CM to launch 'Nadu - Nedu' on 14th of this month.
అంచెలంచెలుగా అమలు.
“ ఆంగ్లం ' పై విద్యాశాఖ మంత్రి సురేష్
జనవరి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
ఒకటి నుండి ఐదు వరకూ పాఠ్యాంశాలు మార్పు -
పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ ఆలోచనను అంచెలంచెలుగా అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు . రాబోయే కాలంలో ఉపాధ్యాయ పోస్టులలో ఆంగ్ల మాధ్యమంలో నైపుణ్యం వారిని మాత్రమే తీసుకుంటామన్నారు . శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు . ఒకటి నుంచి 8వ తరగతి వరకు తెలుగు మీడియం రద్దు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 81పై ఆయన వివరణ ఇచ్చారు . ప్రపంచ స్థాయి పోటీల్లో గ్రామీణ విద్యార్థులను నిలబెట్టాలంటే ఆంగ్ల మాధ్యమంలో బోధన తప్పనిసరని చెప్పారు . ఆంగ్ల మాధ్యమం అన్ని ప్రశ్నలకు సమాధానమని భావించామని , ఇది ప్రతిపక్షాలకు నచ్చక విమర్శలు చేస్తున్నాయని తెలిపారు . ప్రభుత్వ పాఠశాలల్లో సమాంతర మాధ్యమాల్లో బోధిస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదన్నారు . ఆంగ్ల మాధ్యమం కోసమే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళు_ న్నారని తాము గుర్తించామన్నారు . మారుతున్న ఆ కాలానికి అనుగుణంగా మారాలని , అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు . విద్యా సంస్కరణల్లో భాగంగా ఒకటి నుంచి 5వ తరగతి వరకు అవసరాలకు తగినట్లుగా పాఠ్యాంశాలను మార్పు చేస్తామన్నారు . జనవరి నుంచి 98 వేల మంది ఉపాధ్యాయులకు దశలవారీగా ఆంగ్లంలో శిక్షణ ఇస్తామన్నారు .

0 Response to "CM to launch 'Nadu - Nedu' on 14th of this month."
Post a Comment