Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Amma's scheme has finalized the rules

 అమ్మఒడి ' చారిత్రాత్మక నిర్ణయం
పథకం అమలుకు కసరత్తు విద్యార్థులు , తల్లిదండ్రుల వివరాల సేకరణ
హామీల అమలులో దూసుకెళ్తున్న జగన్ ప్రభుత్వం ! ఆనందం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు.

చదువుకు పేదరికం అడ్డురాకూడదని భావించిన సీఎం వైఎస్ . జగ న్మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకం అమలు చేయాలని నిశ్చయించారు . ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు . ప్రస్తుతం అమ్మఒడి పథకం విధివిధానాలను ఖరారు చేశారు . దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చారు . ఈ పథకం అమలుపై అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు . తల్లుల ఖాతా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు .
Amma's scheme has finalized the rules


 రాను . . రాను కనుమరుగైపో తున్న సర్కారు విద్యను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . ప్రభుత్వ ఆశయం నెరవేరాలంటే పేదరికంలో ఉన్న ప్రతి విద్యార్టీ బడికి వెళ్లాలి . బడిబయట పిల్లలు ఎక్కడా కనిపించకూడదు . చదువుకు పేదరికం అడ్డుకాకుడదని సీఎం వైఎస్ . జగ న్మో హన్ రెడ్డి బలంగా భావిస్తున్నారు . ఆం దుకే అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు . ప్రజాసంకల్ప యాత్రలో పేద విద్యార్థుల ఇబ్బందులు కళ్లారా చూసిన ఆయన అమ్మఒడి పథకాన్ని నవరత్నాల హామీలో పొందుపరిచారు . ఈ పథకం జనవరి 26 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు . సమయం సమీపిస్తుండడంతో పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లలో ప్రభుత్వ , జిల్లా విద్యాశాఖ యంత్రాంగం నిమగ్నమైంది .

 కసరత్తు ప్రారంభం

 అమ్మఒడి పథకం అమలు దిశగా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది . జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన 6 , 231 పాఠశాలలు ఉన్నాయి . అందులో ప్రాథ మిక 4 , 279 , ప్రాథమి కోన్నత 712 , ఉన్నత పాఠశాలలు 1 , 240 ఉన్నాయి . ప్రాథమిక పాఠ శాలల్లో 2 , 12 , 148 మంది , ప్రాథమికోన్నత పాఠశాలల్లో 60 , 932 మంది , ఉన్నత పాఠశాలల్లో 2 , 58 , 335 మంది విద్యార్థులు చదువుతు న్నారు . ఇంటర్మీడియెట్ కశాలలు 290 ఉం డగా , అందులో 1 , 76 , 562 మంది విద్యార్థులుచదువుతున్నారు . వారి వివరాలు , తల్లుల బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించా రు . ఈ మేరకు అమ్మఒడి విధివిధానాల ఉత్తర్వులను జిల్లాలోని ఆయా డివి జన్ల డీవైఈఓలకు , ఎంఈఓలకు డీఈఓ నరసింహారెడ్డి జారీచే శారు . ఈ కసరత్తులో విద్యాశాఖ అధికారులు నిమ గ్నమై ఉన్నారు . 11 అంశాలతో కూ డిన ప్రొఫార్మాను రూపొందించి , దాని ప్రకారం వివరాలు సేకరించి పంపాలని ఆదేశాలు అందాయి . ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత 2020 జనవరి 26వ తేదీన విద్యా రుల తల్లుల ఖాతాలో ఒక్కో విద్యార్థికి రూ . 15 వేల చొప్పున జమచేయనున్నారు .

పథకం వర్తింపు ఇలా . . 

  • అర్హులైన లబ్దిదారు జాతీయ బ్యాంకు 1 లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలి .
  •  అర్హులైన వారి అకౌంట్లకు ప్రతి ఏటా జనవరిలో రూ . 15 వేలు జమచేస్తారు . 
  • ఈ పథకం కోసం ప్రత్యేక వెబ్ సైట్ను రూపొందించి రాష్ట్ర విద్యాశాఖ సీఎస్ఈ వెబ్ సైట్ తో లింక్ చేస్తారు . 
  • ఆయా విద్యాసంస్థలు అందజేసే విద్యా రుల డేటాను , హాజరును పరిశీలిస్తారు . 
  • ఇచ్చిన డేటాను తనిఖీ అధికారి ( ఎం ఈఓ / డీవైఈఓ డీఈఓ ) ధ్రువీకరిస్తారు .
  •  గ్రామ వలంటీరు క్షేత్రస్థాయిలో డేటాను ధ్రువీకరించాల్సి ఉంటుంది . 
  • డీఈఓ , ప్రాంతీయ అధికారి , వృత్తివిద్యా ధికారి , జిల్లా కలెక్టర్లకు లబ్దిదారుల డేటాను సమర్పించాలి . 
  • పథకంలో అక్రమాలు జరిగితే అది కారులు , లబ్ధిదారులనే బాధ్యులు చేస్తారు . ఐటీ , సివిల్‌ సప్లయ్స్ .
  •  రియల్ టైమ్ గవ ర్నెన్స్ విభాగాలు సాంకేతిక సహకారం తో డేటాను విశ్లేషిస్తారు . లబ్దిదారుల జాబితాలను గ్రామ , వార్డు 10 సచివాలయాల్లో సోషల్ ఆడిట్కు వీలుగా ప్రదర్శించాలి .

అర్హతలు ఇవే . . 


  • ప్రభుత్వ జీఓ 79 ( 04 - 11 - 2019 ) ప్రకారం అమ్మఒడి పథకానికి ఉండాల్సి అర్హతలను ప్రకటించారు . 
  •  1 . లబ్దిదారుడు ( తల్లి ) / సంరక్షుడు అర్హులు . ఆ కుటుంబంలోని పిల్లల సం ఖ్యతో సంబంధం లేకుండా మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు పథకం వర్తిస్తుంది . 
  • 2 . నిబంధనల ప్రకారం దారిద్ర్యరేఖకు దిగువున తల్లి ఉండాలి ( అంటే బీపీ ఎల్ కుటుంబానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది) 
  •  3 . కుటుంబానికి ప్రభుత్వం జారీచే సిన తెల్లరేషన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలి . 
  • 4 . లబ్ధిదారుల చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డును కలిగి ఉండాలి . 
  • 5 . చదువుతున్న పిల్లల ఆధార్ కార్డు వివరాలు 1 నుంచి 12వ తరగతుల మధ్య అందుబాటులో ఉండాలి ) . 
  • 6 . తల్లి మరణం లేదా లేకపోవడం విషయంలో పిల్లల సంరక్షుడికి రూ . 15 వేలు చెల్లిస్తారు . 
  • 7 . చెల్లుబాటుఅయ్యే రేషన్‌కార్డు 6 దశల ధ్రువీక రణకి లోబడి ఉంటుంది . ( పలు దశల్లో తెల్లరేషన్ కార్డును క్షుణ్ణంగా పరిశీలిస్తా రు ) . 
  • 8 లబ్దిదారుడి పిల్లలు 1 నుంచి 12 తరగ తులలో ఏపీ ప్రభుత్వం గుర్తించిన ప్రభుత్వ , ప్రైవేట్ ఎయిడెడ్ / ప్రైవేట్ అన్ ఎయిడెడ్ / జూనియర్ కళాశాలలు సహా / రెసిడెన్షియల్ పాఠశాలల్లో , కళా శాలల్లో చదువుతూ ఉండాలి .
  • 9 ఈ మూడు  స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశా లల్లో ప్రవేశం పొందిన అనాథలు / వీధి పిల్లలకు సంబంధించి ఆశాఖ అధికారులతో చర్చించనున్నారు .
  •  10 . విద్యార్థికి కనీసం 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి . 
  • 11 . విద్యార్థులు మధ్యలో చదువుమానేస్తే ఈ పథకం వర్తించదు . ఆ విద్యార్థిని తిరిగి బడికి తీసుకురావడా నికి అన్ని ప్రయత్నాలు చేయాలి . 
  • 12 . రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం , పీఎస్ యూ ఉద్యోగులు , ప్రభుత్వం ఆ ఉద్యోగుల పెన్షనర్లు , ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అనర్హులు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Amma's scheme has finalized the rules"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0