Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Action plan for implementation of AMMAVADI

  • అమ్మఒడి అమలుకు కార్యాచరణ ప్రణాళిక
  • టైమ్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ప్రభుత్వం
  • విద్యార్థుల వివరాలన్నీ చైల్డ్‌ ఇన్ఫో లో రేపు సాయంత్రం వరకే గడువు
  • డిసెంబరు 31వ తేదీనాటికి 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పథకానికి అర్హులు

  • పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరి వివరాలను చైల్డ్‌ ఇన్ఫోలో నమోదుచేసి అప్‌డేట్‌ చేయాలి.
  • విద్యార్థితోపాటు తల్లి లేదా సంరక్షురాలి ఆధార్‌ నంబర్‌, కుటుంబ రేషన్‌ కార్డు వివరాలు, తదితర సమాచారం మొత్తం పాఠశాల చైల్డ్‌ ఇన్ఫోలో అప్‌డేట్‌ చేయాలి.
  • ఈనెల 19వ తేదీ సాయంత్రంలోగా చైల్డ్‌ ఇన్ఫో డేటా అప్‌డేట్‌ కావాలని, సదరు సమాచారాన్ని ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా ఏపీ సీఎఫ్‌ఎంఎస్‌కి అనుసంధానం చేయాలి.
  • ఈనెల 21వ తేదీనాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తిచేసి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుని లాగ్‌ ఇన్‌ ఐడి, పాస్‌వర్డ్‌ అందజేస్తారు.
  • సదరు సమాచారాన్ని మూడు ప్రొఫార్మాలుగా విడదీసి ప్రధానోపాధ్యాయులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం గ్రామ సచివాలయ విద్యా సంక్షేమ సహాయకులకు ఈనెల 24వ తేదీలోగా అందజేయాలి.
  • సదరు సమాచారం ఆధారంగా సచివాలయ సహాయకులు అమ్మఒడి లబ్ధిదారుల అర్హతలపై పూర్తిస్థాయిలో పరిశీలన జరపాలి.
  • సచివాలయ సిబ్బంది అందజేసిన సమాచారం ఆధారంగా ప్రధానోపాధ్యాయులు మరోసారి చైల్డ్‌ ఇన్ఫో డేటాను పరిశీలించి డిసెంబరు 5వ తేదీలోగా  పునఃప్రారంభమైననాటి నుంచి ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ వరకు 75 శాతం హాజరు వున్న విద్యార్థులను మాత్రమే అమ్మఒడి పథకానికి అర్హులుగా పరిగణిస్తారు.
  • డిసెంబరు 8వ తేదీ నాటికి అమ్మఒడి పథకానికి అర్హులైన తల్లులు లేదా సంరక్షకుల ముసాయిదా జాబితాలను సిద్ధంచేసి సచివాలయ సిబ్బందికి అందజేయాలి
  • సదరు జాబితాలను గ్రామ సచివాలయంలో ప్రదర్శించి డిసెంబరు 13వ తేదీలోగా అభ్యంతరాలను స్వీకరించి, అదే నెల 18వ తేదీలోగా గ్రామసభ ఆమోదం పొందాలి.
  • అమోదించిన జాబితాలను డిసెంబరు 20వ తేదీనాటికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేయాలి.
  • సదరు జాబితాలను మండల విద్యాశాఖ అధికారి ద్వారా డిసెంబరు 23వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేయాలి
  • డిసెంబరు 24వ తేదీనాటికి తుది జాబితాలను జిల్లా కలెక్టర్లకు డీఈఓ అందజేయాలి.
  • పైన పేర్కొన్న కార్యాచరణ ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు విద్యా శాఖాధికారి కార్యాలయంలో ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేయడమే కాకుండా జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని కూడా ప్రభుత్వం నియమించింది.
         Download copy

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Action plan for implementation of AMMAVADI"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0