంత ఖర్చుతో చదివిస్తున్నారు . 
  •  బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన కోసం సొంత ఖర్చుతో స్టేజి నిర్మించారు . 
  •  విద్యార్థులు , సమాజానికి సంబంధించిన గేయాలు , రచనలు విజయభాస్కర్‌రెడ్డి పుస్తక రూపంలో తెచ్చి విద్యార్థులకు , ప్రజలకు ఉచితంగా అందజేశారు .
  •  ఆ ఇబడికి వెళ్లాలన్న ఆసక్తిని విద్యార్థుల్లో పెంచేం దుకు ' బడికి పోతే ఎంత బాగుంటుంది . . . అనే గాయాన్ని రాసి జిల్లాలోని అన్ని పాఠశా లలకు ఈ గేయాన్ని అందజేశారు .
  • నా విద్యార్థులు నవరత్నాలు . .
  •  అమ్మబడికి పోతాను శీర్షికన పలు గేయాలు రాశారు
  • నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేం దుకు ప్రచార గేయాన్ని కూడా ఆయన రచించారు . 
  • మాతృభాషా గొప్పదనాన్ని వివరిస్తూ ' కమ్మనైన భాషా మన తెలుగు భాషా ' అనే పాటను రాశారు . 
  • విద్యార్థి నేస్తంగా మారి ఆయన చేస్తున్న సేవ లకు 2012లో ఘంటసాల ఆవార్డు దక్కింది .
  •  అదే ఏడాది తిరుపతిలో ఉగాది పురస్కా రాన్ని అందుకున్నారు .

  • విద్యార్థుల్లో చైతన్యం నింపడమే లక్ష్యం 

  • విద్యార్థులను సృజనాత్మకంగా తీర్చిదిద్ది వారిలో చైతన్యం నింపడమే నా లక్ష్యం . విద్యాభోదనతో పాటు వారి బాగు కోసం రచనలు రాయడం అదృ ష్టంగా భావిస్తున్నాను . ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది . దానిని గుర్తించి ప్రోత్సహించాలి . ఫలితంగా విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయి . పాతాలు , గేయాలతో విద్యార్థులను మంత చైతన్య వంతుగా చేయగలుగుతున్నాను . ప్రధానంగా విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందిం చేందుకు సాహిత్యం , కళలు ఉపయోగ పడతాయి .
  •  - విజయభాస్కర్ రెడ్డి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good teacher Inspiration"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0