Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ammavadi Application Started

అమ్మ ఒడి’ దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఇతర వివరాలకు..
Ammavadi Application Started


  • నవరత్నాల్లో భాగంగా జగన్ సర్కారు అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాల్లో అమ్మఒడి ఒకటనే సంగతి తెలిసిందే. 
  • ఈ పథకం కింద బడికెళ్లే పిల్లలున్న తల్లికి ఆర్థిక సాయంగా ఏడాదికి రూ.15 వేలు అందజేయనున్నారు. 
  • ఈ పథకం విధివిధానాలను ఏపీ కేబినెట్ ఇటీవలే నిర్ణయించింది. 
  • ఈ పథకానికి రూ.6450 కోట్ల నిధుల్ని విడుదల చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
  •  ఒకటో తరగతి నుంచి 12 తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు, సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది.
  • అర్హత ఉండి రేషన్ కార్డు లేకపోయినా.. కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే లబ్ధిదారులుగా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది.
  •  జనవరిలో బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతాయి.
  • అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే.. పిల్లలు ఒకటి నుంచి 12 తరగతి మధ్య చదువుతుండాలి. ఉండాలి. 
  • తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు లేకపోయినప్పటికీ.. కార్డు కోసం దరఖాస్తు చేసి ఉండాలి.
  •  ప్రైవేటు స్కూళ్లలో చదివే వారికి సైతం ఈ పథకం వర్తిస్తుంది.
  • అమ్మఒడి దరఖాస్తు ఫారం కూడా అందుబాటులోకి వచ్చింది. 
  • అర్హులైన వారు వివరాలతో గ్రామ వాలంటీర్‌ను సంప్రదించాలి. 
  • అర్హత వివరాలను పూర్తిగా తెలుసుకోవడం కోసం గ్రామ సచివాలయాన్ని సైతం సంప్రదించొచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ammavadi Application Started"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0