Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

PF account unique to each employee Not applicable to CPS employees

PF account unique to each employee
Not applicable to CPS employees

ప్రతి ఉద్యోగికి ప్రత్యేకంగా పీఎఫ్ ఖాతా..
సీ.పీ.ఎస్ ఉద్యోగులకు వర్తించని వైనం
PF account unique to each employee  Not applicable to CPS employees

భవిష్య నిధి
ఉద్యోగులకు ఆపద్బంధు
ప్రతి ఉద్యోగికి ప్రత్యేకంగా పీఎఫ్ ఖాతా -
వేతనం నుంచి ఆరు శాతం తగ్గకుండా ఖాతాలో జమ  రుణ సౌకర్యం . .
 పార్టీ పేమెంట్ సౌకర్యం

ఉద్యోగంలో చేరినప్పుడు ప్రతి ఉద్యోగికి ప్రత్యేకించి పీఎఫ్ ' ( భవిష్య నిధి ) ఖాతాను ప్రారంభిస్తారు . అందులో వేతనంలో మినహాయించిన నగదు జమ ఆవుతుంది . ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత కొంత డబ్బును చెల్లిస్తూ మిగిలిన కొంత డబ్బు పింఛన్ రూపంలో అందిస్తుంది .

  • 1952లో అమలులోకి వచ్చిన పీఎఫ్ చట్టం పరిశ్రమలు , సంస్థల్లో పని చేసే ఉద్యోగు లతో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది . 
  • సీపీఎస్ ఉద్యోగులకు మాత్రం పీఎఫ్ వర్తించడం లేదు.
  • ఉద్యోగికి కేటాయించిన పీఎఫ్ ఖాతాకు ప్రతి నెలా మూల వేతనంలో ఆరు శాతం తగ్గకుండా జమ చేయాలి .
  •  పే రివిజన్ సమయంలో పీఎు జమ చేసే నగదు పెంచాల్సి ఉంటుంది .
  •  ఉద్యోగికి జీత భత్యాలు లేని దీర్ఘకా లం సెలవు సమయం తప్ప మిగిలిన అన్ని రకాల సెలవు ల సమయంలో పీఎఫ్ నగడు మినహాయింపు చేయాల్సి ఉంటుంది . 
  • ఉద్యోగి సస్పెండ్ అయినప్పుడు ఇచ్చే జీతం నుంచి కూడా మినహాయిస్తారు . 
  • ఉద్యోగ పీఎఫ్ ఖాతాకు జమ అయ్యేలా డ్రాయింగ్ అధికారి చూసుకోవాల్సి బాధ్యత ఉంది . 
  • ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ నిర్ణ యించే వడ్డీని లెక్కించి ఖాతాకి జమ అవుతుంది . 
  • ఉద్యోగి ఒక శాఖ నుంచి మరో శాఖకు మారినప్పటికీ వా రి పీఎఫ్ ఖాతా నెంబరు మారదు .
  •  అయితే ఆ శాఖకు మాత్రం బదిలీ చేస్తారు .
  •  అంతర్ జిల్లాల బదిలీల సమ యంలో కొత్త ఖాతాను ప్రారంభించి అప్పటి వరకు పనిచేసే కాలానికి ఆ జిల్లాలో ఉన్న నిల్వ నిధులను కొత్త ఖాతాకు బదలాయిస్తారు . 
  • ఉద్యోగి తన కుంటుంబ సభ్యుల్లో ఒకరిని నామినీగా నియ మించుకునే సౌలభ్యం ఉంది . 
  • ఖాతా ప్రారంభించేటప్పుడు , తర్వాత గానీ నామినీ పేరు నమోదు చేసుకోవచ్చు . 
  • నామి నీని మార్పు చేసుకునే అవకాశం కూడా ఉంది . ఉద్యోగి మరణిస్తే ఖాతాలో ఉన్న సొమ్ము వడ్డీతో కలిపి నామినీకి చె ల్లిస్తారు .

చెల్లింపులు ఇలా . 

పీఎఫ్ వల్ల ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి . ఉద్యోగులు తమ పిల్లలను ఉన్నత చదువులకు , వివాహం , ఇంటి నిర్మాణం , స్థలం కొనుగోలు , వైద్యసేవల ఖర్చులకు రుణ సౌకర్యం పొందే అవకాశం ఉంది . దాచుకున్న నగదులో 50 శాతం వరకు రుణంగా ఉండవచ్చు . నిబంధనల మేరకు ఉద్యోగి 15 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసి ఉండాలి . వైద్య ఖర్చుల కోసం ఆరు నెలల మూల వేతనం గానీ , 50 శాతం ని ల్వ నగదు . రెండింటిలోనూ ఏది తక్కువ అయితే అంత మొత్తం రుణంగా మంజూరు చేస్తారు . ఇంటి స్థలం కొనుగోలు , ఇంటి నిర్మాణం లేదా ఇళ్లు మరమ్మతుల కోసం 50 శాతం వ రకూ పార్టీ పేమెంట్ పొందవచ్చు . ఇలా పొందాలంటే సంబందిత డ్రాయింగ్ అరకొరి నుంచి ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది . రుణ రికవరీ వేతనం నుంచి వాయిదాల పద్ధతిలో మినహాయింపు ఉంటుంది . ఆ ఉద్యోగి పదవీ విరమణ అనంతరం అంత వరకూ జమ చేసిన నగదును వడ్డీతో కలిపి చెల్లిస్తారు . ఉద్యోగి మరణిస్తే అప్పటి వరకూ జమ చేసిన నగదును వడ్డీతో కలిపి నామి నీకి గానీ , వారసులకు గానీ చెల్లిస్తారు . - ఏదైనా కారణంతో ఉద్యోగం కోల్పోతే రెండు నెలలు గడిచిన తర్వాత ఖాతాలో ఉన్న నగదు వడ్డీతో కలిపి చెల్లిస్తారు . - ఉద్యోగి తన పదవీ విరమణ నాలుగు నెలల ముందుగా పీఎఫ్ మినహాయింపు నిలుపు చేసి తుది పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలి . సీపీఎస్ ఉద్యోగులకు వర్తించని వైనం . . సీపీఎస్ ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ ( పీఎఫ్ ) పథకం అందని ద్రాక్ష అయింది . 2001 సెప్టెంబరు 1 తర్వాత కంట్రీ బ్యూటరీ పెన్షన్ పథకం ( సీపీఎస్ ) లో చేరిన ఉపాధ్యాయ , ఉద్యోగులకు పీఎస్ వర్తించడం లేదు . అందుకు వారి మూల వేతనం నుంచి మినహాయింపు కావడం లేదు . పీఎఫ్ తమకు వర్తింపజేయాలని ఆయా ఉద్యోగులు , ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తూ సీపీఎస్ విధానం రద్దు చేయాలని కోరుతున్న సంగతి విదితమే .

సీపీఎస్ ఉద్యోగులకు అన్యాయం  

పీఎఫ్ వర్తించకపోవడంతో సీపీఎస్ ఉద్యోగులు ఆన్యాయమవుతున్నారు . 2001 సెప్టెంబరులో సీపీఎస్ ఆమలు లోకి వచ్చింది . అప్పం నుంచి పీఎఫ్ కోసం వేతనం నుంచి నగదు మినహాయింపు నిలిపి వేశారు . ఉద్యోగులకు తమ సర్వీసు కాలంలో , పదవీ విరమణ అనంతరం సా మిజక , ఆర్థిక భరోసా అందించే పీఎఫ్ నిలి వేయడం పై ఆన్ని ఉద్యోగ సంఘాలు నిరస న తెలియజేస్తున్నాయి . అయినా నీపీఎస్ ఉ ద్యోగులకు న్యాయం జరగలేదు .
 - డి . గోపీనాథ్ , జిల్లా అధ్యక్షుడు , పీఆర్టీయూ

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "PF account unique to each employee Not applicable to CPS employees"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0