Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Details of jobs beyond software

సాఫ్ట్‌వేర్‌ని మించిన ఉద్యోగాలు ఇవీ...!
Details of jobs beyond software

ఎంసెట్‌ లేదా జెఇఇ టాప్‌ ర్యాంకర్లంతా ఇంజనీరింగ్‌లో ఎక్కువగా ఎంపిక చేసుకునే బ్రాంచి కంప్యూటర్‌ సైన్స్‌ లేదా సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్‌కు అనుకూలంగా ఉండే ఇతర డిసిప్లిన్లు. పదేళ్ళుగా జెఇఇ రాంకర్లను పరిశీలిస్తే, అందరూ బాంబే ఐఐటిలో సిఎస్ఇ కోర్సు ఎంచుకున్నవారే. కంప్యూటర్‌ సైన్స్‌ తరవాత మిగిలిన వారిలో అత్యధిక మంది ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కాదు కూడదు అనుకుంటే ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌ వైపు వెళుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు మంచి వేతన ప్యాకేజీలతో పాటు కెరీర్‌ గ్రోత్‌ బాగా ఉంటుందనే భావమే దీనంతటికి కారణం. అందుకే ఇటీవలి కాలంలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన వారు కూడా సాఫ్ట్‌వేర్‌ రంగం వైపు మొగ్గు చూపడం ఒక ట్రెండ్‌గా మారింది. వాస్తవానికి ఇంజనీరింగ్‌ విభాగాల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కే అధిక వేతనాలు ఉంటున్నాయా అంటే కాదు అనే చెప్పవచ్చు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సగటు వేతనం రూ.4.97 లక్షలు 

భారతదేశంలో పరిశీలించినట్లయితే అత్యధిక వేతనాలు లభిస్తున్న టాప్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచీలు ఆరు ఉన్నాయి. అయితే వీటిలో ఎక్కువగా వేతనాలు చెల్తిస్తున్నవి విదేశీ టెక్నికల్‌ కంపెనీలే. వాస్తవానికి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పొందుతున్న వేతనం తక్కువే.
ఇండియన్‌ జాబ్‌ మార్కెట్‌ను తరచుగా అధ్యయనం చేస్తున్న సంస్థ పేస్కేల్‌ డాట్‌కామ్‌ ప్రకారం మనదేశంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కి లభిస్తున్న సగటు వేతనం 4.97 లక్షల రూపాయలు మాత్రమే. అంకెలపరంగా చూసినట్లయితే నాలుగు నుంచి అయిదు లక్షల రూపాయల మధ్య ఉంటుంది.

ఇంజనీరింగ్‌లో టాప్‌ పేయింగ్‌ ఉద్యోగాలు

పెట్రోలియం ఇంజనీరింగ్‌

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కంటే పెట్రోలియం ఇంజనీర్‌కే ప్రస్తుతం అధిక వేతనం లభిస్తోంది. వివిధ జర్నల్స్‌, జాబ్‌ సైట్స్‌ అందిస్తున్న డేటా ప్రకారం ఇంజనీరింగ్‌ వారిలో ప్రపంచంలో అత్యధిక వేతనం పొందేవారు పెట్రోలియం ఇంజనీరింగ్‌ అభ్యర్థులే. భూమి నుంచి చమురు, వాయు వెలికితీతలో కీలక పాత్ర పోషించే పెట్రోలియం ఇంజనీర్లకు విదేశాల్లో ఏటా సుమారు రూ.75 లక్షల వేతన ప్యాకేజీ లభిస్తోంది. అదే మన దేశంలో వీరికి 9.44 లక్షల రూపాయల ప్రారంభ వేతనం అందుతోంది. ఇంజనీరింగ్‌ విభాగాల్లో అత్యంత డిమాండ్‌ ఉన్న విభాగం ప్రస్తుతానికి ఇదే.

న్యూక్లియర్‌ ఇంజనీరింగ్‌

పెట్రోలియం లేదా ఆయిల్‌, గ్యాస్‌ తరవాత అత్యంత ప్రధానమైన ఇంధన వనరు న్యూక్లియర్‌ ఎనర్జీ. హైలీ స్పెషలైజ్డ్‌ డొమైన్‌ పరిధిలోకి వచ్చే ఈ రంగంలో న్యూక్లియర్‌ ఇంజనీర్లకు విదేశాల్లో అయితే ఏడాదికి సుమారు 99,000 యుఎస్‌ డాలర్ల నుంచి 142,000 యుఎస్‌ డాలర్ల వరకు చెల్లిస్తున్నారు. అంటే మన ఇండియన్‌ కరెన్సీలో సుమారు 68 లక్షల రూపాయలు. అదే ఇండియాలో వీరికి లభిస్తున్న సగటు వేతనం రూ.8.44 లక్షలు.

ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌

పై రెంటి తరవాత మూడో స్థానంలో ఉన్న అతి కీలకమైన రంగం ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ లేదా రాకెట్‌ సైంటిస్టులు. మెకానికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, డిజైనింగ్‌ అనే మూడు విభాగాల కలయికే ఈ ఏరోస్పేస్‌ రంగం. వీరికి కూడా దాదాపు పెట్రోలియం, న్యూక్లియర్‌ ఇంజనీరింగ్‌ అభ్యర్థులతో సమానంగా వేతనాలు చెల్లిస్తున్నారు. ఇండియాలో ఒక ఏరోస్పేస్‌ ఇంజనీర్‌ ఏడాదికి సంపాదిస్తున్న సగటు వేతనం రూ.8.17 లక్షలు.

ఇంజనీరింగ్‌ మేనేజర్లు

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల కంటే అత్యధిక వేతనాలందుకుంటున్న వారిలో ఇంజనీరింగ్‌ మేనేజర్లు కూడా ఉన్నారు. ఇంజనీరింగ్‌ మేనేజర్‌ అంటే ఇంజనీరింగ్‌ డిగ్రీతో పాటు మేనేజ్‌మెంట్‌ డిగ్రీ కూడా ఉన్నవారు. ఒక ప్రాజెక్టు ఇంజనీర్‌గా తన తోటి ఇంజనీర్లను సమన్వయం చేసుకోవడంలో కావాల్సిన తప్పనిసరి అర్హతలు ఇవి. ఇండియాలో ఒక ఇంజనీరింగ్‌ మేనేజర్‌ పొందుతున్న సగటు వేతనం ఏడాదికి రూ.32.86 లక్షలు.

కెమికల్‌ ఇంజనీరింగ్‌

ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ పెయిడ్‌ ఇంజనీరింగ్‌ ఉద్యోగాల్లో కెమికల్‌ ఇంజనీరింగ్‌కు కూడా డిమాండ్‌ ఉంది. భారీ పరిశ్రమల్లో వీరి అవసరం ఎక్కువగా ఉంటుంది. రీసెర్చ్‌, డిజైనింగ్‌, ప్రాబ్లెమ్‌ సొల్యుషన్స్‌లో కెమికల్‌ ఇంజనీరింగ్‌ అభ్యర్థులు కీలక పాత్రను పొషిస్తారు. హై రిస్క్‌తో కూడిన ఉద్యోగం ఇది. అందుకు తగ్గట్టుగానే వేతన ప్యాకేజీ కూడా భారీగానే ఉంటోంది. ఇండియాలో కెమికల్‌ ఇంజనీర్‌ తీసుకుంటున్న ప్రారంభ సగటు వేతనం రూ.5.89 లక్షలు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Details of jobs beyond software"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0