Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

2.58 lakh applications for the second stage volunteer process

రెండో దశ వాలంటీర్ ప్రక్రియకు 2.58 లక్షల దరఖాస్తులు 
రాష్ట్ర వ్యాప్తంగా 28వేల వాలంటీర్ల నియామకం 
అత్యధికంగా తూర్పుగోదావరి నుంచి దరఖాస్తులు.
2.58 lakh applications for the second stage volunteer process

 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయటం తోపాటు ఉద్యోగార్థులకు ఉపాధి కల్పించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండవ దశ వాలంటీర్ల నియామకప్రక్రియకు రాష్ట్ర వ్యాప్తంగా 2 . 58 లక్షల దరఖాస్తులు వచ్చాయి . తొలివిడతలో నియామకం చేపట్టగా మిగిలి పోయిన వాలంటీర్ పోస్టులకు ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి , 10వ తేదీన ముగించింది . ఈ క్రమం లో , గ్రామ వార్డు వాలంటీర్ వెబ్ సైటు పెద్ద ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు . ప్రస్తుతం అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ జరుగుతోంది . మరో మూడు నాలుగు రోజుల్లో ఈ ప్రక్రియను ముగించి , అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచి , ఎంపిక చేయ బోతున్నారు . 28 , 884 వాలంటీర్ల నియామకం గ్రామీణ ప్రాంతంలో ప్రతి 50 ఇళ్లకు , పట్టణ ప్రాంతంలో ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటీరను ఏర్పాటుచేసి , వారి చే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి , ప్రజలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే . పట్టణాలు , గ్రామాలు అన్నీ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2 . 64 లక్షల మంది వాలంటీర్లను ( లక్షా 92 వేల 924 గ్రామ వాలంటీర్లు , 70 వేల 888 వార్డు వాలంటీర్లు ) నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ జూన్ 24న నోటిఫికేషన్ విడుదల చేసింది . ఈ " సంద్భంలో ఆగస్టు 10వ తేదీ వరకు దాదాపు 9 . 62లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు . వారిలో 2లక్షల 48వేల మందిని అర్హులుగా గుర్తించి , వాలం టీర్ బాధ్యతలు అప్పగించారు . అయితే వారిలో కొందరు ఉద్యోగాల్లో చేరలేదు . మరికొందరు చేరి మధ్యలోనే మానేశారు . ఈ సందర్భంలో మిగిలిన వాలంటీర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసి , దరఖాస్తు ప్రక్రియను చేపట్టింది . మున్సిపల్ , గ్రామీణ ప్రాంతా ల్లో కలిపి మొత్తం 28 , 884 వాలంటీర్లను నియ మించేందుకు రెండో దశ నోటిఫికేషన్ ఇచ్చింది . పట్టణాల్లో దాదాపు 19వేల 700 వాలంటీర్లను నియమాకం చేపట్టనుండగా . . మిగిలినవి గ్రామీణ ప్రాంతాల్లో నియామకం చేపట్టనున్నారు . రెండో దశలోనూ భారీ దరఖాస్తులు ప్రభుత్వం రెండో దశలో వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసి , పదిరోజులే దర ఖాస్తుకు గడువు ఇచ్చినప్పటికీ , పెద్దెత్తున అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు . గడువు ముగిసే సమ యానికి మొత్తం 2లక్షల 58వేల 414 మంది దరఖాస్తు చేసుకున్నారు . అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి 34వేలమంది దరఖాస్తు చేసుకున్నారు . తర్వాత గుంటూరు , విశాఖ జిల్లా నుంచి 26వేల చొప్పున దరఖాస్తులు వచ్చాయి . కాగా దరఖాస్తు దారులందరిలో ఇప్పటివరకు 32 , 522 మంది దరఖాస్తులను అధికారులు పరిశీలన చేశారు . వాటిలో 29 , 981 దరఖాస్తులకు ఇంటర్య్యూలకు ఆమోద ముద్ర వేయగా . . 2541 దరఖాస్తులను తిరస్కరించారు . మిగిలిన దరఖాస్తులను నాలుగైదు రోజుల్లో పరిశీలన పూర్తిచేసి , వారిని ఇంటర్వ్యూలను ఆహ్వానిం చనున్నారు .

జిల్లాపేరు          వచ్చినదరఖాస్తులు

 అనంతపురం.                20,904

చిత్తూరు.                        17,516

కడప                             15,811

తూర్పుగోదావరి              34,349

గుంటూరు.                     26,145

 కృష్ణ                              23,358

కర్నూలు                        24,600

నెల్లూరు                        11,365

ప్రకాశం                         16,892

శ్రీకాకుళం                      10,176

విశాఖపట్టణం.               26,759

 విజయనగరం               11,036

పశ్చిమగోదావరి             19,437

మొత్తం                       2 , 58 , 849

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "2.58 lakh applications for the second stage volunteer process"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0