Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Posts are replaced by DSC in January every year.


 ప్రతి సంవత్సరం జనవరిలో డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ.
*అందరి సహకారంతో పాఠశాలలు బలోపేతం..*
* విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్లడి..*

Posts are replaced by DSC in January every year.

 ( పాఠశా లల బలోపేతానికి అందరి సహకారం అవస రమని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ తెపాపారు . విద్యావ్యవస్థ అభివృద్ధిలో చేస్తున్న మార్పుల్లో భాగస్వామ్యం కావాల న్నారు . అయితే అలసత్వాన్ని సహించేది లేదని తెలిపారు . కలెక్టరేట్ సభాభవనంలో శనివారం డీఈఓ శైలజ అధ్యక్షతన ' ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నాడు - నేడు పై విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాణ్యతా విలువలతో కూడిన విద్యను ఒకటో తరగతి నుంచే అందించాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు . ప్రభుత్వం సూచించే ఆదేశాలను అమలు చేసే బాధ్యత క్షేత్రస్థాయి అధికారులదేనని చెప్పారు . విద్యావ్యవస్థను గాడిలో పెట్టి విలు వలతో కూడిన విద్య అందించాలన్నదే సీఎం ప్రధాన ఉద్దేశ్యమన్నారు . విద్యా నవరత్నాల అంశాలు విద్యాశాఖకు సంబంధించిన అన్ని కార్యాలయాల్లో ఉంచాలన్నారు . ఆమ్మ ఒడి , నాడు నేడు రెగ్యులేటరీ కమిషన్ ఇలా వినూ త్నమైన ఆలోచనలతో ముఖ్యమంత్రి ముందుకు వెళుతున్నారన్నారు . విద్యా ప్రమా ణాలను పెంచి భావితరాలకు ఉత్తమ పౌరు లను తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉంద న్నారు .
అన్ని మౌలిక అంశాలు మెరుగుపరుస్తూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు . పేరెంట్స్ కమిటీలను ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని తెలిపారు . జిల్లాలో మధ్యాహ్న భోజనం అందించేందుకు కేంద్రీకృత కిచెన్ ఏర్పాటు చేసేందుకు రెండెక రాల స్థలం కావాలని కలెక్టరు సహకారంతో గుర్తించాలని డీఈఓను ఆదేశించారు . పాఠశా లల్లో నోబ్యాగ్ డే తప్పనిసరిగా పాటించాల న్నారు . ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ మాట్లా డుతూ ఒకటో తరగతి నుంచే విద్యార్థుల్లో అభ్యసనా ప్రమాణాలు పెంచాలన్నారు . చదు వులో వెనుకబడిన వారిని గుర్తించి వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలన్నారు . దేశంలో ఎక్కడా లేని విధంగా విశ్రాంత జడ్డి నేతృత్వంలో రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేశామన్నారు . కలెక్టరు హరికిరణ్ మాట్లా డుతూ జిల్లాలో 86 శాతం మంది పిల్లలకు కంటి వెలుగు పరీక్షలు నిర్వహించామన్నారు . జిల్లాలో 2 . 50 లక్షల మంది తల్లులు అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందనున్నారన్నారు . కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రవీంద్రనాదరెడ్డి , వెంకటసుబ్బయ్య , ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి , ఇంటర్మీడియట్ ఆర్జేడీ చంద్రశేఖర్ రెడ్డి , పాఠశాల విద్య ఆర్జేడీ క్రిష్ణారెడ్డి , వైవీయూ అధికారులు పాల్గొన్నారు .

 ట్రిపుల్  ఐటీలను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం 

ట్రిపుల్ ఐటీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అగ్రగామిగా తీర్చిది ద్దుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ తెలిపారు . ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీని శనివారం సాయంత్రం మంత్రి సురేష్ సందర్శించారు . డైరెక్టర్ సుదర్శన్ రావు , ఏఓ రత్నకుమారి , ఇతర అధికారులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం ప లికారు . క్యాంపస్ ఆవరణంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు . మొక్కలు నాటారు . అనంతరం ట్రిపుల్ ఐటీలో ఎస్సీ , ఎస్టీ సెల్ ను ప్రారంభిం చారు . మొదట విలేకరుల సమావేశంలోను తర్వాత సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులు , అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు . - జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ ను సందర్శించారు . శనివారం సాయంత్రం వైఎస్ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు . కాసేపు కూర్చొని మౌనం పాటిం చారు . వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి గుర్తుచేసుకున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Posts are replaced by DSC in January every year."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0