Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to Get a Birth Certificate

బర్త్ సర్టిఫికెట్ కావాలంటే . . ఇలా !

ప్రస్తుతం సర్టిఫికెట్ ల  యుగం నడుస్తోంది . ఆధార్ కార్డుతో సహా అన్నింటికి సర్టిఫికెట్లే ఆధారంగా నిలుస్తున్నాయి . పుట్టినప్పటినుంచి జీవితం చివరి వరకు సర్టిఫికెట్లు అవసరమవుతుంటాయి . ఆ సర్టిఫికెట్లు మనిషి జీవితంలో బర్త్ సర్టిఫికెట్ తోనే ప్రారంభమవు తాయి . బర్త్ సర్టిఫికెట్ జీవితంలో ఎంతో కీలకమైనపాత్ర వహిస్తుంది . అందుకే పిల్లలు జన్మించిన వెంటనే పెద్దలు బర్త్ సర్టిఫికెట్ తీసు కుంటారు . 
How to Get a Birth Certificate

పిల్లలు పెద్దవారయ్యాక ఉన్నత చదువులు వెళ్లేందుకు , స్కాలర్ షిప్ పొందేందుకు , విదేశీ పర్యటనలకు , పాస్పోర్ట్ కావాలంటే తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ అవసరమవుతోంది . ఈ ఆవసరాలను గమనించి పెద్ద లు ఓ వారం ఆలస్యమైనా పిల్లలు పుట్టిన తర్వాత ఈ సర్టిఫికెట్‌ను తీసుకుని జాగ్రత్తలు దాచుకుంటున్నారు . సాధారణంగా ఈ సర్టిఫికెట్ మున్సిపల్ , కార్పొరేషన్ , తహసీల్దార్ కార్యాలయాలలో ఇస్తారు . ప్రైవేట్ ఆసుపత్రుల లో ప్రసవం జరిగితే డాక్టర్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు . ప్రభు త్వాసుపత్రులలో డాక్టర్లే ఈ సర్టిఫికెట్‌ను అంద జేస్తారు . తహసీల్దార్ లేదా మున్సిపల్ కార్యాల యాలలో ఇస్తే బర్త్ సర్టిఫికెట్ వస్తుంది . ప్రస్తుతం ఉన్న సౌకర్యాల కారణంగా వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్ ను మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుని సర్టిఫికెట్ ను పొందవచ్చు . ఛార్టీ కూడా వంద రూపాయల్లోపే ఉంటోంది . మీసేవలో దరఖాస్తు చేసుకున్నాక . . వారం , పదిరోజులలోపు సర్టిఫికెట్ మనకు అందుతుంది . దరఖాస్తు చేసేది ఏడాదిలోపు పిల్లలకైతే దర కాస్తులో తల్లిదండ్రులిద్దరూ తమ బిడ్డ పేరును ద్రువీకరిస్తూ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది . ప్రస్తుతం పిల్లలను అసలు పేరు కంటే ముద్దు పేర్లతోనే ఎక్కువగా పిలుచుకుంటుంటారు . అయితే అసలు పేరును సర్టిఫికెట్ లో తప్పక నమోదు చేసుకోవాలి . ఏడాది దాటిన పిల్లలకైతే తల్లిదండ్రులు తమ సంతానం ఎంతమంది . ఉన్నారో పేర్లతో సహా తెలపాల్సి ఉంటుంది . ఆ మేరకు దరఖాస్తులో డిక్లరేషన్ ఇవ్వాలి . దర ఖాస్తు చేసుకునే సమయంలోనే రేషన్ కార్డు . ఆధార్ కార్డు , చిరునామా ధ్రువీకరణ కోసం ఎవైనా ఇతర సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది . పిల్లలు స్కూలుకు వెళ్లేవారైతే బోనఫైడ్ సర్టిఫికెట్ జత చేయాలి . ఈ పత్రాలు లేనివారు రూ . 10 విలువైన నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్ పై నోటరీ ద్వారా అఫిడవిట్ పొంది దాన్ని బర్త్ సర్టిఫికెట్ కు ఆధారంగా అందజేయాల్సి ఉంటుంది . ఆ ఆఫిడవిట్ను సంబంధిత వీఆర్వో తహసీల్దార్ , ఆర్డీఓలు పరిశీలించిన తర్వాతనే తీసుకుంటారు . దీనికి కూడా తగిన | ఫీజు చెల్లించాల్సి ఉంటుంది .

 తప్పులు దొర్లితే . . .

బర్త్ సర్టిఫికెట్లో ట్లలో దొర్లిన తప్పులను సరిచే సేందుకు సమీపంలోని మీసేవ కేంద్రాల వద్ద దరఖాస్తు చేసుకోవాలి . అప్పటికే బర్త్ సర్టిఫికెట్ పొంది ఉంటే దాన్ని దరఖాస్తుతోపాటు జత చేయాల్సి ఉంటుంది . ఇద్దరు గెజిటెడ్ అధికారు లతో ఆటేస్టేషన్ చేయించి తల్లిదండ్రులు దాన్ని దృవీకరిస్తూ డిక్లరేషన్ ఇవ్వాలి . రూ . 10 నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లో దీన్ని కూడా నోటరీతో అఫిడవిట్ తయారు చేయించి ఇవ్వాలి . దీని కోసం విద్యార్హత సర్టిఫికెట్ , ఏదై నా గుర్తింపు కార్డు , ఇతర రిజిష్టర్ డాక్యుమెంట్ అందజేయాలి . ప్రసవం జరిగిన ఆసుపత్రి నుంచి పారపాటు సవరణ కోసం అనుమతి లేఖను తీసుకోవాల్సి ఉంటుంది . జననానికి సంబంధించిన రికార్డులు లేకుంటే నాన్ ఆవైల బులిటీ షర్టిఫికెట్ కోసం మొదట మీ సేవ కేంద్రా నికి వెళ్లి సంబంధిత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి . దాంతోపాటు రేషన్ , ఆధార్ కార్డు లు ఏదైనా చిరునామా ధ్రువీకరణ సర్టిఫికెట్లను అందజేయాలి . పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్ ఉంటే దాన్ని కూడా జతచేయాలి . పదవ తరగతి చదివి ఉంటే వారి మార్కుల మెమో జతచే యాలి . దీన్ని కూడా రూ . 10 నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్‌పై నోటరీ ద్వారా ఆఫిడవిట్ చేయించాలి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to Get a Birth Certificate"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0