Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Changed You tube Rules Channels Ban if there is no ad revenue

మారిన యూట్యూబ్ రూల్స్.. యాడ్ రెవెన్యూ లేకపోతే చానల్స్ బ్యాన్..!
Changed You tube Rules Channels Ban if there is no ad revenue

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన యూట్యూబ్ రూల్స్‌కు మార్పులు చేర్పులు చేసింది. యూట్యూబ్‌కు చెందిన టర్మ్స్ ఆఫ్ సర్వీస్‌లో నూతన నియమ నిబంధనలను చేర్చినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో కొత్త రూల్స్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు ఇబ్బందిని కలిగించేవిగా మారాయి. ఇకపై యూట్యూబ్‌లో యూజర్లు అప్‌లోడ్ చేసే వీడియోలకు యాడ్ రెవెన్యూ పూర్తిగా రాకపోయినా లేదా రెవెన్యూ అంతంత మాత్రంగానే వచ్చినా.. ఆ యూజర్‌కు చెందిన యూట్యూబ్ చానల్‌ను గూగుల్ బ్యాన్ చేయనుంది. అంతేకాదు.. ఆ యూజర్ జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ ఫొటోస్ తదితర ఇతర గూగుల్ సర్వీసులను కూడా వాడుకోకుండా నిషేధం విధించనుంది. ఇక ఇవే రూల్స్ వెబ్‌సైట్లకు కూడా వర్తిస్తాయని గూగుల్ తెలిపింది.
ఈ క్రమంలో వెబ్‌సైట్లలో ఉంచే కంటెంట్‌కు యాడ్ రెవెన్యూ పూర్తిగా రాకపోయినా లేదా గూగుల్ సూచించిన విధంగా నిర్దిష్ట మొత్తంలో రెవెన్యూను సాధించలేకపోయినా ఆ యూజర్లకు చెందిన జీమెయిల్, ఇతర సర్వీసులను బ్యాన్ చేయనున్నారు. కాగా గూగుల్ మార్చిన ఈ కొత్త రూల్స్ డిసెంబర్ 10వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. అయితే గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది యూట్యూబ్ చానల్ క్రియేటర్లతోపాటు వెబ్‌సైట్ పబ్లిషర్లకు కూడా ఇబ్బందులు కలిగించనున్న నేపథ్యంలో ఈ విషయంపై గూగుల్ మరోసారి ఆలోచిస్తుందో, లేదో చూడాలి..

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Changed You tube Rules Channels Ban if there is no ad revenue"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0